• తాజా వార్తలు

వాట్సాప్ గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల నుంచి విముక్తి పొంద‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వాట్సాప్‌లోగుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌ల వ‌ల్లే ఇండియాలోని మూడో వంతు స్మార్ట్‌ఫోన్లు అవుటాఫ్ మెమ‌రీ అయిపోతున్నాయ‌ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రిపోర్ట్‌  తేల్చిచెప్పింది. ఈ ప్రాబ్ల‌మ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి గూగుల్ ఫైల్స్ గో యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇండియాలో అత్య‌ధిక ఫోన్లు 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో వ‌స్తున్నాయి.ఇలాంటి ఫోన్ల‌లో వాట్స‌ప్ మెసేజ్‌ల‌తో స్టోరేజ్ లిమిట్ చాలా త్వ‌ర‌గా నిండిపోతుంది.  దీన్ని క్లియ‌ర్ చేయ‌డానికి గూగుల్ కొత్త‌గా లాంచ్ చేసిన ఫైల్స్ గో యాప్ బాగా పనికొస్తుంది. 
ఒక్క నెల‌లో కోటి డౌన్‌లోడ్స్‌
వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ ప్ర‌కారం గూగుల్ ఫైల్స్ గో యాప్.. ఇండియా లాంటి దేశాల్లో సెల్‌ఫోన్ యూజ‌ర్ల‌ను దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేశారు. ఈ యాప్ లాంచ్ అయి నెల కూడా గ‌డ‌వ‌క ముందే అప్పుడే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వాట్సాప్, షేరిట్ ద్వారా మీకు వ‌చ్చిన ఫైల్స్‌, వాటి సైజు, డూప్లికేష‌న్ ఉన్న ఫైల్స్‌ను ఈ యాప్ మీకు హైలైట్ చేసి చూపిస్తుంది. దీంతో వాటిని ఈజీగా డిలీట్ చేయొచ్చు.
ఎలా ప‌ని చేస్తుందంటే?
1.ప్లే స్టోర్‌లోకి వెళ్లి గూగుల్ ఫైల్స్ గో (Google Files Go) యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌ల‌న్నింటిలోనూ ఈ యాప్ ప‌నిచేస్తుంది.
2.యాప్ ఓపెన్ చేయ‌గానే ఫోన్ స్టోరేజ్‌ను రీడ్‌చేయ‌డానికి పర్మిష‌న్ అడుగుతుంది. 
3. యాక్సెస్ ఇవ్వ‌గానే మీ ఫోన్‌లో ఉన్న స్టోరేజ్ ఎంత‌?  దానిలో మీరు వాడుకున్న‌ది ఎంత చూపిస్తుంది.
4. ఫైల్స్‌, ఫొటోస్‌, యాప్స్ ఇలా అన్నింటినీ స్కాన్ చేసి గ‌త కొన్నాళ్లుగా మీరు వాడ‌ని యాప్స్ ఉంటే వాటిని చూపిస్తుంది. కావాల‌నుకుంటే మీరు అక్క‌డే వాటిని డిలీట్ చేయోచ్చు. 
5. అలాగే టెంప‌ర‌రీ ఫైల్స్‌,  డౌన్‌లోడెడ్ ఫైల్స్‌, లార్జ్ ఫైల్స్‌, ఫొటోస్ ను చూపిస్తుంది. 
6. వాట్సాప్‌, షేర్ ఇట్‌, బ్లూటూత్ వంటి ఛానల్స్ ద్వారా షేర్ అయిన ఫైల్స్‌, ఫొటోస్‌ను కూడా చూపిస్తుంది. దీంతో గుడ్ మార్నిగ్‌, గుడ్‌నైట్ మెసేజ్‌లు, పండ‌గ‌లు,ప‌బ్బాల‌కు, న్యూఇయ‌ర్‌కు వ‌చ్చే మెసేజ్‌లు మ‌న‌కు ఒకే స్ట్రింగ్లో ఇమేజ్ వైజ్‌గా క‌నిపిస్తాయి. చ‌క‌చ‌కా వాటిని సెలెక్ట్ చేసి ఒకేసారి డిలీట్‌చేసి పారేయొచ్చు.
7. ప్ర‌తి కార్డు కింద దానిలో ఫైల్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేశాయో డిటైల్స్ ఇస్తుంది. మీరు ఎంత డిలీట్ చేశారో కూడా చూపిస్తుంది.

జన రంజకమైన వార్తలు