• తాజా వార్తలు

గూగుల్ పాస్‌వ‌ర్డ్ నాన్ గూగుల్ పేజీపై ఎంటర్ చేస్తే అలెర్ట్ రావాలంటే ఎలా ?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

గూగుల్‌... మనం కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే అడ్రెస్ బార్‌లో మొద‌ట టైప్ చేసే పేరిది.  అంత‌గా కంప్యూట‌ర్ వాడేవాళ్ల‌తో క‌లిసిపోయింది ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం. అందుబాటులోఎన్నో సెర్చ్ ఇంజ‌న్లు ఉన్నా గూగుల్ సంపాదించుకున్న పేరు, దీనికున్న ప్ర‌తిష్ట మిగిలిన ఏ సంస్థ‌కూ లేవు. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువమంది ప్రిఫ‌ర్ చేసేది ఈ సైట్‌నే అయితే త‌న‌పై వినియోగ‌దారులు పెట్టుకున్నన‌మ్మ‌కాన్నివ‌మ్ము చేయ‌కుండా  భ‌ద్ర‌త ప‌రంగా చాలా చ‌ర్య‌లు తీసుకుంటుంది గూగుల్‌. దీనిలో భాగంగానే పాస్‌వ‌ర్డ్‌, పిన్ లాంటి ఎన్నో ప్రైవ‌సీ ఆప్ష‌న్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే  గూగుల్ పాస్‌వ‌ర్డ్ చాలా కీల‌క‌మైంది. దీన్ని నాన్ గూగుల్ పేజీలో ఎంట‌ర్ చేస్తే మ‌న‌కు ఇబ్బందే. మ‌రి ఇలా ఎంట‌ర్ చేసిన‌ప్పుడు మ‌న‌కు అలెర్ట్ రావ‌డం ఎలాగో తెలుసా?

ఈ చిట్కాలు పాటించండి
హోం పేజీ లింక్‌ను ఉప‌యోగించి పాస్‌వ‌ర్డ్ అలెర్ట్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.  ఆ త‌ర్వాత మీ గూగుల్ అకౌంట్లోకి లాగిన్  అయితేనే ఎక్స్‌టెన్ష‌న్ ప‌ని చేయ‌డం ప్రారంభిస్తుంది. అప్ప‌టికే  గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉంటే లాగౌట్ అయి మ‌రోసారి లాగిన్ కావాలి. ఎక్స్‌టెన్ష‌న్ వ‌ర్క్ కాక‌పోతే మీ పీసీని రీస్టార్ట్ చేయాలి.

ఆ త‌ర్వాత  వెబ్‌సైట్ పేజీని ఓపెన్ చేయాలి.  ఆ త‌ర్వాత పాస్‌వ‌ర్డ్ ఫీల్డ్‌లో మీ గూగుల్ పాస్‌వ‌ర్డ్‌ని ఎంట‌ర్ చేయాలి. ఆ వెంట‌నే పాస్‌వ‌ర్డ్ అలెర్ట్ పేజీ ఒక‌టి న్యూ టాబ్‌లో ఓపెన్ అవుతుంది.      

మీరు నాన్ గూగుల్ పేజీలో పాస్‌వ‌ర్డ్ ఎంటర్ చేస్తే మీకు వెంట‌నే అలెర్ట్ వ‌స్తుంద‌ని ఆ  ట్యాబ్‌లో మ‌న‌కో మెసేజ్ క‌న‌బ‌డుతుంది. దాంతో పాటు మూడు ఆప్ష‌న్లు కూడా మ‌న‌కు క‌నిపిస్తాయి.

1. రీసెట్ పాస్‌వ‌ర్డ్  (గూగుల్ అకౌంట్‌కి)
2. ఇగ్నోర్ దిస్ టైమ్ (వెబ్‌సైట్‌లో గూగుల్ పాస్‌వ‌ర్డ్ కోసం)
3. ఆల్వేస్ ఇగ్నోర్ ఫ‌ర్ ద సైట్ (పాస్‌వ‌ర్డ్ అలెర్ట్ ఎప్ప‌డూ రిసీవ్ కాదు)

దీనిలో మీకు స‌రిపోయే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. గూగుల్ ద్వారా వ‌చ్చిన  ఈ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌తో మీరు నాన్ గూగుల్ పేజీలో పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేసినా  వెంట‌నే మీకు అలెర్ట్ వ‌చ్చేస్తుంది. దీంతో మీరు జాగ్ర‌త్త‌ప‌డొచ్చు.

జన రంజకమైన వార్తలు