• తాజా వార్తలు

గెలాక్సీ ఎస్‌9ను రూ.10 వేల క‌న్నా త‌క్కువ ధ‌ర‌లో పొంద‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

శాంసంగ్ గెలాక్సీ...ఇది భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోయే మోడ‌ల్‌. విజ‌య‌వంత‌మైన ఈ మోడ‌ల్‌లో వీలైన‌న్ని ఎక్కువ వెరైటీల‌ను తీసుకొస్తోంది ఈ కొరియా సంస్థ‌.  ఈ నెల 16వ తేదీనే ఇది అరంగేట్రం చేయ‌బోతోంది. అయితే తాజాగా అలాంటి కోవ‌లోనే మార్కెట్లోకి వ‌చ్చింది గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌. దీని ప్ర‌స్తుత మార్కెట్ ధ‌ర రూ.57900 . నిజానికి ఇంత ధ‌ర పెట్టి ఈ ఫోన్ కొన‌డానికి పెద్ద‌గా అంద‌రూ ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చు. మ‌రి ఇదే ఫోన్ మీకు రూ.10 వేల లోపే వ‌స్తే! అదెలా అంటారా? మ‌రి అదెలాగో చూద్దాం..

ఎయిర్‌టెల్ సాయంతో..
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్ల‌స్ ఎయిర్‌టెల్ పార్ట‌న‌ర్‌షిప్‌తో కొత్త ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది శాంసంగ్‌. ప్ర‌స్తుతం ఈ ఫోన్ల మార్కెట్ ధ‌ర భారీగా ఉంది. అంటే 64 జీబీ, 256 జీబీ మోడ‌ల్స్‌లో ఉన్న గెలాక్సీ ఎస్‌9 ధ‌ర రూ.57900, రూ.65900గా ఉంది. 64 జీబీ, 256 జీబీ వేరియంట్స్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ ధ‌ర రూ.64,900, 72,900గా ఉంది.  అయితే ఎయిర్‌టెల్‌తో భాగ‌స్వామి అయిన శాంసంగ్ ఈ ఫోన్ల‌ను రూ10 వేల కంటే త‌క్కువ ధ‌ర‌కే ఇస్తుంది. ఇది న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా నిజ‌మే. ఈ ఆఫ‌ర్‌ను పొంద‌డానికి ఎయిర్‌టెల్ యూజ‌ర్లు ముందుగా రూ.9900 డౌన్ పేమెంట్ చేసి 24 నెల‌ల పాటు  రూ.2499 ప్లాన్ తీసుకోవాలి.  దీనికి  2 టెరా బైట్ డేటా బెనిఫిట్ కూడా ఉంటుంది. 

డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌
గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ యూజ‌ర్లు ఎయిర్‌టెల్ డ‌బుల్ డేటా ఆఫ‌ర్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. వాళ్లు రూ.199, రూ.499, రూ.799, రూ.999 ఆఫ‌ర్ల‌లో ఒక‌దాన్ని ఎంచుకోవాలి. అప్పుడు 3జీ, 4జీ డేటాను పొందొచ్చు. దీనితో పాటు అమేజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా పొందే అవ‌కాశం ఉంటుంది.  గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్‌ను పేటీఎంతో కొంటే మీరు రూ.6000  క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశం ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌కార్డు ఉంటే మ‌రో రూ.6000 వేలు క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. దీనికి తోడు శాంసంగ్ రూ.6000 వేలు అద‌నంగా బోన‌స్ వ‌స్తోంది. వొడాఫోన్ ద్వారా కొంటే మీకు ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. ఇవ‌న్నీ లెక్క‌లోకి తీసుకుంటే రూ.50 వేలు పైన ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్ల‌స్ ఫోన్ల‌ను మీరు రూ.10 వేల లోపే పొందే అవ‌కాశం ఉంటుంది.  

జన రంజకమైన వార్తలు