• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎస్ఎంఎస్ లన్నీ బ్యాక్ అప్ తీసుకోవడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ ఫోన్‌...వంద‌లాది ఎస్ఎంఎస్‌ల‌ను మ‌నం భద్ర‌ప‌రుచుకుంటాం దీనిలో! కానీ ఫోన్ పాడైనా... లేదా ఎక్స్‌ఛేంజ్‌కు ఇవ్వాల్సి వ‌చ్చినా మ‌న ఎస్ఎంస్‌ల గురించి ఆందోళన చెందుతాం. ఈ ఎస్ఎంఎస్‌లు అన్ని ఎలా మ‌నం  భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌ని ఆలోచిస్తాం. కానీ చాలామంది ఎస్ఎంఎస్‌లు తీయ‌కుండానే ఫ్యాక్ట‌రీ రిసెట్ ద్వారా డేటాను క్లియ‌ర్ చేస్తారు.  మ‌రి ఆండ్రాయిడ్ ఫోన్లో  ఉన్న ఎస్ఎంఎస్‌ల‌ను ఎలా బ్యాక్ అప్ చేసుకోవాలో తెలుసుకుందామా!

ఎస్ఎంఎస్ ఎలా బ్యాక‌ప్ ఎలా  క్రియేట్ చేయాలంటే..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎస్ఎంఎస్ బ్యాక్ అప్ క్రియేట్ చేయాలంటే ముందుగా  కార్బోనైట్ ఎస్ఎంఎస్ బ్యాక్ అప్ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా ఒక్క స్టెప్ ఫాలో అవుతూ ముందుకెళితే  బ్యాక్ అప్ చేయ‌డం చాలా  సుల‌భం అవుతుంది. మ‌రి ఒక్కో స్టెప్ ద్వారా ఎలా బ్యాక్ అప్ చేసుకోవాలో  చూద్దామా..

1. కార్బోనైట్ ఎస్ఎంస్ బ్యాక్ అప్ రిస్టోర్ ఓపెన్ చేసి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి.

2. ముందుగా మీరు ఫైల్స్‌, కాంటాక్ట్స్‌, ఫోన్ కాల్స్ లాంటి వాటికి యాక్సెస్ ఇవ్వాలి

3. బ్యాక్ అప్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.

4.  టెక్ట్ మాత్ర‌మే బ్యాక్ అప్ చేసుకోవాల‌నుకుంటే ఫోన్ కాల్స్ ఆఫ్ చేసుకోవాలి. ఎంఎంఎస్‌, సెలెక్ట‌డ్ క‌న్వ‌ర్షేన్ల‌ను బ్యాక్ అప్ చేసుకోవాల‌నుకుంటే అడ్వాన్స‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని కూడా ఎంపిక చేసుకోవాలి.

5.  ఆ త‌ర్వాత  నెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. టొగెల్స్ ఉప‌యోగించి మీరు ఏది బ్యాక్ అప్ కావాల‌నుకుంటే  దాన్ని బ్యాక్ అప్ చేసుకోవాలి. దీని కోసం గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్‌ను ఎంచుకోవాలి. లేదంటే ఫైల్స్‌ను మాన్యువ‌ల్‌గా కాపీ చేసుకోవాలి

6. మీకు కావాల్సిన  చోట ఫైల్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత నెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. అవ‌స‌ర‌మైతే బ్యాక్ అప్ షెడ్యూల్ పెట్టుకుని ఎప్ప‌టికప్పుడు మీ డేటా బ్యాక్ అప్ అయ్యేలా చేసుకునే ఆప్ష‌న్లు కూడా  అందుబాటులోకి వ‌చ్చాయి.

ఎస్ఎంఎస్‌ల‌ను రిస్టోర్ చేయ‌డం
1. ఎస్ఎంఎస్‌ల‌ను మీ ఫోన్‌లో కాపీ చేయ‌చ్చో లేదో  చెక్ చేసుకోవాలి

2. కార్బ‌నైట్ ఎస్ఎంఎస్ బ్యాక్ అప్, రిస్టోర్ మీద ట్యాప్ చేయాలి.  ఆ త‌ర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి

3. హ్యాంబ‌ర్గ‌ర్ మెనూ మీద ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత రిస్టోర్ మీద క్లిక్  చేయాలి

4. ఆ త‌ర్వాత లోక‌ల్ బ్యాక్ అప్ లొకేష‌న్ మీద క్లిక్ చేయాలి.  దాన్ని గూగుల్ డ్రైవ్‌,  డ్రాప్‌బాక్స్‌లో సేవ్ చేసుకోవాలి

5.  మీరు ఎక్క‌డ రిస్టోర్  చేయాల‌నుకుంటున్నారో.. లేదా బ్యాక్ అప్ చేయాల‌నుకుంటున్నారో ఆ ఫైల్‌ను ఎంపిక చేసుకోవాలి

6.  ఆ త‌ర్వాత  రిస్టోర్ మీద క్లిక్  చేసి ఓకే  మీద  క్లిక్ చేయాలి. 

జన రంజకమైన వార్తలు