• తాజా వార్తలు

వెబ్ సైట్ లను డెస్క్‌టాప్ అప్స్ గా క‌న్వ‌ర్ట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీకు ఒక వెబ్‌సైట్ ఉంటే దాన్ని ఏ బ్లాగ్ గానో లేదా యాప్‌గానో మార్చుకోవ‌చ్చ‌ని ఎంత మందికి తెలుసు. ఇదో పెద్ద ప్ర‌క్రియ‌ని అంతా అనుకుంటారు. దీని కోసం సాఫ్ట్‌వేర్ నిపుణులు రావాల‌ని భావిస్తారు. కానీ కొన్ని సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే ఇది చాలా చాలా సుల‌భం.  అయితే అది ప‌క్కా వెబ్‌సైట్ అయి ఉండాలి. లేక‌పోతే వెబ్ బేస్డ్ యాప్ అయి ఉండాలి. అప్పుడు మాత్ర‌మే క‌న్వ‌ర్ట్ చేయ‌డం చాలా సుల‌భం. ఈ ప్రాసెస్ అంతా చేయ‌డానికి మీరు నోడ్.జేస్  క‌మాండ్ ప్రాంప్ట్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. 

వెబ్‌సైట్ టు డెస్క్‌టాప్ యాప్‌..
మీ వెబ్‌సైట్‌ను డెస్క్‌టాప్ యాప్‌గా మార్చాలంటే ముందుగా నోడ్.జేఎస్‌ను మీ పీసీలోకి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  ఇదో జావా స్క్రిప్ట్ దీని ద్వారానే మొత్తం  ప్ర‌క్రియ అంతా జ‌రుగుతుంది. దీన్ని క్రోమ్ వీ8 జావా స్క్రిప్ట్ ఇంజిన్ ద్వారా బిల్ట్ చేశారు. 

నోడ్ జేఎస్ వెబ్‌పేజీకి వెళితే యూజ‌ర్లు కొత్త వెర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే కొత్త వెర్ష‌న్ ఒకవేళ వ‌ర్క్ కాక‌పోతే పాత వెర్ష‌న్‌కు వెళ్లొచ్చు. 

ఈ వెర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేష‌న్ త‌ర్వాత నోడ్.జేఎస్ క‌మాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయాలి. 

స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి సీఎండీ అని టైప్ చేయాలి. విండోస్ క‌మాండ్ ప్రాంప్ట్‌తో పాటు నోడ్.జేఎస్ క‌మాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ర‌న్ చేయాలి. 

ఆ త‌ర్వాత నేటివ్‌ఫైర్ టూల్ ఇన్‌స్టాల్ చేయాలి. వెబ్‌సైట్ నుంచి యాప్‌కు క‌న్వ‌ర్ట్ చేయ‌డానికి  కావాల్సింది ఇదే. ఆ త‌ర్వాత క‌మాండ్ రాసి, మీ వెబ్‌సైట్ యుఆర్ఎల్ టైప్ చేయాలి.  దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు మీరు మీ సైట్‌ను యాప్‌గా మార్చేసుకున్న‌ట్లే. 

జన రంజకమైన వార్తలు