• తాజా వార్తలు
  •  

సీఎస్‌వీ  ఫైల్ నుంచి లొకేష‌న్  తీసుకోవ‌డం, ఫొటోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌డం ఎలా?

సీఎస్‌వీ ఫైల్ నుంచి ఒక్కోసారి ఫొటోలు తీసుకోవాల్సి వ‌స్తుంది. కానీ ఇది అనుకున్నంత సుల‌భం కాదు. ఫొటోల కోసం వాడే ఫార్మాట్ వ‌ల్ల డౌన్‌లోడ్ చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఒక్క ఫొటోకే ఇలా ఇబ్బంది ఎదురైతే..గ్రూప్ ఆఫ్ ఫొటోల‌ను ఎక్స్‌పోర్ట్ లేదా ఇన్‌పోర్ట్ చేంసుకోవాలంటే చాలా క‌ష్టం. అయితే కొన్ని టూల్స్‌ను ఉప‌యోగించి సీఎస్‌వీ ఫైల్స్‌లో ఉన్న ఫొటోల‌ను సుల‌భంగా ఇంపోర్ట్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌, జీపీఎస్ లాంగిట్యూడ్‌, జీపీఎస్ లాటిట్యూడ్ లాంటి జీపీఎస్ డేటాను  సీఎస్‌వీ ఫైల్స్‌లోకి ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవ‌చ్చు. 

సెట్ ఆఫ్ ఫొటోల‌ను చేసుకోవాలంటే..
మీ ద‌గ్గ‌ర కొన్ని బంచ్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. వాటిని సీఎస్‌వీ ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలి. కానీ ఒక ఫొటో అయితే ఫ‌ర్వాలేదు కానీ..మ‌రీ  ప‌దుల సంఖ్య‌లో ఫొటోల‌ను ఎక్స్‌పోర్ట్ చేయ‌డం అంత సుల‌భం కాదు. దీని కోసం ఒక సింపుల్ ఫ్రీవేర్, క‌మాండ్ లైన్‌ను ఉపయోగించొచ్చు. మీ ద‌గ్గ‌ర సెట్ ఆఫ్ ఫొటోలు ఉంటే వాటిని ఒక మ్యాప్ మీద విజువ‌లైజ్ చేసుకోవాలి. అయితే ముందుగా మీరు ఏ ప్లేస్‌లో ఫొటోలు తీసుకున్నారో ఆ లొకేష‌న్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా ప‌ని చేస్తుందంటే..
మీ ఫొటోల నుంచి తీసుకున్న లొకేష‌న్ డేటాను ఎక్క‌డైనా వాడుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరో ట్రావెల్ బ్లాగ్‌ను సృష్టించాల‌ని అనుకుంటే ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫొటోల నుంచి జీపీఎస్ లొకేష‌న్‌ను గ్ర‌హించి సీఎస్‌వీ ఫైల్‌లో ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలో ఇక్క‌డ చూద్దాం.. ఫ్రీ వేర్ ద్వారా ఫొటోస్ లేదా గ్రూప్ ఫొటోల నుంచి లొకేష‌న్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవ‌చ్చు. ఎలాంటి మెటా డేటా ఇన్ఫ‌ర్‌మేష‌న్ అయినా ఈ టూల్ ద్వారా గ్ర‌హించే అవ‌కాశం ఉంది. సీఎస్‌వీ ఫైల్‌ను ఎక్స్‌పోర్ట్ చేసిన త‌ర్వాత ఇమేజ్‌, లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్ ఇత‌ర జీపీఎస్ పారా మీట‌ర్స్ ను యాడ్ చేసుకుంటుంది. మీరు ఏ ఫొటోల‌కు సంబంధించిన జీపీఎస్‌ను టాగ్ చేయాల‌నుకుంటున్నారో దాన్ని చూజ్ చేసుకుంటే చాలు మిగతా ప‌నంతా ఈ టూల్ చూసుకుంటుంది.

క‌మాండ్ లైన్‌ను ఉప‌యోగించి..
ఫ్రీ క‌మాండ్ లైన్ యుటిలిటీని ఉప‌యోగించి ఫొటోల‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవ‌చ్చు.  ఎక్స్ఇఫ్ టూల్‌ను వాడితే మీరు  మీ ఫొటోల‌కు సంబంధించిన  లొకేష‌న్‌ను ట్రాక్ చేయ‌చ్చు. చాలా అప్లికేష‌న్లు ఎక్స్ఇఫ్ మెటా డేటా ఫొటోల‌తో డీల్ చేస్తాయి.. కానీ స్టాండ్ అలోన్ సాఫ్ట్‌వేర్‌తో సైతం మ‌నం ఫొటోల‌ను జీపీఎస్ ట్యాగింగ్ చేయ‌చ్చు.సింగిల్ క‌మాండ్ సాయంతో మీరు  ఫొటోస్‌లోని జీపీఎస్ డేటాను ఎక్స్‌ట్రాక్ట్ చేయ‌చ్చు.

జన రంజకమైన వార్తలు