• తాజా వార్తలు

యాప్ లేకుండా ఓలా, ఉబెర్ క్యాబ్‌ల‌ను పీసీ నుంచి బుక్ చేయడం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

క్యాబ్ బుక్ చేయాలంటే ఏం చేస్తారు?  సింపుల్‌.. మొబైల్ తీసి ఓలా, ఉబెర్ ఏదో ఒక క్యాబ్ యాప్ ఓపెన్ చేసి బుక్ చేస్తారు. అంతేనా.. మ‌రి పీసీ ముందు ఉంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా మొబైల్ తీసుకుంటారా? అవ‌స‌రం లేదు. ఓలా,  ఉబెర్ క్యాబ్‌ల‌ను యాప్ లేకుండా డైరెక్ట్‌గా  పీసీ నుంచే బుక్ చేసుకోవ‌చ్చు. అదెలాగో చూడండి.   
ఉబెర్ క్యాబ్  బుక్ చేయండి ఇలా.. 
* మీ పీసీలో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి m.uber.comలోకి వెళ్లండి
 * నెక్స్ట్ పేజీలో మీ ఫోన్ నెంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్ ఇవ్వండి . 
* ఫోన్‌కు వ‌చ్చే ఓటీపీని ఎంట‌ర్ చేస్తే బుకింగ్ పేజీలోకి వెళ‌తారు.  
* ఇప్పుడు మీకు లొకేష‌న్ స‌ర్వీస్ వ‌స్తుంది. దీన్ని మీరు అనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవ‌చ్చు. బుకింగ్ స్క్రీన్‌లో పిక‌ప్‌, డ్రాప్ లొకేష‌న్స్ ఎంట‌ర్ చేయాలి. 
*  ట్రిప్ మ్యాప్‌తో పాటు మీకున్న క్యాబ్ ఆప్ష‌న్లు, ఫేర్ ఎస్ట‌మేట్స్‌, పిక‌ప్ టైం అన్నీ స్క్రీన్ మీద క‌నిపిస్తాయి. పేమెంట్ ఆప్ష‌న్లు అక్క‌డే ఉంటాయి. రిక్వెస్ట్ బ‌ట‌న్ నొక్కితే ఉబెర్ క్యాబ్ ఓపెన్ అవుతుంది.  
ఉబెర్ యాప్ ఫ‌ర్ విండోస్ 
ఇదంతా ఇబ్బంది అనుకుంటే  విండోస్ 10 సిస్టమ్స్‌లో ప‌ని చేసే స్పెష‌ల్ ఉబెర్ యాప్ ఉంది. దీనిలో కూడా పైన చెప్పిన ప్రొసీజ‌రే ఉంటుంది.  విడోస్ 8 ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌ల‌కు కోసం అయితే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఉబెర్ విండోస్ యాప్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసి వాడుకోవ‌చ్చు.  
ఉబెర్ యాప్ ఫ‌ర్ మ్యాక్  
ఉబెర్‌కి మ్యాక్ కోసం స్పెష‌ల్‌గా యాప్ లేదు. కానీ Fastlane  యాప్‌ను ఉప‌యోగించి మీ యాపిల్ పీసీ లేదా మ్యాక్ ద్వారా ఉబెర్ యాప్‌ను బుక్ చేసుకోవ‌చ్చు.  ఇది ఉబెర్  అఫీషియ‌ల్ యాప్ మాదిరిగానే ప‌ని చేస్తుంది. 
ఉబెర్ విత్ ఆఫీస్ 365
ఉబెర్ మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి ఆఫీస్ 365 యూజ‌ర్ల కోసం దీన్ని తీసుకొచ్చింది. మీరు ఆఫీస్ 365 స‌బ్‌స్ర్కైబ‌ర్ అయితే ఉబెర్ అవుట్‌లుక్ ఏపీఐల‌ను యూజ్ చేసుకోవ‌చ్చు. మీ మీటింగ్స్‌, టూర్స్‌కు క్యాబ్ రైడ్ కావాల‌నుకుంటే క్యాలెండ‌ర్ మీద రిమైండ‌ర్‌గా పెట్టుకునే ఆప్ష‌న్ కూడా ఉంది. ఆ రోజు మీకు పాప్ అప్ రిమైండ‌ర్ వ‌స్తుంది. దాన్ని స్వైప్ చేసి రైడ్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు.  

యాప్ లేకుండా ఓలా క్యాబ్ బుక్ చేయడం ఎలాగంటే..  
 పీసీలో బ్రౌజ‌ర్‌ను  ఓపెన్ చేసి  www.olacabs.comలోకి వెళ్లండి
* లెఫ్ట్ సైడ్ బాక్స్‌లో  మీ పిక‌ప్, డ్రాప్ లొక‌ష‌న్స్‌, టైమ్ ఎంట‌ర్ చేయండి.  Search Cabsను క్లిక్ చేయండి .
* ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న క్యాబ్స్‌, ఫేర్ అంచ‌నాలు క‌నిపిస్తాయి. కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. 
* Cash as the payment option అని వ‌స్తే మీ బుకింగ్ ప్రాసెస్ మొద‌ల‌యినట్టే. 
* ఇప్పుడు మీ ఫోన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి.  ఫోన్‌కు వ‌చ్చిన ఓటీపీ ఎంట‌ర్ చేయండి.
* మీ బుకింగ్ క‌న్ఫ‌ర్మ్ అవుతుంది.  
అయితే బుకింగ్ కాలేద‌ని మ‌రొక క్యాబ్ బుక్ చేస్తే వాటిని క్యాన్సిల్ చేయ‌డం పీసీలో క‌ష్ట‌మే.
ఓలాకు కూడా విండోస్ స్పెష‌ల్ యాప్ ఉంది. అయితే విండోస్ 10 ఉన్న పీసీల్లో మాత్ర‌మే ప‌ని చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు