• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ కాల్ హిస్టరీని ఎక్సెల్ ఫైల్‌కి ఎక్స్‌పోర్ట్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

 

ఫోన్ మార్చిన‌ప్పుడు కాంటాక్ట్స్ సిమ్ ద్వారా కాపీ చేసుకుంటాం. మ‌రి కాల్స్ విష‌య‌మేంటి?  మీరు బిజినెస్ చేస్తున్నా, లేదా జాబ్‌చేస్తున్నా ఒక్కోసారి వేరే వాళ్ల‌కు చూపించ‌డానికి కాల్ హిస్ట‌రీ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇంకేదైనా ప‌ని ప‌డొచ్చు. మీ కాల్ లిస్ట్‌ను యాజ్‌టీజ్‌గా ఎక్సెల్ ఫైల్‌కు ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌డానికి  ఓ యాప్ ఉంది.  దాని పేరే కాల్ హిస్ట‌రీ మేనేజ‌ర్ (Call History Manager).    దాదాపు 5 ల‌క్ష‌ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఆండ్రాయిడ్ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాల్ లాగ్ మొత్తాన్ని (అవుట్ గోయింగ్‌, ఇన్‌క‌మింగ్, మిస్‌డ్ కాల్స్‌తో సహా) స్టోర్ చేసుకోవ‌చ్చు. 
ఈ యాప్‌తో ఏం చేయొచ్చంటే.. 
ఎక్స్‌పోర్ట్ కాల్ లాగ్‌:  ఈ యాప్‌తో 1000 రోజుల కాల్ హిస్ట‌రీని ఎక్స్ఎల్ ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత దాన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ తో ఓపెన్ చేసుకోవ‌చ్చు. 
కాల్ స్టాటిస్టిక్స్‌:   ఇన్‌కమింగ్ కాల్స్‌, అవుట్‌గోయింగ్ కాల్స్‌మీద మీరెంత టైం స్పెండ్ చేశారో మెజ‌ర్ చేసుకోవ‌చ్చు. టైం ఫ్రేంను పెట్టి మీరు ఫోన్ కాల్స్‌కు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో చూసుకోవ‌చ్చు. 
ఫేక్ కాల్‌:  మీరు ఎవ‌రికైనా ఫేక్ కాల్ చేయాల‌న్నా ఈ యాప్ ద్వారా చేసుకోవ‌చ్చు   
సెండ్ బ్యాక‌ప్ త్రూ ఈ మెయిల్‌:  మీ కాల్ లాగ్‌ను బ్యాక‌ప్ తీసి ఆ ఫైల్‌ను ఎవ‌రికైనా పంపాలంటే ఈ మెయిల్ ఆప్ష‌న్ కూడా ఉంది.  
రీస్టోర్‌:  బ్యాక‌ప్పే కాదు పొర‌పాటున డీలెట్ చేసిన కాల్ హిస్ట‌రీని రీస్టోర్ కూడా చేసుకోవ‌చ్చు.  
బ్లాక్‌లిస్ట్‌: ఏదైనా నెంబ‌ర్‌నుంచి వ‌చ్చ‌యిన కాల్స్‌  కాల్‌లాగ్‌లో సేవ్ కాకూడ‌ద‌నుకుంటే వాళ్ల నెంబ‌ర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు.

కాల్ లాగ్‌ను ఎక్స్ఎల్ ఫైల్‌కు ఎక్స్‌పోర్ట్ చేయాలంటే..  
కాల్ హిస్ట‌రీ మేనేజ‌ర్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. ఓపెన్ చేసి ఫోన్ కాల్స్‌, మెసేజ్ వంటి వాటికి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు మీ యాప్‌లో కాల్ లాగ్ కనిపిస్తుంది. దాని ప‌క్క‌న ఉన్న ఎక్స్ఎల్ షీట్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అంతే మీ కాల్‌లాగ్ మొత్తం ఎక్స్ఎల్ ఫైల్‌లోకి అప్‌లోడ్ అవుతుంది. మెయిల్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఈ బ్యాక‌ప్‌ను మెయిల్ చేయ‌వ‌చ్చు. నేమ్‌, నెంబ‌ర్‌, టైం ఆప్ష‌న్ల‌తో ప‌ర్టిక్యుల‌ర్ డిటెయిల్స్ మాత్ర‌మే కావాలంటే వాటినే బ్యాక‌ప్ తీసుకోవ‌చ్చు.  
ఆండ్రాయిడ్ 4.0  ఆపైన వ‌చ్చిన వెర్ష‌న్లు ఉన్న ఫోన్ల‌లో ఈ యాప్ ప‌ని చేస్తుంది. ఇది ఫ్రీ యాప్‌. 60 రూపాయ‌ల‌తో పెయిడ్ యాప్ కూడా ఉంది. దీనిలో మ‌రిన్ని ఫీచ‌ర్లుంటాయి.  

జన రంజకమైన వార్తలు