• తాజా వార్తలు
  •  

వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ లో వీడియో కాల్‌ను రికార్డు చేయ‌డం ఎలా ?.

వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌ల‌లో వీడియో కాల్స్ చేయ‌డం చాలా సాధార‌ణ విష‌యం. అయితే ఈ వీడియో కాల్స్‌లో కీల‌క‌మైన‌, అవ‌స‌ర‌మైన కాల్స్ కూడా ఉంటాయి. మ‌రి వాటిని దాచుకోవ‌డం ఎలా? అవి మీకు మ‌ళ్ళీ కావాలంటే విన‌డం లేదా చూడ‌డం ఎలా? అందుకు ఒక ఆప్ష‌న్ ఉంది. మ‌నం వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ కాల్స్‌ను రికార్డు చేసుకోవ‌చ్చు. దీనికి కొన్ని ప్ర‌త్యేక‌మైన యాప్‌లు ఉన్నాయి. మ‌రి అవేంటో చూద్దాం..

ఆండ్రాయిడ్‌లో వాట్స‌ప్, ఫేస్‌బుక్ కాల్స్‌ను రికార్డు చేయ‌డ‌మిలా..
ఆండ్రాయిడ్‌లో వాట్స‌ప్‌, ఫేస్‌బుక్  కాల్స్‌ను రికార్డు చేయ‌డం. దానికి కొన్ని యాప్‌లు ఉన్నాయి. మీరు కాల్ మాట్లాడుతున్న‌ప్పుడే స్క్రీన్ మీద ఈ యాప్‌లు క్లిక్ చేస్తే చాలు మీ వాయిస్ ఆటోమెటిక్‌గా రికార్డు అయిపోతుంది.  ఇది రికార్డు చేయ‌డం చాలా సుల‌భం. మీరు కాల్ మాట్లాడుతున్న‌ప్పుడు ఫ్లోటింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు.

ఎ-జెడ్ స్క్రీన్ రికార్డ‌ర్‌
ఏ జెడ్ స్క్రీన్ రికార్డ‌ర్ ద్వారా వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ కాల్స్‌ను రికార్డు చేయ‌చ్చు. దీని కోసం ఇదో బెస్ట్ యాప్.  ఇందుకోసం రూట్ యాక్సిస్ అవ‌స‌రం లేదు. వాట‌ర్ మార్క్‌తో ఇబ్బంది ఉండ‌దు. యాడ్ ఫ్రీ, ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. మీరు చేయాల్సింద‌ల్లా కాల్ పూర్త‌య్యాక రికార్డింగ్ ఆప‌డ‌మే. ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్ మీకు అంద‌మైన స్క్రీన్ కాస్ట్ వీడియోస్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

ఫుల్ హెచ్‌డీ వీడియో స్క్రీన్ రికార్డింగ్ విత్ రెజ్యూమ్, పాజ్ ఆప్ష‌న్లు

మైక్ నుంచి ఆడియాను రికార్డు చేయ‌డం

సింగిల్ క్లిక్  ద్వారా స్క్రీన్‌పై ఉన్నఫ్లోటింగ్ ఐకాన్ ద్వారా ఎప్పుడైనా రికార్డింగ్ చేసుకోవ‌చ్చు

మీ వీడియో కాల్‌ను మీ ఫ్రంట్ కెమెరాతో కూడా రికార్డు చేసుకునే స‌దుపాయం ఉంది

కౌంట్‌డౌన్ టైమ‌ర్‌, డ్రా ఆన్ స్క్రీన్‌, ట్రిమ్ వీడియోలు, వీడియో రిజ‌ల్యూష‌న్ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి.

డ్యు రికార్డ‌ర్ ద్వారా రికార్డు చేయ‌డం..
ఆండ్రాయిడ్ ఫోన్లో డ్యు రికార్డ‌ర్‌, వీడియో ఎడిట‌ర్ ఆప్ష‌న్ల‌ను ఉప‌యోగించి కూడా మీరు వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ కాల్‌ను రికార్డు చేసుకునే అవ‌కాశం ఉంది. అంతేకాదు మీరు రికార్డు చేసుకున్న కాల్‌ను ఎడిట్ చేసుకునే అవ‌కాశం కూడా దీనిలో ఉంది. 

డ్యు రికార్డ‌ర్ యాడ్ ఫ్రీ, రూట్ ఉండ‌దు రికార్డు చేయ‌డానికి లిమిట్ లేదు

ఎడిట్‌తో పాటు స్క్రీన్ షాట్లు కూడా తీసుకోవ‌చ్చు

ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌లో మీ వీడియోల‌ను షేర్ చేయ‌డం చాలా సుల‌భం

20 భాష‌ల్లో ఇది లభ్యం అవుతోంది

జీఐఎఫ్ వీడియో చేసుకోవడం కూడా దీని ద్వారా సాధ్యం.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు