• తాజా వార్తలు

అమెజాన్ మీ షాపింగ్ హాబిట్స్‌ను ట్రాక్ చేయ‌కుండా ఆప‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీరు అమెజాన్ సైట్‌లోకి లేదా యాప్‌లోకి వెళ్లిన‌ప్పుడ‌ల్లా మీరు లాస్ట్ టైం చూసిన ఐట‌మ్స్ ఇవీ అని లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంటుంది. అది ఫ్యాష‌న్ యాక్సెస‌రీస్ నుంచి ఫ్రై పాన్ వ‌ర‌కు ఏ వ‌స్తువైనా స‌రే ఒక్క‌సారి మీరు అమెజాన్‌లో దాన్ని క్లిక్ చేసి చూస్తే చాలు మీరు అమెజాన్ ట్రాకింగ్‌లో ఉన్న‌ట్లే. ఇది మీకు కొన్ని సంద‌ర్భాల్లో అసౌక‌ర్యంగా అనిపించ‌వ‌చ్చు. లేదంటే ప‌ర్స‌న‌ల్‌గా మీరు షాపింగ్ చేసిన ఐట‌మ్ ప‌దిమందిలో ఉండ‌గా ఆ సైట్ తెరిస్తేదానిలో చూపించ‌డం ఇబ్బంది కావ‌చ్చు.  ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అమెజాన్ మీ షాపింగ్ హాబిట్స్‌ను ట్రాక్ చేయ‌కుండా అడ్డుకోవడానికి ఆసైట్‌లోనే మార్గం ఉంది.  
ఇదీ మెథ‌డ్ 
* అమెజాన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి
&  Accounts & Lists క్లిక్ చేయండి.  ఈ పేజీలో టాప్‌లో క‌నిపించే డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి Your Recommendationsను సెలెక్ట్ చేయండి. 
* త‌ర్వాత పేజిలో టాప్‌లో  Your Browsing History అనే ఆప్ష‌న్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి.
* దీనిలో  Manage History ఆప్షన్‌ను క్లిక్ చేయండి.  browsing history off or on బ‌ట‌న్‌ను ఆఫ్‌లో పెట్ట‌డండి.  అక్క‌డే  Remove all items అనే బ‌ట‌న్ కూడా ఉంటుంది. మీరు అన్నీ రిమూవ్ చేయాల‌నుకుంటే ఆ బ‌ట‌న్ నొక్కండి. లేదంటే ఇండివిడ్యువ‌ల్‌గా ఐట‌మ్‌ను సెలెక్ట్ చేసి రిమూవ్ చేయండి. ఇప్పుడు ఈ హిస్ట‌రీ మొత్తం ఎరేజ్ అయిపోతుంది.  
* మీరు బ్రౌజ‌ర్ కుకీస్‌ను క్లియ‌ర్ చేస్తే మీ సెట్టింగ్స్ మ‌ళ్లీ ట్రాకింగ్‌లోకి వెళ‌తాయి.  

జన రంజకమైన వార్తలు