• తాజా వార్తలు
  •  

వెబ్‌కామ్‌ను ఉప‌యోగించి యూట్యూబ్‌లో లైవ్ ఇవ్వ‌డం ఎలా?

యూట్యూబ్ అంటే కేవ‌లం వీడియోలు చూడ‌టానికి మాత్ర‌మేనా.  ఇంకా దానితో ఉప‌యోగాలేమీ లేవా? అంటే చాలానే ఉన్నాయి. కానీ యూట్యూబ్ అన‌గానే మ‌న‌కు వీడియోలు చూడ‌డం.. లేదా అప్‌లోడ్ చేయ‌డం వ‌ర‌కు మాత్రం ప‌రిమితం అవుతున్నాం. అయితే ఈ వీడియోలు మాత్ర‌మే కాదు యూట్యూబ్‌ను ఉప‌యోగించి లైవ్‌కు రావొచ్చు. ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించేవాళ్లు చాలా త‌క్కువ‌మంది ఉంటారు. ఫేస్‌బుక్ లైవ్‌ను ఉప‌యోగించున్నంత‌గా కూడా యూట్యూబ్ లైవ్‌ను వాడ‌ట్లేదు. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. యూట్యూబ్ లైవ్ చేయాలంంటే దానికి వెబ్‌కామ్ త‌ప్ప‌నిస‌రి. మ‌రి వెబ్‌కామ్‌ను ఉప‌యోగించి లైవ్ ఎలా ఇవ్వాలో చూద్దాం..

ఎలా చేయాలంటే..
1. యూట్యూబ్ లైవ్ ఇవ్వాలంటే ముందుగా యూట్యూబ్.కామ్ లింక్‌ను మీ వెబ్ బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఓపెన్ చేసి లైవ్ ఆప్ష‌న్ క్లిక్ చేసిన త‌ర్వాత అది మీ వెబ్ కామ్‌, మైక్రోఫోన్‌ల‌కు యాక్సెస్ ఇవ్వ‌మ‌ని అడుగుతుంది. ఒక‌సారి మీరు ఆ స్టెప్ ఫాలో అయిన త‌ర్వాత మీరు నేరుగా వెబ్‌కామ్‌ను ఉప‌యోగించి యూట్యూబ్ లైవ్ ఇవ్వొచ్చు.

2. లైవ్ స్ట్రీమింగ్‌లో మీకు ఒక పాప‌ప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్క‌డ మీరు కొంత లైవ్ స్ట్రీమ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవ‌సీ, డిస్క్రిప్ష‌న్‌, కెమెరా లేదా మైక్రోఫోన్ డివైజ్ ఎంచుకోవ‌డం లాంటి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే కాక మీరు కొన్ని అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్, చాట్, ఏజ్ రిస్ట్రిక్ష‌న్‌, పెయిడ్ ప్ర‌మోష‌న్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వాలి. 

3. సెట్టింగ్స్‌లో అంతా ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చిన త‌ర్వాత సింపుల్‌గా నెక్ట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. ఆ త‌ర్వాత మీకు ఒక కెమెరా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లైవ్ వీడియో తంబ్‌నైల్ కోసం ఒక సెల్ఫీ తీసుకోవాల‌ని అడుగుతుంది. ఆ త‌ర్వాత గో లైవ్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి ప్రొసీడ్ చేయాలి. 

4. ఆ త‌ర్వాత కొత్త విండో ఓపెన్ అయి మీరు లైవ్‌లోకి వెళ‌తారు. ఆ త‌ర్వాత మీరు యూఆర్ఎల్‌ను ఉప‌యోగించి మీ స్నేహితుల‌ను  బ్రాడ్‌కాస్టింగ్‌కు ఆహ్వానించొచ్చు.  మీ స‌బ్‌స్కైబ‌ర్ల‌తో పాటు యూట్యూబ్ యూజ‌ర్లు మీ చాన‌ల్‌తో పాటు లైవ్ చూసే అవ‌కాశం ఉంటుంది. మీరు లైవ్‌లో ఉన్న‌ప్పుడు ఎంత‌మంది మీ లైవ్ చూస్తున్నారో.. ఎంత‌మంది లైక్స్ కొడుతున్నారో కామెంట్ చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు.

జన రంజకమైన వార్తలు