• తాజా వార్తలు

ఏ డివైజ్‌లోనైనా డిజిట‌ల్ సంత‌కం చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మ‌నం ఏదైనా పీడీఎఫ్‌లోనో లేక ఫైల్‌లోనో స‌మాచారాన్ని పంపుతున్న‌ప్పుడు ఒక్కోసారి సంత‌కం చేయాల్సి ఉంటుంది. ఐతే  ఇది మ‌నం అనుకున్నంత సుల‌భం కాదు. మొయిల్ లాంటి వాటిలో ఆటో సైన్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. కానీ పీడీఎఫ్ లేదా ఇత‌ర ఫైల్స్‌లో మీ సైన్‌తో కావాలంటే దానికి కొన్ని ప్ర‌త్యేక‌త‌మైన టూల్స్ ఉన్నాయి.  ఇవి డివైజ్ డివైజ్‌కు మారిపోతుంటాయి. మ‌రి ఏ డివైజ్‌లోనైనా సంక‌తం చేయ‌డం ఎలాగో చూద్దాం..

మార్క్ ఆప్ టూల్స్ వాడాలి
మార్క్ ఆప్ టూల్స్ వాడ‌డం ద్వారా మ‌నం ఏ డివైజ్‌లోనైనా మ‌న సంత‌కాన్నిత‌యారు చేసుకోవ‌చ్చు.  అదెలాగంటే..

ఐఓఎస్‌లో ఇలా..
పీడీఎఫ్ ఓపెన్ చేసి షేర్ టూల్ ఎంపిక చేసుకోవాలి.ఆ త‌ర్వాత సేవ్ టు ఫైల్స్ ఎంపిక చేసుకోవాలి. ఆ త‌ర్వాత మార్క్ అప్ టూల్‌ను ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత ప్ల‌స్ గుర్తుపై క్లిక్ చేసి సిగ్నేచ‌ర్‌పై క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత యాడ్ లేదా రిమూవ్ సిగ్నేచ‌ర్‌ను ఎంపిక చేసుకుని...మీ ఫింగ‌ర్‌ను యాడ్ చేయాలి. ఆ త‌ర్వాత డ‌న్ మీద క్లిక్ చేస్తే చాలు. మీ ప‌ని అయిపోయిన‌ట్లే. మీకు అవ‌స‌ర‌మైన పీడీఎఫ్‌లో  దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. 

మాక్ ఓఎస్‌లో ఇలా..
మాక్‌లోనూ సిగ్నేచ‌ర్‌ను యాడ్ చేయ‌డం చాలా సుల‌భ‌మే.  దీని కోసం మీరు ట్రాక్ పాడ్ లేదా హ్యాండ్ రిట‌న్ సిగ్న‌గేచ‌ర్‌ను ఉప‌యోగించొచ్చు. దీని కోసం మీరు కంప్యూట‌ర్‌లోని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను వాడొచ్చు. దీని కోసం మీరు యాపిల్ ప్రివ్యూ యాప్ వాడాల్సి ఉంటుంది.

యాపిల్ ప్రివ్యూ యాప్‌లో పీడీఎఫ్ ఓపెన్ చేయాలి.  ఆ త‌ర్వాత  టూల్‌బాక్స్‌ను క్లిక్ చేసి సిగ్నేచ‌ర్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఆ త‌ర్వాత క్రియేట్ సిగ్నేచ‌ర్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత ట్రాక్‌పాడ్ సాయంతో క్లిక్ హియ‌ర్ టు బిగేన్ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత మీ సిగ్న‌చ‌ర్ డ్రా చేసుకోవాలి. డ్రాయింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఏ కీ అయినా ప్రెస్ చేసి ఫినిష్ చేయచ్చు. 

ఆండ్రాయిడ్‌లో ఇలా..
ఆండ్రాయిడ్‌లోనూ మ‌నం సుల‌భంగా సిగ్నేచ‌ర్  సృష్టించుకోవ‌చ్చు.  దీని కోసం ప్లే స్టోర్ నుంచి సైన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత అడోబ్  ఫిల్‌, ఏఎంపీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీటితో సిగ్నేచ‌ర్ యాడ్ చేసుకోవ‌డ‌మే కాక‌...మ‌న‌కు సంబంధించిన ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను కూడా యాడ్  చేసుకోవ‌చ్చు.

అడోబ్ ఫిల్‌, ఏఎంపీ సైన్ అయి పీడీఎఫ్‌ను  ఓపెన్ చేయాలి. సిగ్నేచ‌ర్ క్రియేట్ చేయ‌డం కోసం ఫౌంటెన్ పెన్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి. నీలి రంగు గీత పైన మీ సిగ్నేచ‌ర్ డ్రా చేయడం  కోసం  మీ ఫింగ‌ర్‌ను యూజ్ చేయాలి.  ఆ త‌ర్వాత ఫౌంటెన్‌పెన్‌ను మ‌రోసారి ట్యాప్ చేసి సిగ్నేచ‌ర్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ త‌ర్వాత సిగ్నేచ‌ర్‌పై స్కేల్‌ను డ్రా చేయాలి. ఆ త‌ర్వాత  షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి పీడీఎఫ్‌ను సేవ్  చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు