• తాజా వార్తలు
  •  

గూగుల్ మ్యాప్ ప్ల‌స్ కోడ్‌లు ఉప‌యోగించి అడ్రెస్‌లు జ‌న‌రేట్‌, సెర్చ్ చేయ‌డం ఎలా?

మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా కొత్త కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తీసుకు రావ‌డంలో గూగుల్‌ను మించింది లేదు.  ట్రెండ్‌కు స‌రిపోయేలా... వినియోగ‌దారులకు ఉప‌యోగ‌ప‌డేలా గూగుల్ కొన్ని ఫీచ‌ర్లు అందిస్తోంది. అందులో అత్యంత కీల‌మైంది మ్యాప్‌లు. అప్‌డేటెడ్ వెర్ష‌న్ల ద్వారా ఈ మ్యాప్‌ల‌లోనూ ఎన్నో కొత్త ఫీచ‌ర్లు తెస్తోంది గూగుల్‌. ఒక ప్రాంతాన్ని సెర్చ్ చేయ‌డానికి, అడ్రెస్‌ల‌ను క‌నుక్కోవ‌డానికి  ఏరియా కోడ్‌ల‌ను ఉప‌యోగిస్తోంది. మ‌రి ఏరియా కోడ్‌లు ఉప‌యోగించిం అడ్రెస్‌లు ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం..

గూగుల్ మ్యాప్ ప్ల‌స్ కోడ్స్ జ‌న‌రేట్ చేయ‌డం
లోకేష‌న్ షేరింగ్ ఫీచ‌ర్ మాదిరిగానే గూగుల్ ప్ల‌స్ కోడ్స్ ప‌ని చేస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు  జీపీఎస్‌ను ఉప‌యోగించుకుని యూజర్ల‌కు సంబంధించిన లొకేష‌న్ల‌ను షేర్ చేయ‌డానికి గూగుల్ మ్యాప్ ఉప‌యోగ‌ప‌డేవి. ఈ ఫీచ‌ర్‌ను మ‌రింత సర‌ళం చేయ‌డానికి గూగుల్ ప్ల‌స్ కోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ రెండింట్లోనూ ల‌భ్యం అవుతుంది. దీని వ‌ల్ల‌ ప్ర‌ధాన‌మైన ఉప‌యోగం ఏమిటంటే మ‌న‌కు ఒక ఏరియాకు సంబంధించిన మొత్తం అడ్రెస్ గుర్తు ఉండ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. మ‌న‌కు ఇది దారి చూపిస్తుంది. అదెలాగంటే..

1. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్‌లో గూగుల్ మ్యాప్‌ను ఓపెన్ చేయాలి. 

2. గూగుల్ మ్యాప్స్‌లో మీరు వెళ్లాల్సిన ఏరియాను హోల్డ్ చేసి ఎక్క‌డ పిన్‌ను డ్రాప్ చేయాలి

3. అడ్రెస్ మీద ట్యాప్ చేయాలి. లేదా అడ్రెస్ డిస్క్రిప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి.

4. మీరు అలా చేసి స్క్రోల్ డౌన్ చేస్తే అడుగుభాగంలో ప్ల‌స్ కోడ్ క‌నిపిస్తుంది. 

5. ఆ ప్ల‌స్ కోడ్‌ను కాపీ చేసి మీరు ఎక్క‌డైనా షేర్ చేసుకోవ‌చ్చు.


ఈ ఆప్ష‌న్‌ను మీ అనుభ‌వం కొద్దీ మ‌రింత స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

అడ్రెస్‌ను సెర్చ్ చేయాలంటే..

1. ప్ల‌స్ కోడ్స్‌ను ఉప‌యోగించి అడ్రెస్‌ల‌ను సెర్చ్ చేయ‌డం చాలా సుల‌భం. ముందుగా మీరు ఆ ప్ల‌స్ కోడ్‌ను కాపీ చేసుకోవాలి. దాన్నే మీరు గూగుల్ మ్యాప్ సెర్చ్ బార్‌లో ఎంట‌ర్ చేయాలి

2. సెర్చ్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. మ్యాప్ ఆటోమెటిక్‌గా మీకు కావాల్సిన అడ్రెస్‌ను క‌చ్చితంగా చూపిస్తుంది

3. మ్యాప్ బార్‌లో మాత్ర‌మే కాదు ఈ ప్ల‌స్ కోడ్స్‌ను సెర్చ్‌బార్‌లోనూ పేస్ట్ చేయ‌చ్చు. మీకు గూగుల్ సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో మీ లొకేష‌న్ క‌నిపిస్తుంది.  

జన రంజకమైన వార్తలు