• తాజా వార్తలు

ఓ పూర్తి వెబ్‌పేజీని స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఇంట్లో కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే ఏదో ఆస‌క్తిక‌ర‌మైన వెబ్‌సైట్  పేజీ క‌నిపించింది.  చదువుదామంటే ఆఫీస్‌కెళ్లే టైమ‌యిపోతుంది. అలాంట‌ప్పుడు ఏం చేస్తాం? మ‌ళ్లీ వ‌చ్చాక లేదా ఆఫీస్‌లోనో చూడాలి. అదేం అక్క‌ర్లేదు. ఆ వెబ్‌పేజీని పూర్తిగా మీ స్మార్ట్‌పేజీలో సేవ్ చేసుకుని కావాలనుకున్న‌ప్పుడు దానిలోనే చ‌దువుకోవ‌చ్చు.   ఈ ఆప్ష‌న్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని డిఫాల్ట్ బ్రౌజ‌ర్ (క్రోమ్‌)లో, ఐఫోన్ బ్రౌజ‌ర్ (స‌ఫారీ)లోనూ కూడా అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్రోమ్‌ బ్రౌజ‌ర్‌లో వెబ్‌పేజీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

* స్మార్ట్‌ఫోన్‌లో క్రోమ్ బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేయాలి.

ఇప్పుడు  మీరు సేవ్ చేయాల‌నుకునే వెబ్‌పేజీని ఓపెన్ చేయాలి.

 * రైట్‌సైడ్ టాప్ కార్న‌ర్‌లో ఉండే త్రీ (...) డాటెడ్ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి.

 * ఇప్పుడు దానిలో డౌన్ యారోలా క‌నిపించే  సెకండ్ ఆప్ష‌న్ ను టాప్ చేస్తే చాలు మీ వెబ్‌పేజీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ అయిన‌ట్లే.

* వెన‌క్కి వెళ్లి ఆ త్రీ డాటెడ్ ఆప్ష‌న్‌ను మ‌రోసారి క్లిక్ చేసి దానిలో ఉండే Downloads ఆప్ష‌న్‌ను ట్యాప్ చే స్తే మీరు డౌన్‌లోడ్ చేసిన వెబ్‌పేజీల‌న్నీ క‌నిపిస్తాయి.

*మీరు డౌన్‌లోడ్ చేసిన వెబ్‌పేజీల‌న్నీ డేట్ వైజ్‌గా సెగ్రిగేట్ చేసి మీకు చూపిస్తుంది. 

ఐ ఫోన్‌లో స‌ఫారీ బ్రౌజ‌ర్‌లో వెబ్‌పేజీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

* ఐఫోన్‌లో స‌ఫారీ బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేయాలి.

ఇప్పుడు  మీరు సేవ్ చేయాల‌నుకునే వెబ్‌పేజీని ఓపెన్ చేయాలి.

 * దీనిలో బాట‌మ్‌లో ఉండే యాక్ష‌న్ బ‌ట‌న్ ( యారోతో ఉండే స్క్వేర్ బ‌ట‌న్‌) ట్యాప్ చేయాలి.

 * ఇప్పుడు దానిలో Add to reading list అనే  థ‌ర్డ్ ఆప్ష‌న్ ను టాప్ చేస్తే చాలు ఆ వెబ్‌పేజీ ఐఫోన్‌లో సేవ్ అయిన‌ట్లే.

* బుక్‌మార్క్స్‌లోకి  వెళ్లి ఓపెన్ బుక్‌లా క‌నిపించే బ‌ట‌న్‌ను  ట్యాప్ చేస్తే  మీరు డౌన్‌లోడ్ చేసిన వెబ్‌పేజీల‌న్నీ క‌నిపిస్తాయి.

* దీనిలో మ‌ధ్య‌లో రీడింగ్ గ్లాసెస్‌లా క‌నిపంచే ఆప్ష‌న్‌ను ట‌చ్ చేస్తే మీ రీడింగ్ లిస్ట్‌లో స్టోర‌యి ఉన్న వెబ్‌పేజీల‌న్నీ చూపిస్తుంది. 

* అంతేకాదు మీరు ఆన్‌లైన్‌లో ఉండి రీడింగ్ లిస్ట్‌ను ఓపెన్ చేస్తే అది ఆ వెబ్‌పేజీ లేటెస్ట్ వెర్ష‌న్‌కు రీడైరెక్ట్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది.

జన రంజకమైన వార్తలు