తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే ఎవరు మీరు అని అడుగుతాం. అవతలి వ్యక్తి సరైన సమాధానం చెప్పకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్ చేసింది ఎవరో ఎలా తెలుసుకోవాలి? సెర్చ్ ఇంజిన్‌లో ఆ నెంబర్ టైప్ చేస్తే లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. కానీ పర్సన్ వివరాలు తెలియవు. ఇందుకోసం ఓ సీక్రెట్ మెథడ్ ఉంది. అందే రివర్స్ ఫోన్ లుక్ అప్. అదేంటో, ఎలా పని చేస్తుందో చూడండి.
రివర్స్ ఫోన్ లుక్ అప్ అంటే?
రివర్స్ ఫోన్ లుక్ అప్ అనేది ఓ పెద్ద డేటా బేస్. పబ్లిక్, ప్రైవేట్ రికార్డ్స్ ,డేటా బేస్ వంటివన్నీ సెర్చ్ చేసి దీన్నిక్రియేట్ చేశారు. దీనిలో ఓ నెంబర్‌ను బట్టి సెర్చ్ చేస్తే పర్సన్ పేరు, అడ్రస్, ఫ్యామిలీ డిటెయిల్స్, సోషల్ ప్రొఫైల్, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుసుకోవచ్చు. ఇది సేఫ్, లీగల్ మెథడ్. రివర్స్ ఫోన్ లుక్ అప్ అని మీ బ్రౌజర్లో టైప్ చేస్తే చాలా సైట్లు వస్తాయి. అందులో నుంచి మంచిది సెలెక్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇవన్నీ పెయిడ్ సర్వీస్లే. కానీ పెద్దగా డేటా లేని సైట్లు ఫేక్ రిజల్ట్స్ ఇస్తాయి. అయితే మంచి సైట్లయితే మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని ఫుల్ డిటెయిల్స్ ఇస్తాయి.
ఏ సైట్స్ బెటర్?
మనకు తెలియకుండానే మనం ట్రూకాలర్‌తో ఒక రివర్స్ ఫోన్ లుక్ అప్ సైట్‌ను వాడుతున్నాం. దీంతోపాటు WhitePages, Reverse Phone Lookup, AnyWho, Pipl.com లాంటి సైట్లను ట్రై చేయొచ్చు.
ఉపయోగాలు ఇవిగో..
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, భయపెట్టేవి, బెదిరించేలా వచ్చే కాల్స్‌ను ఎవరు చేస్తున్నారో, వాళ్ల వివరాలేంటో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్‌కు ఇది చాలా యూజ్ అవుతుంది.
* స్పామ్ కాల్స్‌ను కంట్రోల్ చేయొచ్చు.