• తాజా వార్తలు
  •  

వాట్సాప్ ఫొటోలు, వీడియోలు, ఆడియోల‌ను  గ్యాలరీలో హైడ్ చేయడం ఎలా? 

వాట్సాప్‌లో మీకు వ‌స్తున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతున్నాయా? మ‌న ఫోన్ ఎవ‌రైనా చూసిన‌ప్పుడు ఇది కొద్దిగా ఇబ్బందిక‌ర‌మే. ఎందుకంటే వాట్సాప్‌లో వ‌చ్చే ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, వీడియోలు అంద‌రికీ క‌న‌ప‌డ‌డం కొద్దిగా అనీజీగానే ఉంటుంది. అంతేకాదు ఇలాడిఫాల్ట్ గా వాట్సాప్ ఇమేజ్‌లు, వీడియోలు, ఆడియోలు గ్యాలరీలో సేవ్ అవుతుంటే గ్యాల‌రీ మొత్తం నిండిపోతే నిజంగా మ‌న‌కు కావాల్సింది వెతుక్కోవ‌డానికి కూడా టైం  ప‌డుతుంది. అందుకే వాట్సాప్ గ్యాలరీని హైడ్ చేయడానికి ఓ సొల్యూషన్ ఉంది. 
ఇమేజ్ లు, ఆడియో, వీడియోలను ఎలా హైడ్ చేయాలి?
1) Hide Chat Media యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఈ యాప్ మెయిన్ ఇంటర్ ఫేస్‌లో వాట్సాప్ చాట్, మీడియా ఇమేజ్‌లు, ఆడియోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌, యానిమేటెడ్ జిఫ్‌ల‌ను చూపిస్తుంది. 
2) ఇప్పుడు మీరు సెలక్ట్ చేసుకున్న వాట్సాప్ చాట్ మీడియాతోపాటు మిగతావాటన్నింటిని హైడ్ చేయవచ్చు.  వాట్సాప్‌లో వ‌చ్చిన ఫొటోలు, వీడియోలను హైడ్ చేయడానికి హైడ్ ఆల్ (Hide all) బటన్ నొక్కండి. హైడ్ అయినవన్నీ మళ్లీ కనిపించాలనుకుంటే షో ఆల్ (Show all)న్ ప్రెస్ చేయండి.
3) స్పెసిఫిక్ చాట్ మీడియా ఫైల్స్ ను హైడ్ చేయాలనుకుంటే వాట్సాప్ మీడియాకు ఎదురుగా క‌నిపించే ఐ లాంటి బటన్ పై నొక్కండి. ఇప్పుడు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్క‌డ మీరు మ‌ల్టిపుల్ మీడియా ఫైల్స్‌ను ఒకేసారి సెలెక్ట్ చేసి వాటన్నింటినీ ఒకేసారి హైడ్ చేయొచ్చు. 
యాప్ లో Hidden సెక్షన్‌లోకి వెళితే మీరు హైడ్ చేసిన వాట్సాప్ మీడియా ఫైళ్లను చూడవచ్చు.


 

జన రంజకమైన వార్తలు