• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో ఉచితంగా బ్యాడ్జీలు త‌యారుచేసుకోవ‌డం ఎలా?

స‌భ‌లు, స‌మావేశాల‌ప్పుడు ప్ర‌తినిధులంతా బ్యాడ్జీలు పెట్టుకోవ‌డం మ‌నం చూస్తుంటాం.  ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ క‌లిసే గెట్ టు గెద‌ర్స్‌, గార్డెన్ పార్టీస్‌లో కూడా ఇలాంటివి  ఈమ‌ధ్య‌న ఎక్కువ‌గా పెట్టుకుంటున్నారు.  వీటికి బోల్డంత ఖ‌ర్చుచేయాల్సిన ప‌ని కూడా లేదు. ఆన్‌లైన్‌లోనే ఫ్రీగా బ్యాడ్జీలు త‌యారుచేసే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. అందులోబెస్ట్  వెబ్‌సైట్లు కొన్ని మీ కోసం..
బ్యాడ్జ్ జ‌న‌రేట‌ర్ (Badge Generator)
ఈ వెబ్‌సైట్‌లో  బ్యాడ్జిలు త‌యారుచేసుకోవడానికి ర‌క‌ర‌కాల షేప్స్ ర‌డీగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ క‌ల‌ర్స్‌ను మ‌నం సెట్ చేసుకోవ‌చ్చు. బ్యాడ్జ్ బోర్డ‌ర్‌, దాని క‌ల‌ర్ కూడా సెట్ చేసుకోవ‌చ్చు. టెక్స్ట్ యాడ్‌చేసుకోవ‌డానికి బ్యాడ్జి మార్క్‌పై క్లిక్ చేస్తే చాలు. టెక్స్ట్ ఫాంట్‌, సైజ్‌కూడా మార్చుకోవ‌చ్చు.  క‌స్ట‌మ‌ర్ పారామీట‌ర్స్‌తో షాడో కూడా యాడ్ చేసుకోవ‌చ్చు.  బ్యాడ్జిని క్రియేట్ చేసుకున్నాక దాన్ని పీసీలోకి పీఎన్‌జీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఓపెన్ బ్యాడ్జెస్ (open Badges)
ఓపెన్ బ్యాడ్జెస్ కూడా బ్యాడ్జీల క్రియేష‌న్ ఈజీగా చేసుకోగ‌లిగే మ‌రో వెబ్‌సైట్‌. మీరు కావాల్సిన‌ట్లుగా టెక్స్ట్, బ్యాన‌ర్‌, షేప్ క్రియేట్ చేసుకోవ‌చ్చు.  క‌ర్వ్‌డ్‌, నార్మ‌ల్ రెండు ర‌కాల టెక్స్ట్‌లు అందుబాటులో ఉంటాయి. డిఫ‌రెంట్ టైప్స్‌లో ఉండే బ్యాన‌ర్లు, ఐకాన్స్‌, షేప్స్ నుంచి మీరు  కావాల్సింది సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. వాటి సైజ్‌,క‌ల‌ర్‌, పొజిష‌న్ కూడా మార్చుకోవ‌చ్చు.  బ్యాడ్జిని క్రియేట్ చేసుకున్నాక దాన్ని  పీఎన్‌జీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 
3డీ బ్యాడ్జ్ మేక‌ర్ (3D Badge Maker)
ఎక్స్‌ప‌ర్ట్‌లు త‌యారుచేసిన బ్యాడ్జ్‌లా క‌నిపించేవి త‌యారుచేసుకోవాలంటే  మీరు త్రీడీ బ్యాడ్జ్‌ల‌కు వెళ్లాలి. ఇందుకోసం  3డీ బ్యాడ్జ్ మేక‌ర్ వెబ్‌సైట్ ఉంది. ఇందులో మీకు కావ‌ల్సిన క‌ల‌ర్‌, షేప్ సెలెక్ట్ చేసుకుని  టెక్స్ట్ యాడ్ చేసుకుని బ్యాడ్జి క్రియేట్ చేసుకోవ‌డ‌మే.  మీరు సెలెక్ట్ చేసుకోవ‌డానికి బోల్డ‌న్ని షేప్స్, ప్యాట్ర‌న్స్ ర‌డీగా ఉంటాయి.  ఇలా క్రియేట్ చేసుకున్న‌బ్యాడ్జిని కావాలంటే షేర్ చేసుకోవ‌చ్చు. పీఎన్‌జీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు