• తాజా వార్తలు

జీపీఎస్ ట్రాక‌ర్స్ ఎలా ప‌నిచేస్తాయో తెలుసా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వెహిక‌ల్‌లో ఎక్క‌డికైనా వెళుతున్న‌ప్పుడు రూట్ కోసం జీపీఎస్ ఆన్ చేస్తాం. అది జీపీఎస్ డివైస్‌. అదే ఏదైనా వెహిక‌ల్‌ను మీరు ట్రాక్ చేయాల‌నుకుంటే దానికి వాడేది జీపీఎస్ ట్రాక‌ర్‌.  అస‌లు ఈ జీపీఎస్ ట్రాక‌ర్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి.
ఎలా ప‌నిచేస్తుంది?
జీపీఎస్ డివైస్‌, జీపీఎస్ ట్రాకర్ కూడా శాటిలైట్ కోఆర్డినేష‌న్‌తోనే పని చేస్తాయి.  జీపీఎస్ అంటే గ్లోబ‌ల్ పొజిష‌నింగ్ సిస్ట‌మ్. భూమి చుట్టూ కొన్ని వంద‌ల శాటిలైట్లు తిరుగుతూ భూమి మీద ర‌క‌ర‌కాల ఆబ్జెక్ట్స్‌ను మానిట‌ర్ చేస్తుంటాయి.  ఇవి తాము సేక‌రించిన స‌మాచారాన్ని జీపీఎస్ డివైస్‌ల‌కు పంపుతుంటాయి. అలాగే ఏదైనా వెహిక‌ల్ లేదా జీపీఎస్ ఉన్న డివైస్ ఎక్క‌డుందో, ఎక్క‌డికి వెళుతుందో తెలుసుకోవ‌డానికి జీపీఎస్ ట్రాక‌ర్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీపీఎస్ ట్రాక‌ర్స్ శాటిలైట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ద్వారా ఓ వెహిక‌ల్ ఎక్క‌డికి వెళుతుంది.ఎంతసేపు ఆగింది తెలుసుకోవ‌చ్చు. అంటే ఇందులో ఉన్న వ్య‌క్తుల‌ను కూడా మానిట‌ర్ చేయ‌గ‌లిగిట్లే.  అంతేకాదు శాటిలైట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ద్వారా  ట్రాఫిక్ ర‌ద్దీ త‌క్కువ‌గా ఉన్న‌రూట్ గుర్తించి దాన్ని వెహిక‌ల్ డ్రైవ‌ర్‌కు చెప్పి టైమ్‌,ఫ్యూయ‌ల్ రెండూ ఆదా చేసుకోవ‌చ్చు.   మ్యాప్ మీద పిన్‌పాయింటెడ్‌గా జ‌స్ట్ 1,2 మీట‌ర్ల తేడాతో చాలా యాక్యురేట్‌గా ఇవి ప‌నిచేస్తుంటాయి. జీపీఎస్ ట్రాక‌ర్ల‌ను ఇప్పుడు ఇంట‌ర్నెట్ ద్వారా కూడా ప‌నిచేయిస్తున్నారు. 
ఉప‌యోగించేది వీళ్లే
జీపీఎస్ ట్రాక‌ర్ అంటే ఏదైనా వెహిక‌ల్ లేదా డివైస్ ద్వారా దానిలో ప్ర‌యాణించే మ‌నుషులు, లేదా స‌ర‌కును ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేయ‌డ‌మే ల‌క్ష్యం. పోలీసులు, ఆర్మీ, నావీ,ఎయిర్‌ఫోర్స్‌, ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఇలాంటి వారంతా జీపీఎస్ ట్రాక‌ర్స్ వాడ‌తారు.  క్యాబ్ స‌ర్వీసులు, డెలివ‌రీ కంపెనీలు, కొరియ‌ర్ స‌ర్వీసులు కూడా త‌మ డెలివ‌రీ బాయ్స్‌కి ఇచ్చేమెహిక‌ల్స్‌ను జీపీఎస్‌తో ట్రాక్‌చేస్తాయి.దీని ద్వారా వాళ్లు వ‌ర్క్‌లో లేట్ చేయ‌డాన్ని, ప‌ని మానేసి బ‌య‌ట తిర‌గ‌డాన్ని నివారించ‌గ‌లుగుతున్నారు.  రేష‌న్‌షాపుల‌కు స‌ర‌కులు తీసుకెళ్లే వెహిక‌ల్స్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్‌చేసి స‌ర‌కు ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూస్తున్నారు. విదేశాల్లో పెద్ద వ‌య‌సువారు, చిన్న‌పిల్ల‌లు ఇంట్లోఉన్న‌ప్పుడు వారిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నించుకోవ‌డానికి కూడా జీపీఎస్ ట్రాక‌ర్ల‌ను వాడుతున్నారు.

జన రంజకమైన వార్తలు