• తాజా వార్తలు

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌లో మ‌న చాట్‌ని ఎన్‌క్రిప్ట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఫేస్‌బుక్‌.. ట్విట‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియో సైట్లు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో 24 గంట‌లు చాటింగ్ చేస్తూనే ఉంటారు. భార‌త్ లాంటి దేశంలో ట్విట‌ర్‌ను ప‌క్క‌న‌పెడితే ఫేస్‌బుక్‌ను వాడే వాళ్ల సంఖ్య రెట్టింపు ఉంటుంది. మ‌రి ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌లో చేస్తున్న చాట్ ఎంత వ‌ర‌కు సుర‌క్షితం. మ‌న ఫొటోలు, మ‌న చాటింగ్ ఎవ‌రికి తెలియ‌కుండా ఉంటాయా? మ‌న మెసేజ్‌ల‌ను ఎవ‌రైనా చ‌దువుతారా? ఇలాంటి అనుమానాలు రావ‌డం స‌హ‌జం. వాట్స‌ప్‌లో అయితే చాటింగ్ కోసం ఎన్‌క్రిప్ష‌న్ ఉంది. దీని వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే చాటింగ్ మూడో కంటికి తెలియ‌దు. మ‌రి ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌లో చాటింగ్‌ను ఎన్‌క్రిప్ట్ చేయ‌డం ఎలా?

కీ బేస్ వాడండి
ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌లో మ‌న చాటింగ్‌ను ఎన్‌క్రిప్ట్ చేయాలంటే ఒక యాప్ ఉంది. అదే కీ బేస్‌. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని కొన్ని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు మీ ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయిన‌ట్లే. ఫేస్‌బుక్, ట్విట‌ర్ మాత్ర‌మే కాదు రెడిట్‌, గిట్‌హ‌బ్‌, హాక‌ర్ న్యూస్ లాంటి సోష‌ల్ మీడియా సైట్ల‌లో కూడా ఈ యాప్‌ను వాడుకోవ‌చ్చు.  ఈ యాప్‌ను ముందుగా డెస్క్‌టాప్ మీద డౌన్‌లోడ్ చేసుకోవాలి. కీ బేస్ యాప్ ప్ర‌స్తుతానికి మాక్‌, లిన‌క్స్‌, విండోస్ ల‌లో ల‌భ్యం అవుతోంది.  దీన్ని డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తేమీ టెర్మిన‌ల్‌లో ఉప‌యోగించుకోవ‌చ్చా అని అడుగుతుంది.. దాన్ని ఒకే చేసి.. ఇన్‌స్టాల్ ప్రొసిజ‌ర్ కంప్లీట్ చేయాలి. 

మ‌న సైట్ల‌ను వెరిఫై చేసి..
కీ బేస్ ఇన్‌స్టాల్ అయిన త‌ర్వాత అది మ‌న‌కు ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ ఇత‌ర సోష‌ల్ మీడియా సైట్ల‌ను వెరిఫై  చేస్తుంది. దీని కోసం ప‌బ్లిక్‌గా కొన్ని వెరిఫికేష‌న్ నోటీసులు పోస్ట్ చేస్తుంది. వాటిని డిలీట్ చేయ‌కూడ‌ద‌ని కూడా మీకు ఒక సందేశం పంపిస్తుంది. అస‌లైన యూజ‌ర్ మీరా కాదా అని తెలుకోవ‌డం కోస‌మే కీ బేస్ ఇలా సందేశాలు పంపిస్తుంది. అలాగే ప్ర‌తి ప్రొఫైల్‌ను చెక్ చేస్తుంది.  ఆ త‌ర్వాత బ్రౌజ‌ర్ ఎక్స‌టెన్ష‌న్ ఇన్‌స్టాల్ చేసి చాటింగ్ చేసుకోవ‌చ్చు. మీకు ఇన్‌స్టాల్ చేసుకున్న త‌ర్వాత మీ సోష‌ల్ మీడియా సైట్ల‌లో కీబేస్ బ‌ట‌న్స్ క‌నిపిస్తాయి. మీ చాటింగ్‌ను సుర‌క్షితంగా ఉంచుతాయి. మీ డెస్క్‌టాప్ యాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న‌ప్పుడు మీరు ఫైల్స్ షేర్ చేసుకోవ‌చ్చు, నోటిఫికేష‌న్ల‌ను ట‌ర్న్ఆన్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు