• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్  అప్ టు డేట్‌, సెక్యూర్‌గా ఉంద‌ని తెలుసుకోవడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నామంటే దాని బాగోగులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. దాన్ని అలా వ‌దిలేశామంటే ఆ త‌ర్వాత ఇబ్బందులు చాలా ఉంటాయి. దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవ‌డంతో పాటు అప్‌టు డేగా మెయిన్‌టెన్ చేయ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలెంటో చూద్దామా...

మొబైల్ సెక్యూరిటీ ఎందుకు ముఖ్యం!
ఫోన్‌ను పోగొట్టుకున్నా.. లేదా ఎవ‌రైనా దొంగిలించినా.. మ‌న ప‌ర్స‌న‌ల్ డేటాకే ముప్పు. అందుకే మొబైల్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. అందుకే క్లౌడ్ ద్వారా డేటాను దాచుకోవ‌డం కీల‌కం. క్లౌడ్‌తో పాటు గూగుల్ డ్రైవ్ కూడా మొబైల్‌లోని డేటాను సెక్యూర్‌గా ఉంచుకోవ‌చ్చు. మీ మొబైల్ సుర‌క్షితంగా ఉండాలంటే పాస్‌వ‌ర్డ్స్‌, పిన్‌లు బ‌లంగా ఉండ‌డం కీల‌కం. వేరేవాళ్లు గెస్ చేసేలా మ‌న పిన్ నంబ‌ర్లు, ప్యాట్ర‌న్లు ఉండ‌కూడ‌దు. క్రాక్  లాంటి   సైబ‌ర్  దాడుల  నుంచి ర‌క్షించుకోవ‌డానికి మొబైల్ సుర‌క్షిత‌గా ఉండాలి.

ఈ ఐదు దాడుల నుంచి కాపాడుకోవాలి

ఆండ్రాయిడ్ టార్గెటెడ్ రామ్స‌మ్‌వేర్‌

క్లిక‌ర్ ట్రోజాన్స్‌

జెవియ‌ర్ మాలిసియ‌స్ యాడ్‌వేర్‌

ఫేక్ పోక్‌మ‌న్ గో యాప్స్‌

ద పోక్‌మ‌న్ గో ఫేక్‌

ఇలాంటి  వైర‌స్‌ల నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకోవ‌డానికి సెక్యూరిటీ టూల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ  ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్ టు డేట్‌గా ఉండేలా చూసుకోవాలి.

అప్‌డేట్స్ చెకింగ్
మీ ఆండ్రాయిడ్ సుర‌క్షితంగా ఉండాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇందుకోసం త‌ర‌చూ అప్ డేష‌న్‌లు చేసుకోవాలి.  సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ డివైజ్ క్లిక్ చేయాలి.. ఆ త‌ర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మీద క్లిక్ చేయాలి. ఆపై చెక్ ఫ‌ర్ అప్‌డేట్ క్లిక్ చేయాలి.  అప్‌డేట్ ఉంటే వెంట‌నే ఆ ప‌ని పూర్తి చేయాలి. ఆటో అప్‌డేట్ ఆప్ష‌న్ పెట్టుకుంటే ఇంకా మంచిది. దీని వ‌ల్ల యాప్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అయిపోతుంటారు.                                                          

జన రంజకమైన వార్తలు