• తాజా వార్తలు
  •  

ఆధార్ సుర‌క్షితం చేయ‌డానికి ప్ర‌భుత్వం తెస్తున్న‌వ‌ర్చువ‌ల్ ఐడీ ఎలా ప‌నిచేయ‌నుంది?

ఇండియాలో దాదాపు 95 శాతం మందికి ఆధార్ కార్డు ఉంది. ఆ  కార్డు ఇప్పుడు  అన్నింటికీ అవ‌స‌ర‌మ‌వుతోంది. గ్యాస్, బ్యాంక్ క‌నెక్ష‌న్‌, పాన్ కార్డ్‌, ఆస్తుల కొనుగోలు ఇలా అన్నింటికీ ఆధార్‌తో లింక్ పెట్టింది ప్ర‌భుత్వం. ఫిబ్ర‌వ‌రి 6లోగా మొబైల్ నెంబ‌ర్‌ను కూడా ఆధార్‌తో రీవెరిఫై చేయించుకోవాల‌ని గ‌డువు పెట్టింది. అయితే ఇప్ప‌టికీ ఆధార్ భ‌ద్ర‌త మీద ఎన్నో అనుమానాలున్నాయి. చిన్న‌విష‌యాల‌కు కూడా ఆధార్ నెంబ‌ర్ ఇవ్వడంతో వ్య‌క్తుల ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ బ‌హిర్గ‌త‌మ‌వుతున్నాయ‌ని ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఓ పత్రిక ఆధార్ వివ‌రాలు 500 రూపాయ‌ల ధ‌ర‌కు కూడా దొరికేస్తున్నాయ‌ని క‌థ‌నం రాయ‌డంతో గ‌వ‌ర్న‌మెంట్ వేగంగా స్పందించింది.  ఆధార్‌ భద్రత కోసం యూఐడీఏఐ వర్చువల్‌ ఐడీ, పరిమిత కేవైసీ కోడ్‌ అనే రెండంచెల భద్రతా వ్యవస్థను బుధవారం ప్రవేశపెట్టింది. దీంతో ఆధార్ వివరాలు బ‌య‌టికి వెల్లడ‌వ‌కుండా ఉంటాయ‌ని చెబుతోంది. 
ఏమిటీ వ‌ర్చువ‌ల్ ఐడీ ?
ఆధార్‌ను లింక్ చేసిన‌ప్పుడు ఆధార్ నెంబ‌ర్‌కు బ‌దులుగా క‌నిపించేలా వ‌ర్చువ‌ల్ ఉండబోతోంది. అంటే ఆధార్‌ నంబర్లకు బదులు వేరే 16 అంకెల నంబర్‌ డిస్‌ప్లే అవుతుంది. ఇదే వ‌ర్చువ‌ల్ ఐడీ. దాంతో  ఆధార్ నెంబ‌ర్‌లో ఉన్న‌వ్య‌క్తిగ‌త వివ‌రాలన్నీ తెలిసే అవకాశం ఉండదు.  ఈ విధానం జూన్‌ 1 నుంచి అన్ని ఆధార్‌ ఏజెన్సీల్లో అమలు కానుంది.
ఎలా ప‌నిచేస్తుంది? 
1. యూజ‌ర్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వ‌ర్చువ‌ల్ ఐడీని క్రియేట్ చేసుకోవ‌చ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్లు లేదా ఎంఆధార్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్నిక్రియేట్ చేసుకోవ‌చ్చు.  
2. యూజ‌ర్ కావ‌ల్సిన‌న్నివ‌ర్చువ‌ల్ ఐడీలు క్రియేట్ చేసుకోవ‌చ్చు. కొత్త‌ది వాడ‌గానే పాత ఐడీ ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అయిపోతుంది.
3.  వ‌ర్చువ‌ల్ ఐడీ అనేది 16 అంకెల నంబ‌ర్‌.  ఇది  మీ ఆధార్ నెంబ‌ర్‌కు లింక్ అయి ఉంటుంది. 
4.16 అంకెల్లో చివ‌రి అంకె మీ ఆధార్ నెంబ‌ర్‌ను వెర్‌హాఫ్ ఆల్గ‌రిథ‌మ్ ద్వారా తెలుసుకుంటుంది. ఈ వెర్‌హాఫ్ ఆల్గ‌రిథ‌మ్‌ను డ‌చ్ గ‌ణిత‌శాస్త్రవేత్త జాకోబ్స్ వెర్‌హాఫ్ 1969లో డెవ‌ల‌ప్ చేశారు.
5. వ‌ర్చువ‌ల్ ఐడీ ద్వారా మీ పేరు, ఫొటో, అడ్ర‌స్  వంటి ఐడెంటిటికీ సంబంధించిన కొన్ని వివ‌రాలు మాత్రమే క‌నిపిస్తాయి.  ఆధార్ నెంబ‌ర్ ద్వారా వ‌చ్చిన‌ట్లు వ్య‌క్తి మొత్తం వివ‌రాలు తెలియ‌వు.  ఆధార్ అడిగే ఏజెన్సీల‌కు వ‌ర్చువ‌ల్ ఐడీలో ఉండే ఐడెంటిటీ డిటెయిల్స్ సరిపోతాయ‌ని, దీనివ‌ల్ల‌ మీ ప్రైవ‌సీకి ఎలాంటి భంగం వాటిల్ల‌ద‌ని గ‌వ‌ర్న‌మెంట్ చెబుతోంది.
7. కేవైసీలో ఆధార్ నెంబ‌ర్ అడిగే గ్యాస్‌, మొబైల్ లాంటి అన్నిఏజెన్సీల‌కు ఈ వ‌ర్చువ‌ల్ ఐడీ ఇస్తే స‌రిపోయేలా ఎమెండ్‌మెంట్స్ తేనున్నారు. 8.వ‌ర్చువ‌ల్ ఐడీని డీ డూప్లికేష‌న్ చేయ‌లేరు. మీ వ‌ర్చువ‌ల్ ఐడీ కొంత‌కాలం త‌ర్వాత ఆటోమేటిగ్గా డిజేబుల్ అయిపోతుంది. కొత్త‌ది మ‌ళ్లీ యూజ‌ర్ క్రియేట్ చేసుకోవ‌చ్చు.


 

జన రంజకమైన వార్తలు