• తాజా వార్తలు
  •  

299 రూపాయ‌ల పేటీఎం మూవీ పాస్‌తో నెలంతా ఉచితంగా మూవీస్ చూడ‌డం ఎలా?

ఎంత గొప్ప టీవీలు వ‌చ్చినా, హోం థియేట‌ర్లు వ‌చ్చినా థియేట‌ర్లో సినిమా చూస్తే ఆ మ‌జానే వేరు.  కానీ టికెట్ కాస్ట్  పెరిగిపోయాయ‌ని బాధ‌ప‌డుతున్నారా?  డోంట్ వ‌ర్రీ. పేటీఎం మూవీపాస్ కొనుక్కుంటే  నెలంతా ఫ్రీగా మూవీస్ చూడొచ్చు. పాస్ ధ‌ర 299 రూపాయ‌ల నుంచి స్టార్ట‌వుతుంది.  నెల‌కు నాలుగు సినిమాల వ‌ర‌కు మీ ప్ర‌తి బుకింగ్‌కు 100% క్యాష్ బ్యాక్ మీ పేటీఎం వ్యాలెట్‌లో యాడ్ అవ‌డం దీనిలో హైలైట్‌.  పేటీఎం ప్ర‌స్తుతం బెంగ‌ళూరు,పుణె, చెన్నై,  ఢిల్లీ, గుంటూరు, గుర్‌గావ్ త‌దిత‌ర న‌గ‌రాల్లో 299రూపాయ‌ల‌కు ఈ ఆఫ‌ర్‌ను ఇస్తుంది. మిగ‌తా సిటీస్‌లోనూ కాస్త ప్రైస్ వేరియేష‌న్‌తో ఈ ఆఫ‌ర్ ఉంది.   హైద‌రాబాద్‌లో సింగిల్ ప‌ర్స‌న్‌కు 349 రూపాయ‌లు, క‌పుల్ ఆఫ‌ర్ అయితే 699 రూపాయ‌ల‌కు లభిస్తుంది. 
ఎలా కొనుక్కోవాలి?
1.పేటీఎంలోకి వెళ్లి మూవీ ఐకాన్‌ని క్లిక్ చేసి మెనూ లిస్ట్‌లోనుంచి సిటీని సెలెక్ట్ చేసుకోండి
2.  సినిమా టికెట్ల ఆఫ‌ర్లు టాప్ లో క‌నిపిస్తాయి.దాన్ని  లెఫ్ట్‌కు స్క్రోల్ చేస్తూ వెళితే మూవీపాస్,కార్నివాల్ సినిమా మూవీ కార్డ్ ఇలాంటి ఆఫ‌ర్లు క‌నిపిస్తాయి. వీటిని క్లిక్ చేస్తే  మీకు సింగిల్‌, కపుల్ పాస్  వివ‌రాలు, ప్రైస్ ఎంతో డిస్ ప్లే అవుతుంది.  
3. సింగిల్ అయితే సింగిల్‌, క‌పుల్ అయితే క‌పుల్ మీద క్లిక్‌చేయాలి.
4. మీ పేరు, మొబైల్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ ఎంట‌ర్‌చేసి Buy Now బ‌ట‌న్ క్లిక్ చేయండి
5. పేటీఎం వాలెట్ లేదా మ‌రే ఇత‌ర పేమెంట్ మోడ్ ద్వారా అయినా పేమెంట్ చేయండి
6. మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా యూనిక్ పాస్ కోడ్ వ‌స్తుంది. ఒక‌వేళ రాక‌పోతే Your orders సెక్ష‌న్‌లోకి వెళ్లి మీ పాస్ కోడ్‌ను తీసుకోవ‌చ్చు.
పేటీఎం మూవీపాస్ కోడ్‌తో టికెట్ బుకింగ్ 
1.పేటీఎం మూవీ ఆఫ‌ర్ పేజీలోకి వెళ్లండి
2.మీ సిటీ, మూవీ, థియేట‌ర్‌, డేట్‌, టైం సెలెక్ట్ చేసుకోండి.
3. సింగిల్ పాస్ అయితే ఒక సీటు, క‌పుల్ సీట్ అయితే రెండు సీట్లు బుక్‌చేసుకోండి.
4. ఇప్పుడు ప్రోమో కోడ్ ఫీల్డ్‌లో మీ యూనిక్ పాస్ కోడ్ ఎంట‌ర్‌చేయండి.
5. పేమెంట్ కంప్లీట్ చేయండి. మీకు ఎస్ఎంఎస్‌,మెయిల్ ద్వారా టికెట్ వ‌చ్చేస్తుంది.
6. 100% క్యాష్ బ్యాక్ కూడా వ‌స్తుంది. 
ప‌రిమితులు
* రోజుకు ఒక్క‌సారి మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌ను వాడుకోగ‌ల‌రు.
* నెల‌లో నాలుగు సార్ల‌కే ప‌రిమితం
* బాక్స్ ఆఫీస్‌లో టికెట్లు తీసుకోలేరు. వెబ్ లేదా యాప్ ద్వారా మాత్ర‌మే కొనుక్కోగ‌లుగుతారు.
 

జన రంజకమైన వార్తలు