• తాజా వార్తలు
  •  

అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్స్‌లో డు నాట్ డిస్ట్ర‌బ్‌ను యాక్టివేట్ చేసుకోవ‌డం ఎలా?

మొబైల్ ఫోన్‌లో పొద్దున నుంచి రాత్రి వ‌ర‌కు ఆ ప్రొడ‌క్ట్ కొనండి.. ఈ ఆఫ‌ర్ పొందండి అంటూ ఒక‌టే మార్కెటింగ్ కాల్స్‌. ఇలాంటి వాటిని భ‌రించాల్సిన ప‌ని లేదు.  డు నాట్ డిస్ట్ర‌బ్ ఫీచ‌ర్‌ను  యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి కాల్స్‌రానే రావు.  ఏ నెట్‌వ‌ర్క్ సిమ్ వాడుతున్న‌వార‌యినా  ఈ ఫీచ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. 
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
 Start 0 అని  1909 నెంబ‌ర్‌కు ఎస్ ఎంఎస్ చేయాలి. లేదా 1909 నెంబ‌ర్‌కు కాల్ చేయాలి.  వారం రోజుల్లో డు నాట్ డిస్ట్ర‌బ్ స‌ర్వీస్ యాక్టివేట్ అవుతుంది. ఒక్క‌సారి ఈ స‌ర్వీస్ యాక్టివేట్ అయిన త‌ర్వాత మీకు ఎలాంటి మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న్ కాల్స్‌, మెసేజ్‌లురావు. ఒక‌వేళ అలాంటి కాల్స్ వ‌స్తే మీరు ట్రాయ్‌కు కంప్ల‌యింట్ చేయొచ్చు. ట్రాయ్ దీనిమీద చాలా సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటుంది.అయితే మీ  సౌక‌ర్యార్ధం బ్యాంకింగ్‌, గ్యాస్‌బుకింగ్‌, రేష‌న్ డిటెయిల్స్ వంటి మెసేజ్‌లు బ్లాక్ కావు. 
క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు
అయితే అన్ని మార్కెటింగ్ కాల్స్ బ్లాక్ చేయ‌కుండా మీకు ఇష్ట‌మున్న వాటికి సంబంధించిన కాల్స్ వ‌చ్చేలా డు నాట్ డిస్ట్ర‌బ్ ఫీచ‌ర్‌ను క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు కూడా. దీనికి ఏం చేయాలంటే..
1) START 1 అని 1909కి  మెసేజ్ చేస్తే  బ్యాంకింగ్‌, క్రెడిట్‌కార్డ్స్‌,  ఇన్స్యూరెన్స్‌,  ఫైనాన్షియ‌ల్ ప్రొడ‌క్ట్స్‌కు సంబంధించినవి మార్కెటింగ్ కాల్స్‌, మెసేజ్‌లే వ‌స్తాయి. మిగిలివ‌న్నీ బ్లాక్ అవుతాయి.  
2) START 2 అని 1909కి  మెసేజ్ చేస్తే  రియ‌ల్ ఎస్టేట్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలినవి రావు.
3) START 3 అని 1909కి  మెసేజ్ చేస్తే  ఎడ్యుకేష‌న్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
4) START 4 అని 1909కి  మెసేజ్ చేస్తే  హెల్త్‌కు  సంబంధించిన‌వి త‌ప్ప మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.
5) START 5 అని 1909కి  మెసేజ్ చేస్తే  క‌న్స్యూమ‌ర్ గూడ్స్‌, ఆటోమొబైల్స్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి.  
6) START 6 అని 1909కి  మెసేజ్ చేస్తే   క‌మ్యూనికేష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌,  ఐటీ, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి.  
7) START 7 అని 1909కి  మెసేజ్ చేస్తే   టూరిజ‌మ్‌కు సంబంధించిన‌వే వ‌స్తాయి. మిగిలిన మార్కెటింగ్‌, ప్ర‌మోష‌న‌ల్ కాల్స్ బ్లాక్ అవుతాయి.

జన రంజకమైన వార్తలు