• తాజా వార్తలు
  •  

బ్ల‌ర్ అయిన ఇమేజ్‌ల‌ను సూప‌ర్ క్లియ‌ర్‌గా మార్చేయ‌డం ఎలా?

స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు విప‌రీతంగా పిక్చ‌ర్లు తీసేస్తుంటాం. సెల్ఫీ కెమెరాలు వ‌చ్చాక ఇక పిక్చ‌ర్లే పిక్చ‌ర్లు. స్మార్ట్‌ఫోన్లు ఇమేజ్‌ల‌తో నిండిపోతున్నాయి.  అయితే వాటిలో ఎక్కువ ఫొటోలు స‌రిగా ఉండ‌వు. దీనికి కార‌ణాలు చాలా ఉంటాయి. ఫొటోలు తీసిన‌ప్పుడు అవ‌త‌లి వాళ్లు క‌దిలిపోవ‌డం...లేక‌పోతే మ‌న‌మే స‌రిగా తీయ‌క‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో మ‌నం తీసే 50 శాతం ఫొటోలు మంచిగా ఉండ‌వు. ఎక్కువశాతం బ్ల‌ర్‌గా వ‌స్తాయి.  అయితే ఇలా బ్ల‌ర్ అయిన ఫొటోల‌ను సూప‌ర్ క్లారిటీ ఉన్న‌ఫొటోలుగా చేయ‌డం ఎలా!

అన్ బ్ల‌ర్ ఎలా చేయ‌చ్చంటే..
బ్ల‌ర్ అయిన ఫొటోల‌ను అన్ బ్ల‌ర్ చేయ‌డానికి చాలా యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే మంచి క్వాలిటీ ఉన్న ఇమేజ్‌ను తీసుకు రాగ‌ల‌వు. ఇప్పుడు ఎక్కువ‌మంది ఉప‌యోగించే అలాంటి యాప్‌ల‌లో ఫొటోషాప్ ఒక‌టి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన టూల్ ఇది. ఫొటోల‌ను మ‌న‌కు న‌చ్చిన‌ట్లు మార్చ‌కునే అవ‌కాశం ఉంది. ఫొటోషాప్‌ను ఉప‌యోగించ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

మీ పిక్చ‌ర్‌కి మ‌రో లేయ‌ర్ యాడ్ చేయ‌డం
ఫొటోషాప్‌లో సుల‌భ‌మైన ప‌ద్ధ‌తి ఏంటంటే మీ పిక్చ‌ర్‌కి మ‌రో లేయ‌ర్‌ను యాడ్ చేయ‌డం.  దీని కోసం ముందుగా ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసి కంట్రోల్ కీ మ‌రియు జే కీని ఒకేసారి ప్రెస్ చేయాలి. వెంట‌నే బ్యాక్‌గ్రౌండ్లో మ‌రో లేయ‌ర్ మీకు డూప్లికేట్ అవుతుంది. ఆ త‌ర్వాత లేయ‌ర్‌-1ను ఓపెన్ చేసి ఆపై ఫీల్ట‌ర్ లాంటి ఆప్ష‌న్లతో ఫొటోను స‌రిదిద్దుకోవ‌చ్చు. అద‌ర్ ఆప్ష‌న్‌లో  క‌స్ట‌మ్‌, మాగ్జిమ‌మ్‌, మినిమ‌మ్‌, హై పాస్ లాంటి ఫీచ‌ర్ల‌ను క‌నిపిస్తాయి. మీ ఇమేజ్‌ను డార్క్ చేయ‌డం.. బ్లెండ్ చేయ‌డం, లేయ‌ర్స్ సృష్టించ‌డం లాంటి ఆప్ష‌న్లు వీటిలో ఉన్నాయి.   

బ్ల‌రిటి
మాక్‌, విండోస్‌లో ఫొటోల ఎడిటింగ్ కోసం వాడే టూల్స్‌లో బ్ల‌రిటీ ఒక‌టి. ఫొటోల‌ను డీబ్ల‌ర్ చేయ‌డం కోస‌మే ప్ర‌త్యేకించి ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిలో ఉన్న కొన్ని ఫీచ‌ర్ల‌ను మీరు యూజ్ చేస్తే మీ ఇమేజ్ ఎంతో షార్ప్ అయిపోతుంది. ఒక‌సారి మీరు ఫొటోను ఎడిట్  చేయ‌ల‌నుకున్నాక ఓపెన్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి.  ఏ ప్రాంతంలో ఇమేజ్ బ్ల‌ర్ అయిందో చూసుకుని అక్క‌డే ప్రాసెస్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.  అంతా అయ్యాక ప్రివ్యూ చూసుకోవాలి. ఒకే అనుకుంటే సేవ్ చేసుకుని వాడుకోవ‌చ్చు.
                                 
ఐ క‌లోర‌మ యాప్‌
ఐఫోన్ ఉప‌యోగించే వారికి ఐ క‌లోర‌మ యాప్ ఫొటొ ఎడిటింగ్ కోసం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్ల‌ర్  అయిన ఫొటోల‌ను నార్మల్‌గా మార్చ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త. దీని ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. అంతే కాదు ఈ యాప్ ఎంతో ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది.  లైబ్ర‌రీ నుంచి మీ ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ పిక్చ‌ర్‌కు త‌గ్గ రిజ‌ల్యూష‌న్, స్ట‌యిల్ ఎంచుకోవాలి. ఫ్లో, సింప్లిఫై, ఆటో లాంటి ఆప్ష‌న్ల‌ను కూడా ఉపయోగించుకుని మీ ఫొటోను బ‌ర్ల్ లేకుండా మ‌రింత అందంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు