• తాజా వార్తలు
  •  

గూగుల్ అసిస్టెంట్ మీ ల్యాప్‌టాప్‌లో కావాలంటే ఎలా? 

గూగుల్ నుంచి క్రోమ్ ఓఎస్ బేస్డ్‌గా వ‌చ్చిన కొత్త ల్యాప్‌టాప్.. పిక్సెల్ బుక్‌.  హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ రెండింటిలోనూ లేటెస్ట్ టెక్నాల‌జీతో దీన్ని లాంచ్ చేశారు. గూగుల్ అసిస్టెంట్‌తో వ‌చ్చిన తొలి ల్యాపీ ఇదే కావ‌డం దీని స్పెషాలిటీ. ఆండ్రాయిడ్ 6.0 మార్ష‌మాలో, ఆ త‌ర్వాత వ‌చ్చిన ఓఎస్‌తో ప‌నిచేసే ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో గూగుల్ అసిస్టెంట్ ఎలా ప‌ని చేస్తుందో ఈ పిక్సెల్ బుక్‌లో కూడా అలాగే ప‌ని చేస్తుంది.  వాతావ‌ర‌ణం క‌నుక్కోవ‌డం,రిమైండ‌ర్ సెట్ చేసుకోవ‌డం,  కాలిక్యులేష‌న్స్ చేయ‌డం, యాప్స్ లేదా వెబ్ పేజెస్ ఓపెన్ చేయ‌డం వంటి టాస్క్‌ల‌ను మీ వాయిస్ క‌మాండ్స్‌తో చేయ‌డం ఈ గూగుల్ అసిస్టెంట్ ప్ర‌త్యేక‌త‌.

 మెషీన్ లెర్నింగ్‌తోపాటు అప‌రిమిత‌మైన డేటా అందుబాటులో ఉండ‌డంతో  గూగుల్ త‌న అసిస్టెంట్‌ను ఓ మ‌నిషి స్థాయిలో తీర్చిదిద్ద‌గ‌లిగింది.   ఓ మ‌నిషితో మ‌నం ఎలా చాట్ చేస్తామో గూగుల్ అసిస్టెంట్ కూడా అంతే తెలివిగా మీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలివ్వ‌గ‌లుగుతుంది.  అయితే గూగుల్ అసిస్టెంట్ ప్ర‌స్తుతం పిక్సెల్ బుక్ ల్యాప్‌టాప్‌లో మాత్రం ఉంది.   అయితే దీన్ని మీ పీసీ లేదా ల్యాపీలో కూడా వాడుకోవ‌చ్చు. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా బ్రౌజ‌ర్ల‌లో ఏదో ఒక‌టి మీ సిస్టంలో ఇన్‌స్టాల్ అయి ఉంటే చాలు.  

మీ పీసీ లేదా ల్యాపీలో గూగుల్ అసిస్టెంట్‌ను పొంద‌డం ఎలా?  
విండోస్‌, మ్యాక్‌, లేదా లిన‌క్స్ ఏ సిస్టంలో అయినా గూగుల్ అసిస్టెంట్‌ను పొందొచ్చు.  ఎలాగంటే..

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Allo Messenger డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.  \
2. ఇప్పుడు యాప్‌ను ఓపెన్ చేసి మీ  మొబైల్ నెంబ‌ర్‌తో సైన్ అప్ చేయండి. యాప్ నుంచి వ‌చ్చే ఓటీపీతో రిజిస్ట్రేష‌న్ కంప్లీట్ చేయండి. కావాలంటే ప్రొఫైల్ పిక్చ‌ర్‌, నేమ్ Google Allo Messenger  మెసెంజ‌ర్‌లో యాడ్ చేసుకోవ‌చ్చు.  
3.   రిజిస్ట్రేష‌న్‌, వెరిఫికేష‌న్ పూర్త‌వ‌గానే యాప్‌ను వాడుకోవ‌చ్చు.  యాప్ హోం పేజీలో లెఫ్ట్ సైడ్‌లో ఉన్న మెనూలోకి వెళ్లి Allo for Webను ఓపెన్ చేయండి.  
4. Allo for Webలోకి వెళ్లాక అక్క‌డ‌ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. 
 5. దానికంటే ముందు మీ పీసీ లేదా ల్యాపీలో బ్రౌజ‌ర్ ఓపెన్ చేయండి. గూగుల్ అలో మెసెంజ‌ర్ వెబ్ వెర్ష‌న్ క్రోమ్‌/  ఫైర్‌ఫాక్స్ / ఒపెరా బ్రౌజ‌ర్ల‌లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది.   వీటిలో ఏదో ఒక బ్రౌజ‌ర్‌ను ఓపెన్ చేసి గూగుల్ అలో వెబ్ అని టైప్‌ చేయండి. 
 6.  ఇప్పుడు  అక్క‌డ ఉండే లింక్‌ను క్లిక్ చేస్తే  Google Allo web తోపాటు  QR code  క‌నిపిస్తుంది.  
7.  ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో అలో యాప్‌లోకి వెళ్లి  Allo for Webను ఓపెన్ చేసి  Scan QR code బ‌ట‌న్‌ను నొక్కండి. ఇప్పుడు మీ ఫోన్ కెమెరాను కంప్యూట‌ర్‌లో క‌నిపిస్తున్న క్యూఆర్ కోడ్ పైన పెట్టి స్కాన్  చేయండి.  
8.  స్కానింగ్ పూర్త‌య్యాక  గూగుల్ అలో మెసెంజర్ మొబైల్ వెర్ష‌న్  మీ కంప్యూట‌ర్‌లోని బ్రౌజ‌ర్‌తో సింక్ అవుతుంది.  
9. ఇప్పుడు మీ చాట్ లిస్ట్‌లో లెఫ్ట్ సైడ్ టాప్‌లో గూగుల్ అసిస్టెంట్ క‌నిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసి మీ క్వ‌శ్చ‌న్‌, రిక్వెస్ట్‌లు పంపించండి. మామూలు చాట్ మాదిరిగానే చాట్ చేసుకోవ‌చ్చు.

అయితే మొబైల్‌లో ఉన్నట్లుగా యాప్స్ ఓపెనింగ్ చేయ‌డం లేదా సెట్టింగ్స్ చేంజ్ చేయ‌డం వంటివి బ్రౌజ‌ర్ లెవెల్లో సాధ్యంకాక‌పోవ‌చ్చు. అయితే రిమైండ‌ర్ సెట్ చేసుకోవ‌చ్చు.  గేమ్ ఆడుకోవ‌చ్చు.  మీ స్మార్ట్‌ఫోన్ ఇంట‌ర్నెట్‌తో క‌నెక్ట్ అయి గూగుల్ అలోతో సింక్ అయి ఉన్నంత వ‌ర‌కు అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌ని చేస్తుంది.  

జన రంజకమైన వార్తలు