• తాజా వార్తలు
  •  

న‌చ్చ‌ని మార్కెటింగ్ కాల్స్‌ను మాత్ర‌మే బ్లాక్ చేసేలా డు నాట్ డిస్ట్ర‌బ్‌ సెట్ చేయడం ఎలా ?

మొబైల్ ఫోన్ లేనిదే జీవితం గ‌డ‌వ‌దేమో అన్నంతగా అది మ‌న జీవితాల‌తో పెన‌వేసుకుపోయింది.  అందుకే ఇప్పుడు త‌మ ప్రొడ‌క్ట్ మార్కెటింగ్ చేసుకోవాల‌నుకునేవారికి సెల్ ఫోన్ ఇప్పుడు వ‌రాలిచ్చే దేవ‌త‌లా కనిపిస్తుంది.  ఫ‌లానా ప్రొడ‌క్ట్ కొనండి. ల‌క్కీడ్రాలో కారు గెల‌వండి..మా షోరూంకి రండి..50% ఆఫ‌ర్లు  మీ కోసం రెడీ..ఇలాంటి ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు నిత్యం మొబైల్ యూజ‌ర్ల‌ను విసిగిస్తూనే  ఉన్నాయి.  ఇలాంటి వాటిని కంట్రోల్ చేయ‌డానికి డూనాట్ డిస్ట్ర‌బ్ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు.ఇది చాలా కాలంగా ఉన్నాఇప్ప‌టికీ చాలా మంది మొబైల్ యూజర్ల‌కు దీని గురించి తెలియ‌దంటే ఆశ్చ‌ర్యం లేదు.
ఇప్పుడు డునాట్ డిస్ట్ర‌బ్‌ను  ఏ నెట్‌వ‌ర్క్‌కైనా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు రియ‌ల్ ఎస్టేట్ అంటే ఇంట‌రెస్ట్ ఉన్న‌వాళ్లు ఆ కాల్స్‌, మెసేజ్‌లు త‌ప్ప మిగిలిన అన్‌వాంటెడ్‌, మార్కెటింగ్ ప్ర‌మోష‌న్ కాల్స్‌, మెసేజ్‌లు రాకుండా కూడా డునాట్ డిస్ట్రబ్‌ను క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు.  అలాగే హెల్త్‌, ఎడ్యుకేష‌న్ ఇలా ఏ ఫీల్డ్ మీద ఇంట్ర‌స్ట్ ఉన్న‌వాళ్లు ఆ ఫీల్డ్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్ కాల్స్ మాత్ర‌మే వ‌చ్చి మిగిలిన‌వి బ్లాక్ చేసుకోవ‌చ్చు.అది ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో చూడండి. చేసుకోవ‌డ‌మే కాదు 
 ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
 Start 0 అని  1909 నెంబ‌ర్‌కు ఎస్ ఎంఎస్ చేయాలి. లేదా 1909 నెంబ‌ర్‌కు కాల్ చేయాలి. ఇలా అయితే మొత్తం మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న్ కాల్స్‌, మెసేజ్‌లన్నీ బ్లాక్ అవుతాయి.
1) START 1 అని 1909కి  మెసేజ్ చేస్తే  బ్యాంకింగ్‌, క్రెడిట్‌కార్డ్స్‌,  ఇన్స్యూరెన్స్‌,  ఫైనాన్షియ‌ల్ ప్రొడ‌క్ట్స్‌కు సంబంధించినవి త‌ప్ప మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
2) START 2 అని 1909కి  మెసేజ్ చేస్తే  రియ‌ల్ ఎస్టేట్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
3) START 3 అని 1909కి  మెసేజ్ చేస్తే  ఎడ్యుకేష‌న్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
4) START 4 అని 1909కి  మెసేజ్ చేస్తే  హెల్త్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
5) START 5 అని 1909కి  మెసేజ్ చేస్తే  క‌న్స్యూమ‌ర్ గూడ్స్‌, ఆటోమొబైల్స్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
6) START 6 అని 1909కి  మెసేజ్ చేస్తే   క‌మ్యూనికేష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌,  ఐటీ, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
7) START 7 అని 1909కి  మెసేజ్ చేస్తే   టూరిజ‌మ్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
వారం రోజుల్లో యాక్టివేష‌న్‌
డు నాట్ డిస్ట్ర‌బ్ (DND) స‌ర్వీస్‌ను  ట్రాయ్ 2011 సెప్టెంబ‌ర్ 11 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం మొబైల్ యూజ‌ర్ అన్‌వాంటెడ్ కాల్స్‌ను బ్లాక్ చేసుకునే రైట్ ఉంది. ఇలా డీఎన్‌డీ యాక్టివేట్ చేసినా అన్‌వాంటెడ్ ప్ర‌మోష‌న్‌, మార్కెటింగ్ కాల్స్‌, మెసేజ్‌లు వ‌స్తుంటే ట్రాయ్‌కు కంప్ల‌యింట్ చేస్తే యాక్ష‌న్ కూడా తీసుకుంటుంది.  అయితే ఈ స‌ర్వీస్ యాక్టివేట్ అవ‌డానికి వారం రోజులు ప‌డుతుంది.  ప్ర‌జ‌ల సౌక‌ర్యార్ధం బ్యాంకింగ్‌, గ్యాస్‌బుకింగ్‌, రేష‌న్ డిటెయిల్స్ వంటి మెసేజ్‌లు బ్లాక్ కావు.

జన రంజకమైన వార్తలు