• తాజా వార్తలు
  •  

ఏ వాట్సాప్ స్టేట‌స్‌నైనా మీ ఫోన్ గ్యాల‌రీలో సేవ్ చేసుకోవడం ఎలా?

వాట్సాప్ ఫీచ‌ర్ల‌లో అద్భుత‌మైన‌ది,  దాని యూజ‌ర్లంద‌రికీ బాగా ద‌గ్గ‌ర‌య్యింది ఏది అంటే వాట్సాప్ స్టేటస్ అని క‌చ్చితంగా చెప్పొచ్చు. స్నాప్‌చాట్‌లో ఉన్న స్టోరీస్ ఫీచ‌ర్ ఇన్‌స్పిరేష‌న్‌తో వాట్సాప్.. స్టేట‌స్ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.  దీనిలో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు ఏదైనా స్టేట‌స్‌గా పెట్టుకోవ‌చ్చు అని మ‌నంద‌రికీ తెలుసు.అయితే మీ ఫ్రెండో, బంధువో పెట్టుకున్న వాట్సాప్ వీడియోనో, ఫొటోనో మీకు న‌చ్చితే దాన్ని సేవ్ చేసుకునే ఆప్ష‌న్ వాట్సాప్‌లో లేదు. అయితే ఈ పని చేసిపెట్ట‌డానికి చాలా యాప్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఓ మంచి యాప్.. స్టోరీ సేవ‌ర్ ఫ‌ర్ వాట్సాప్ (Story Saver for Whatsapp) గురించి ఈ ఆర్టిక‌ల్‌లో చ‌దవండి.
స్టోరీ సేవ‌ర్ ఫ‌ర్ వాట్సాప్.. ఒక ఆండ్రాయిడ్ యాప్‌.దీంతో మీ  కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న ఎవ‌రి వాట్సాప్ స్టేట‌స్ నుంచి అయినా ఇమేజ్‌లు, వీడియోల‌ను నేరుగా మీ ఫోన్ గ్యాల‌రీలో సేవ్ చేసుకోవ‌చ్చు. 
ఎలా సేవ్ చేసుకోవాలి?
* Story Saver for Whatsapp యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
* యాప్ ఓపెన్ చేసి Recent Stories ఆప్ష‌న్‌ను  క్లిక్ చేయండి.  ఫోటోలు, వీడియోలు వేర్వేరు ట్యాబ్స్‌లో క‌నిపిస్తాయి.
* మీకు సేవ్ చేసుకోవాల‌నుకున్న ఫొటోలు, వీడియోల‌ను సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి అన్ని ఫోటోలు, వీడియోల‌ను సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.లేదంటే మ‌ల్టిపుల్ సెలెక్ష‌న్ కూడా చేసుకోండి.
* ఇప్పుడు టాప్‌లో ఉన్న download ఐకాన్‌ను క్లిక్ చేయండి.
* మీ ఫోన్ గ్యాల‌రీలో StoryPictures ఫోల్డ‌ర్‌లో ఫొటోలు.  StoryVideos గ్యాల‌రీలో వీడియోలు సేవ్ అవుతాయి.
* Saved Stories ఆప్ష‌న్‌లోకి వెళితే మీరు సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు స్లైడ్ షోలా క‌నిపిస్తాయి కూడా.
* ఇలా సేవ్‌చేసిన ఇమేజ్‌లు, వీడియోల‌ను రీపోస్ట్ లేదా ఫార్వార్డ్ చేయ‌డానికి కూడా యాప్‌లో ఆప్ష‌న్లు ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు