• తాజా వార్తలు

షియోమి స‌ర్వీస్ సెంట‌ర్‌కు ఆన్‌లైన్లో అపాయింట్‌మెంట్ బుక్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

చైనాలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ల త‌యారీ కంపెనీ షియోమి (Xiaomi -రెడ్‌మీ)  ఇండియ‌న్ మార్కెట్‌లో ఇప్పుడు శాంసంగ్‌, యాపిల్‌లాంటి కంపెనీల‌కు కూడా పోటీ ఇస్తోంది. సెల్ ఫోన్లతోపాటు ఫిట్‌నెస్ ట్రాకర్స్‌, ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్స్ వంటి వ‌స్తువుల‌ను విప‌ణిలోకి తెచ్చిన ఈ కంపెనీ స్మార్ట్ హోం టెక్నాల‌జీని కూడా ఇండియాలో చాలా సిటీస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇలా బిజినెస్ పెంచుకునే క్ర‌మంలో టైర్ 2, టైర్ 3 సిటీస్ల‌తో త‌మ సెల్‌ఫోన్లను అమ్మేందుకు సంగీతా, పూర్వికాలాంటి  లీడింగ్ మొబైల్ స్టోర్ల‌తో టైఅప్ చేసుకుంది. బిగ్‌బ‌జార్ లో కూడా షియోమి మొబైల్స్ అమ్ముతుంది.  
స‌ర్వీస్‌లో డ‌ల్‌
కంపెనీకి బిజినెస్ పెర‌గాలంటే ప్రొడక్ట్ క్వాలిటీతోపాటు స‌ర్వీస్ కూడా బాగుండాలి.  కానీ షియోమి స‌ర్వీస్ బాగుండ‌దు.  స‌ర్వీస్ సెంట‌ర్లు త‌క్కువ‌. వెళ్లినా గంట‌ల‌త‌ర‌బ‌డి వెయిట్ చేయాలి.  అందుకే షియోమి స‌ర్వీస్ సెంట‌ర్లు పెంచుతోంది. ఆన్‌లైన్‌లోనూ స‌ర్వీస్‌సెంట‌ర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది.  దీన్ని ఇండియాలో ఉన్న షియోమి స‌ర్వీస్ సెంట‌ర్ల‌న్నింటిలోనూ అప్ల‌యి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కంపెనీ చెబుతోంది.

ఎలా వాడుకోవాలంటే.. 
* ఎంఐ స్టోర్ (Mi Store) యాప్‌ను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత దానిలో రిజిస్ట‌ర్ చేసుకోవాలి
* అకౌంట్ సెక్ష‌న్‌లోకి వెళ్లి Customer Servicని క్లిక్ చేయాలి
* త‌ర్వాత స్టెప్‌లో  Service Center ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకుని మీ సిటీ, స్టేట్ ఎంట‌ర్ చేయాలి. 
*  ఇప్పుడు మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న స‌ర్వీస్ సెంట‌ర్ల వివ‌రాల‌న్నింటిని యాప్ చూపిస్తుంది.  
* మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న స‌ర్వీస్ సెంట‌ర్‌ను సెలెక్ట్ చేసుకుని  Join Queue Now ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.
* మీతోపాటు ఎంత‌మంది క్యూలోఉన్నారు.. మీ వంతు వ‌చ్చేస‌రికి ఎంత టైం ప‌డుతుందో అంచ‌నా వేసి చెబుతుంది.  
* మీ డిటెయిల్స్‌, ఫోన్ నెంబర్‌, మీ డివైస్‌లో ప్రాబ్ల‌మ్ ఎంట‌ర్ చేస్తే ఆన్‌లైన్లోనే టోకెన్ జ‌న‌రేట్ అవుతుంది. 
* యాప్ మీకు స‌ర్వీస్ సెంట‌ర్ ఇచ్చిన టైం, డేట్ నోటిఫై చేస్తుంది. దీంతో స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి వెయిట్ చేయ‌న‌క్క‌ర్లేకుండా డైరెక్ట్‌గా వెళ్లి స‌ర్వీస్ చేయించుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు