• తాజా వార్తలు
  •  

సాఫ్ట్‌వేర్ల మీద బెస్ట్ స్టూడెంట్ డిస్కౌంట్లు పొంద‌డం ఎలా?

ఈ రోజుల్లో చ‌దువులు ఖ‌రీదైపోయాయి. ల‌క్ష‌ల్లో ఫీజులు, పుస్త‌కాల ఖ‌రీదు కూడా వంద‌లు దాటి వేల‌ల్లోకి వ‌చ్చేసింది. అంతేకాదు ఇప్పుడు చ‌దువులో టెక్నాల‌జీ ప్రాధాన్యం పెరిగాక సాఫ్ట్‌వేర్లు, కోర్స్ మెటీరియ‌ల్స్ కూడా ఆన్‌లైన్‌లో కొనుక్కోవాల్సి వ‌స్తోంది. అయితే ఇలాంటి సాఫ్ట్‌వేర్ల‌ను డిస్కౌంట్ల‌మీద కూడా కొనుక్కోవ‌డానికి బోల్డ‌న్ని మార్గాలున్నాయి.  ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి టెక్నాల‌జీ దిగ్గ‌జాలు స్టూడెంట్లకు భారీగా డిస్కౌంట్లు ఇస్తుంటాయి.  అయితే చాలా కంపెనీలు ఇలాంటి సాఫ్ట్‌వేర్ల‌ను  .edu డొమైన్‌తో  ఈమెయిల్ క్రియేట్ చేసుకునేవారికి ఇస్తుంటాయి. 
 

ఓఈఎం సాఫ్ట్‌వేర్లు
ఒరిజిన‌ల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చ‌ర్  (OEM) సాఫ్ట్‌వేర్లు అంటే స‌ర్టిఫైడ్ థ‌ర్డ్‌పార్టీ డెవ‌ల‌ప్ చేసే సాఫ్ట్‌వేర్లు. అయితే వీటిని ప్రైమ‌రీ మాన్యుఫాక్చ‌ర్స్ అప్రూవ్ చేస్తారు కాబ‌ట్టి క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా ఉంటాయి చాలావ‌ర‌కు. అలాంటి ఓఈఎం సాఫ్ట్‌వేర్లు అస‌లు సాఫ్ట్‌వేర్ల కంటే చాలా చాలా త‌క్కువ ధ‌ర‌కే దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో వెతికితే స‌ర్టిఫైడ్ ఓఈఎం సాఫ్ట్‌వేర్లు ఇచ్చే సంస్థ‌లు బోల్డ‌న్ని దొరుకుతాయి.
 

బండిల్‌గా కొనండి
సాఫ్ట్‌వేర్ల‌ను విడివిడిగా కాకుండా ఒక బండిల్‌గా కొంటే చాలా త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతాయి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొంటే అందులో వ‌ర్డ్‌, ఎక్సెల్‌, అవుట్‌లుక్ ఇలా దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ల‌న్నీ దొరుకుతాయి. అదే విడివిడిగా కొనాలంటే చాలా డ‌బ్బులు పెట్టాలి. 
* మీ ఫ్రెండ్స్ లేదా క్లాస్‌మేట్స్‌తో క‌లిసి వెళ్లి  ఒకేచోట కొనండి. అప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఒకేసారి ఎక్కువ కొంటున్నాం కాబ‌ట్టి ఇంత డిస్కౌంట్ కావాల‌ని అడ‌గండి..ఒక‌టి రెండు చోట్ల ఎంక్వ‌యిరీ చేసిఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేచోటే కొనండి.
* ఏదైనా సాఫ్ట్‌వేర్ చూడగానే అమ్మో అంత‌రేటా అని వ‌ర్రీ అవ‌కండి.  ఆ సాఫ్ట్‌వేర్ మీకు అవ‌స‌రం అయితే అది ఏ ర‌కంగా కొంటే, ఎక్క‌డ కొంటే త‌క్కువ‌కు వ‌స్తుందో ఆలోచించండి. కొన్నిరోజులు దాన్ని వాయిదా వేయ‌గ‌లిగినా ప‌ర్లేదు అనుకుంటే క‌చ్చితంగా మీకు డిస్కౌంట్లు దొరుకుతాయి.

జన రంజకమైన వార్తలు