• తాజా వార్తలు
  •  

శాంసంగ్ ఫోన్లో ఫాంట్స్‌ను మార్చ‌డం,కొత్త ఫాంట్స్ యాడ్ చేయడం ఎలా?

శాంసంగ్ ఫోన్ వాడుతున్న వాళ్ల‌కు ఒక ప్రాబ్ల‌మ్ ఎదుర‌య్యే ఉంటుంది. అది ఫాంట్ ప్రాబ్ల‌మ్. అంటే శాంసంగ్ చాలా ఫోన్ల‌లో మ‌న‌కు డిఫాల్ట్‌గా ఒక ఫాంట్ ఉంటుంది. ఇది చాలామందికి న‌చ్చ‌ని ఫాంట్‌. కానీ ఛేంజ్ చేద్దామంటే ఎలా చేయాలో తెలియ‌దు. ఇలాంటి వారి కోసం ఒక ఆప్ష‌న్ ఉంది. ఇది చాలా సుల‌భం.దీని కోసం మీరు ఫాంట్ ప్యాక్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎలా మార్చాలంటే...
శాంసంగ్ ఫోన్లో ప్ర‌స్తుతం వాడుతున్న ఫాంట్‌ను కొద్దిగా మార్చాలంటే చాలా సుల‌భం. ముందుగా నోటిఫికేష‌న్ షేడ్‌ను కింద‌కు లాగాలి. కాగ్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. డిస్‌ప్లే ఆప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు ఫాంట్ అండ్ స్క్రీన్ జూమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.  ఈ మెనూలో మీరు స్క్రీన్ జూమ్ మ‌రియు ఫాంట్ సైజుల‌ను మార్చే ఆప్ష‌న్ల‌ను చూడొచ్చు. అలాగే స్క్రోల్ చేసుకుంటూ ముందుకు పోతే అడుగు భాగంలో ఫాంట్ స్ట‌యిల్ అనే సెక్ష‌న్ క‌నిపిస్తుంది. అందులో మీకు కొన్ని ఫాంట్ ఛాయిస్‌లు క‌నిపిస్తాయి. వాటిలో కొన్నింటిని ఎంచుకోవాలి. 

కొత్త ఫాంట్‌ల‌ను యాడ్ చేయాలంటే...
మీ శాంసంగ్ ఫోన్‌కు కొత్త ఫాంట్‌ను యాడ్ చేయాలంటే ఫాంట్ స్ట‌యిల్ మెనూలోని అడుగు భాగంలో డౌన్‌లోడ్ ఫాంట్స్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. ఇది మిమ్మ‌ల్ని గెలాక్సీ యాప్స్ స్టోర్‌లోకి తీసుకెళ్తుంది. దీనిలో మీకు ఎన్నో ర‌కాల శాంసంగ్ ఫాంట్స్ క‌నిపిస్తాయి. అయితే వీటిలో ఎక్కువ ఫాంట్‌ల‌ను డ‌బ్బులు చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. వీటిలో ఉచితంగా దొరికే ఫాంట్‌ను చూడాలంటే.. టాప్ ఫ్రీ అనే ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు చాలా ర‌కాలైన ఫాంట్‌లు దొరుకుతాయి. అయితే పెయిడ్ సెక్ష‌న్‌లోనే మీకు అద్భుత‌మైన ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి.  వింసీ, ఫాట్ బోయ్ లాంటి ఫాంట్స్ దీనిలోనే ఉన్నాయి. వీటిని 1.79 డాల‌ర్లు వెచ్చించి కొనుక్కోవాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు