• తాజా వార్తలు
  •  

టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ యూజ్ చేసేట‌ప్పుడు లాక్ అయిపోకుండా ఉండ‌డం ఎలా?

పాస్‌వ‌ర్డ్ ఒక్క‌దానితో సెక్యూరిటీ ఉండ‌దేమోన‌నుకునేవాళ్ల‌కు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ బాగా యూజ్ అవుతుంది.  ఈ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను మీ సోష‌ల్, మెయిల్‌, బ్యాంక్ అకౌంట్స్‌కు కూడా  పెట్టుకోవ‌చ్చు. దీనిలో పాస్‌వ‌ర్డ్ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే కోడ్‌ను ఎంట‌ర్ చేస్తేనే ఆ అకౌంట్స్ యాక్సెస్ అవుతాయి. అంతా బాగానే ఉంది కానీ ఒక‌వేళ మీ ఫోన్ పోతే? లేదంటే మీరే దాన్ని రీసెట్ చేస్తే ప‌రిస్థితి ఏమిటి?  డేటా రికవ‌రీ ప్రాసెస్ క‌రెక్ట్‌గా పాటించ‌క‌పోతే  మీ అకౌంట్ల‌న్నీ లాక్ అయిపోయే ప్ర‌మాదం ఉంది.  అలాంటి పరిస్థితి త‌లెత్త‌కుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి..
బ్యాక‌ప్ కోడ్స్ ప్రింట‌వుట్ తీసుకోండి
మీ అకౌంట్ల‌కు సంబంధించి బ్యాక‌ప్ కోడ్స్‌ను ప్రింట‌వుట్ తీసుకుని ఎక్క‌డో ఒక‌చోట సేఫ్‌గా పెట్టుకోండి.  మీరు ఏదైనా అకౌంట్‌కు టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్ చేస్తున్న‌ప్పుడు ఆ వెబ్‌సైట్.. బ్యాక‌ప్ కోడ్ తీసుకుని సేఫ్‌గా పెట్టుకోండి అని చెబుతుంది. ఎప్పుడైనా మీ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేషన్‌ను మీరు మిస్స‌యితే ఈ కోడ్స్‌తో మీ అకౌంట్‌ను రీగెయిన్ చేసుకోగ‌లుగుతారు.  ఒక‌వేళ మీరు బ్యాక‌ప్ కోడ్ ప్రింట‌వుట్ తీసుకోక‌పోతే వెంట‌నే ఆ ప‌ని చేయండి.  
ఎప్ప‌టిక‌ప్పుడు జ‌న‌రేట్ చేసుకోండి
గూగుల్ అకౌంట్‌కి అయితే ఈ బ్యాక‌ప్ కోడ్స్ ఒక్కోటి ఒక్క‌సారి మాత్ర‌మే ప‌నిచేస్తాయి. కాబ‌ట్టి మీరు ఈ బ్యాక‌ప్ కోడ్స్‌ను వాడుతుంటే వెంట‌నే కొత్త‌వి కూడా జ‌న‌రేట్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్‌లో టూ స్టెప్ వెరిఫికేష‌న్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి బ్యాక‌ప్ కోడ్స్‌ను ప్రింట‌వుట్ తీసుకోవ‌చ్చు. ఇత‌ర వెబ్‌సైట్ల‌లో అయితే మీ అకౌంట్‌లోకి వెళ్లి టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్టింగ్స్‌లోకి  వెళితే బ్యాకప్ కోడ్స్ వ‌స్తాయి.
ఆథీ యాప్ వాడండి
గూగుల్ అథెంటికేట‌ర్ లేదా ఎస్ఎంఎస్‌కు ఆథీ  (Authy) యాప్ వాడండి. ఇది మీ డివైస్‌ల మ‌ధ్య టూ ఫాక్ట‌ర్ టోకెన్స్‌ను సింక్ చేస్తుంది. ఒక‌వేళ మీరు ఫోన్ మార్చినా లేదా పోగొట్టుకున్నా మీ డేటా ఆటోమేటిగ్గా కొత్త డివైస్‌లోకి మూవ్ చేసుకోవడానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోన్ నుంచి ఫోన్‌కు, ట్యాబ్‌కు కూడా డేటాను షేర్ చేసుకోవ‌చ్చు.  ఆథీ యాప్ గూగుల్ అథెంటికేట‌ర్‌తో కంపాటబులిటీ క‌లిగి ఉంటుంది కాబ‌ట్ట గూగుల్ అథెంటికేట‌ర్ యూజ్ చేసే  ఏ డివైస్‌లో అయినా దీన్ని వాడుకోవ‌చ్చు. సింకింగ్ ఫీచ‌రే కాదు సెక్యూరిటీప‌రంగా ఈ యాప్ చాలా బాగా ప‌నిచేస్తుంది.  
టైటానియం బ్యాక‌ప్ 
మీరు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌యి ఉండి గూగుల్ అథెంటికేట‌ర్‌ను వాడాల‌నుకుంటే.. అథెంటికేట‌ర్ యాప్ డేటాను టైటానియం బాక‌ప్ ద్వారా తీసుకోవ‌చ్చు. దీన్ని కావాలంటే త‌ర్వాత వేరే ఫోన్లో రీస్టోర్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే దీనికి రూట్ యాక్సిస్ అవ‌స‌రం.
* మీరు టూఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ రీస్టోర్ చేసుకోవాలంటే మీ ప‌ర్స‌న‌ల్ డిటెయిల్స్ అవ‌స‌ర‌మ‌వుతాయి. అందుకే టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేషన్ పెట్టుకుంటున్న‌ప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీల‌ను అప్‌డేట్‌గా ఉంచుకోండి. ఒక‌వేళ ఏమైనా మారిస్తే వాటిని టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్టింగ్స్‌లో అప్‌డేట్ చేయండి. ఎందుకంటే వాటికి ఎస్ఎంఎస్ లేదా మెయిల్ వస్తే మీ అకౌంట్‌ను మీరు యాక్సెస్ చేయ‌లేరు

జన రంజకమైన వార్తలు