• తాజా వార్తలు
  •  

పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్టెడ్ రార్ ఫైల్స్‌ను  పాస్‌వ‌ర్డ్ లేకుండా ఎక్స్‌ట్రాక్ట్ చేయ‌డం ఎలా? 

రార్ ఫైల్స్‌..  హెవీ ఫైల్స్‌ను కంప్రెస్ చేసి పంప‌డానికి ఉన్న ఆప్ష‌న్ల‌లో ఒక‌టి. జిఫ్ ఫైల్‌లాగానే దీనికి కూడా పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకోవ‌చ్చు.  విండోస్ 7,8, 10, ఎక్స్‌పీ ఇలా అన్ని వెర్ష‌న్లలోనూ ఈ రార్ ఫైల్స్ ప‌ని చేస్తాయి. అయితే  కంపెనీలు మీకు ఏదైనా మెయిల్ పంపేట‌ప్పుడు ఈ రార్ ఫైల్‌కు పాస్‌వ‌ర్డ్ పెట్టి పంపుతాయి. ఆ పాస్‌వ‌ర్డ్‌ను మీకు షేర్ చేస్తాయి. మీరు ఆ పాస్‌వ‌ర్డ్ పోగొట్టుకున్నా లేదా మ‌ర్చిపోయినా ఫైల్ ఓపెన్ చేయ‌డం సాధ్య‌ప‌డ‌దు.కానీ దానికోచిట్కా ఉంది. వాటిని ఉప‌యోగిస్తే పాస్‌వ‌ర్డ్ లేక‌పోయినా కూడా రార్ ఫైల్స్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు. అదెలా చేయాలో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకోండి.
 

రార్ పాస్‌వ‌ర్డ్ రిమూవ‌ర్ టూల్‌ (Rar Password Remover tool )
* పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో Rar Password Remover టూల్  డౌన్‌లోడ్ చేసుకోండి.
* సాఫ్ట్‌వేర్ లాంచ్ చేసి, పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్‌ను ఓపెన్ చేయండి.
* Recovery Option >> Select Dictionary attackను సెలెక్ట్ చేయండి.
* దీన్ని గుర్తిస్తే ఆ ఫైల్‌కు సంబంధించిన పాస్‌వ‌ర్డ్ మీకు పాప్ అప్‌లో క‌నిపిస్తుంది.
* కాపీ చేసి రార్ ఫైల్‌ను ఓపెన్ చేయండి.
* ఒక‌వేళ ఇది ఫెయిల‌యితే brute Force attackని ట్రైచేయండి.
ఐసీ రార్ పాస్‌వ‌ర్డ్ రిమూవ‌ర్ టూల్ (Isee Rar Password Remover Tool)
*ఐసీ రార్ పాస్‌వ‌ర్డ్ రిమూవ‌ర్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
* టూల్‌ను ఓపెన్‌చేసి మీ ఫైల్‌ను ఓపెన్ చేయండి. 
* ఏదైనా attackను సెలెక్ట్ చేయండి.
* కొన్ని నిముషాల్లోనే ఈ టూల్ మీ ఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను రిక‌వ‌ర్‌చేస్తుంది. దానితో మీ రార్ ఫైల్‌నుఎక్స్‌ట్రాక్ట్ చేసుకోండి.
రార్ పాస్‌వ‌ర్డ్ రిక‌వ‌రీ టూల్ (Rar Password Recovery tool)
* ఐసీ రార్ పాస్‌వ‌ర్డ్ రిమూవ‌ర్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
 * టూల్‌ను ఓపెన్ చేసి మీ ఫైల్‌ను బ్రౌజ్‌చేయండి.
* Recovery tab >>  Brute Force attackను టాప్ చేయండి
* start బ‌ట‌న్‌ను క్లిక్ చేయండి. కొంత‌సేప‌టికి పాస్‌వ‌ర్డ్  రిక‌వ‌రీ అవుతుంది.

జన రంజకమైన వార్తలు