• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రూ ట్రాక్ చేయ‌కుండా ఉండ‌డానికి సింగిల్ ట్రిక్

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

నేను అమెజాన్‌లో టీ ష‌ర్ట్స్ కొన్నాన‌ని ఫేస్‌బుక్‌కు ఎలా తెలిసింది?   నాకున్న చిన్న చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి కూబా బ్లాగ్స్‌, సోష‌ల్ వెబ్‌సైట్లు ఎలా తెలుసుకోగలుగుతున్నాయి? ఇలాంటి ప్ర‌శ్న‌లు మీకెప్పుడైనా వ‌చ్చాయా.. ఇదే కాదు ఇంట‌ర్నెట్లో మీరు స‌ర్ఫ్ చేసే ప్ర‌తి అంశం, విజిట్ చేసే ప్ర‌తి పేజీ డేటా మీ డిజిట‌ల్ ప్రొఫైల్‌ను త‌యారు చేసేస్తాయి. trackers అనే చిన్న‌చిన్న స్క్రిప్ట్‌లు మీ బ్రౌజ‌ర్‌కు ఎటాచ్ అయి మీరు నెట్‌లో చేసే ప్ర‌తి చిన్న యాక్ష‌న్‌ను ప‌సిగ‌ట్టేస్తాయి. త‌ర్వాత ఈ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను వెబ్‌సైట్ల ఆల్గ‌రిథ‌మ్స్ ఉప‌యోగించుకుని మీరు సెర్చ్ చేసిన అంశాల‌కు సంబంధించిన యాడ్స్‌ను, ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌ను మీకు చూపించ‌డం, మెయిల్స్ కాల్స్ చేస్తుండ‌డం జ‌రుగుతుంది.  ఇలా మిమ్మ‌ల్ని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయ‌కుండా ఉండ‌డానికి బెస్ట్ సొల్యూష‌న్స్ చూద్దాం. 

 డెస్క్‌టాప్‌కి గోస్ట‌రీ

డెస్క్‌టాప్‌ల‌కి అయితే Ghostery అనే ఫ్రీ బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌ను వాడుకోవ‌చ్చు. ఇది ట్రాకర్స్‌ను రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంతేకాదు గోస్ట‌రీ డ్యాష్‌బోర్డు..  గ‌తంలో మీ డిజిట‌ల్ ప్రొఫైల్‌కు అసోసియేట్ ఉన్న ప్ర‌తి ట్రాక‌ర్ గురించి మీకు లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుదంది.  ట్రాక‌ర్స్‌ను రెస్ట్రిక్ట్ చేయ‌డం వ‌ల్ల  వీక్ నెట్‌వ‌ర్క్ క‌నెక్ష‌న్‌లో కూడా వెబ్‌సైట్లు స్పీడ్‌గా లోడ‌వ‌డానికి ఛాన్స్ ఉంటుంది.  ఇది మ‌రో ప్ల‌స్‌పాయింట్ . గోస్ట‌రీ ఉంటే ప‌ని చేయ‌ని, మీకు అవ‌స‌ర‌మైన సైట్‌లు ఏమైనా ఉంటే  వాటిని trusted sites లిస్ట్‌లో యాడ్ చేసుకుంటే ఆ సైట్స్ ఓపెన‌వుతాయి.

గోస్ట‌రీ ఉచిత సాఫ్ట్‌వేర్‌. క్రోమ్‌, స‌ఫారీ, ఫైర్‌ఫాక్స్‌,ఎడ్జ్ వంటి అన్ని మేజ‌ర్ బ్రౌజ‌ర్‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది. గోస్ట‌రీ కాద‌నుకుంటే  Privacy Badger అనే మ‌రో బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్స్‌కు ఫైర్‌ఫాక్స్ ఫోక‌స్

గోస్ట‌రీలో మొబైల్ యాప్ కూడా ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్ల‌కు ఫైర్‌ఫాక్స్ ఫోక‌స్ బెట‌ర్ ఆప్ష‌న్‌. Browse like no one’s watching అనే ఆప్ష‌న్‌ను అనేబుల్ చేసుకుంటే స్మార్ట్‌ఫోన్‌లో  కుకీస్‌, వెబ్ ట్రాక‌ర్స్‌ను బ్లాక్ చేయొచ్చు.  ఈజీ ఇంట‌ర్‌ఫేస్‌తో వ‌చ్చే ఈ యాప్ కేవ‌లం 4 ఎంబీ సైజ్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో ఫ్రీగా దొరుకుతుంది.

జన రంజకమైన వార్తలు