• తాజా వార్తలు

ట్రూ కాల‌ర్‌లో మీ కాంటాక్ట్స్‌, కాల్ హిస్ట‌రీని బ్యాక్ అప్, రీస్టోర్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఎక్కువ‌మంది వాడే యాప్‌ల‌లో ముందు వ‌రుస‌లో ఉండేది ట్రూ కాల‌ర్‌. అప‌రిచిత ఫోన్ నంబ‌ర్ల నుంచి ఇబ్బంది ప‌డ‌కుండా కాపాడుకోవ‌డానికి ఈ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. భార‌త్‌లో ఈ యాప్ వాడ‌కం బాగా ఎక్కువ‌.  అయితే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు వ‌చ్చే ఫోన్ల గురించి మాత్రం వివ‌రాలు తెలియ‌జేయ‌డం వ‌ర‌కే దీని ప‌ని. కానీ ఇప్పుడు ట్రూకాల‌ర్ ఛేంజ్ అయింది. తాజాగా అప్‌డేట్‌లో ట్రూ కాలర్ యాప్‌లో మ‌నం కాంటాక్ట్స్, కాల్ హిస్ట‌రీ బ్యాక్ అప్ రిస్టోర్ చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో చూద్దామా..

ఎలా స్టోర్ చేయాలంటే..
1.ముందుగా ప్లే స్టోర్ నుంచి ట్రూ కాల‌ర్ రీసెంట్ వెర్ష‌న్ (8.7.7 ప్ల‌స్‌)ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు అప్‌డేట్ క‌నిపించ‌క‌పోతే ఏపీకే మిర్ర‌ర్ ద్వారా లేటెస్ట్ ట్రూకాల‌ర్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2.ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్న త‌ర్వాత ఎడ‌మ వైపు నుంచి కుడి వైపుకు స్వైప్ చేయాలి. మీకు సెట్టింగ్స్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ట్రూ కాల‌ర్ బ్యాక్ అప్ క‌నిపిస్తుంది. 

3. బ్యాక్ అప్ ట్రూకాల‌ర్ డేటా అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. దీనిలో కాల్ లాగ్స్, హిస్ట‌రీ, కాంటాక్ట్స్‌, ఫ్రిఫ‌రెన్సెస్ కూడా ఉంటాయి. దీనిలో ఉన్న మ‌రో ఫీచ‌ర్ ట్రూ కాల‌ర్ కాంటాక్ట్స్. దీనిలో మీ ఫోన్‌లో సేవ్ కాని నంబ‌ర్లు ఉంటాయి. వాటిని మీరు చెక్ చేసుకోవ‌చ్చు. ఒక డ్రైవ్‌లా ఇది మ‌న‌కు అన్ని నంబ‌ర్ల‌ను సేవ్ చేస్తుంది. దీని కోసం మీరు గూగుల్ డ్రైవ్‌కు క‌నెక్ట్ చేయాలి.

4. ఈ ఆప్ష‌న్ ట‌ర్న్ అన్ చేయ‌గానే ట్రూకాల‌ర్ మీ కంటెంట్‌ను మీ గూగుల్ డ్రైవ్‌లోకి లోడ్ చేసుకుంటుంది. బ్యాక్ అప్‌లాగా ఇది మీకు ఎప్ప‌టికీ ఉంటుంది. అవ‌స‌రం లేని డేటాను ఎప్ప‌టిక‌ప్పుడు కూడా తొల‌గించే అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు