• తాజా వార్తలు

మీ జీమెయిల్‌, క్యాలెండ‌ర్‌, డాక్స్, ఇత‌ర గూగుల్ డేటాను బ్యాక్అప్ తీసుకోవడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

కంప్యూట‌ర్‌లో మ‌నం ఎంతో విలువైన స‌మాచారాన్ని భ‌ద్ర‌ప‌రుచుకుంటాం. కేవ‌లం మొయిల్ మాత్రమే కాదు ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల ద్వారా కూడా స‌మాచారాన్ని షేర్ చేయ‌డం, దాయ‌డం లాంటివి చేస్తాం. అయితే కంప్యూట‌ర్ అనేది శాశ్వ‌తం కాదు. అది ఎప్పుడైనా ఎలాగైనా ఇబ్బంది ఎదుర్కొనొచ్చు. అంటే ఏ క్ష‌ణమైనా డ్యామేజ్ కావొచ్చు, రిపేర్‌కు వెళ్లొచ్చు. ఈ నేప‌థ్యంలో మ‌న డేటా ప‌రిస్థితి ఏంటి? మ‌న కీల‌క‌మైన స‌మాచారం ఏం కావాలి?. చాలామందికి ఈ అనుమానం ఉంటుంది. మ‌రి మ‌న జీమెయిల్‌, క్యాలెండ‌ర్‌, డాక్స్‌లో ఉన్న స‌మాచారాన్ని బ్యాక్అప్ తీసుకోవాలంటే ఏం చేయాలి?

గూగుల్ టేక్ ఔట్‌
గూగుల్‌కు సంబంధించి స‌మ‌స్త స‌మాచారాన్ని సేక‌రించ‌డానికి ఒక ఆప్ష‌న్ ఉంది. అదే గూగుల్ టేక్ ఔట్.  ఇది కొన్నేళ్ల క్రిత‌మే కంప్యూట‌ర్ రంగంలోకి వ‌చ్చింది. కానీ చాలామందికి దీని గురించి తెలియ‌దు. ఇది మీ గూగుల్ స‌ర్వీసుల్లో ఉన్న అంతా స‌మాచారాన్ని డౌన్‌లోడ్ చేసి పెడుతుంది. గూగుల్ ప్ల‌స్‌, బ్లాగ‌ర్‌, బుక్‌మార్క్స్‌, క్యాలెండ‌ర్స్‌, డ్రైవ్‌, హ్యాంగ్ ఔట్స్‌, గ్రూప్స్‌, జీమెయిల్‌, ప్లే బుక్స్ ఇలా దేనికి సంబంధించిన స‌మాచారం అయినా వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది.  వీట‌న్నిటి కోసం ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌వేర్ వేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. గూగుల్ టేక్ ఔట్ ఒక్క‌టి ఉంటే చాలు. గూగుల్ టేక్ ఔట్ టూల్‌ను మీ కంప్యూట‌ర్‌లోనో లేదా స్మార్ట్‌ఫోన్‌లోనూ డౌన్ లోడ్ చేసుకోవాలి.  ఆ త‌ర్వాత గూగుల్ అకౌంట్లోకి వెళ్లి మేనేజ్ గూగుల్ యాక్టివిటీని క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కంట్రోల్ యువ‌ర్ కంటెంట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే క్రియేట్ ఆర్కివ్ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది.  మీరు ఏం డౌన్‌లోడ్ చేసుకోవాల‌నుకుంటున్నారో ఆ డేటాను క్లిక్ చేస్తే చాలు. 

ఒక‌టికి మించి ఆప్ష‌న్లు
మ‌నం డౌన్‌లోడ్ చేసే స‌మ‌యంలో ఎన్నో ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఉదాహర‌ణ‌కు బ్లాగ్‌లో డేటాను డౌన్‌లోడ్ చేయాలంటే బ్లాగ్‌లో ఒక‌టికి మించి స‌బ్ బ్లాగ్‌లు ఉండే అవ‌కాశం ఉంది. ఇలాంట‌ప్పుడు మీరు ప్ర‌త్యేకించి టిక్ మార్క్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ డేటా కావాలో ఆ డేటా మాత్ర‌మే మ‌న‌కు స్టోర్ అవుతుంది త‌ప్ప మొత్తం  డేటా స్టోర్ కాదు.  అయితే డౌన్‌లోడింగ్‌లో ఉన్న మ‌రో ఇబ్బంది ఏంటంటే ఫార్మాట్లు. ఒక్కో డేటా ఒక్కో ఫార్మాట్లో ఉంటుంది. జేపీజీ, బిట్‌మాప్‌, జేఎస్ఓఎన్ లాంటి ఫార్మాట్ల‌ను విడి విడిగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు