• తాజా వార్తలు
  •  

ఎంఎస్ ఆఫీస్‌ను ఉచితంగా, అఫీషియల్‌గా పొందడం ఎలా?

కంప్యూట‌ర్ గురించి ప‌రిచ‌యం ఉన్న ఏ ఒక్క‌రికీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.  మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌, ఎక్సెల్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, పెయింట్‌,డాస్ ఇలా ఎన్నో  మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ దాదాపు అన్ని కంప్యూట‌ర్ల‌లోనే వాడ‌తారు.  విండోస్ కంప్యూట‌ర్ల‌న్నింటిలో ర‌న్న‌య్యే ఈ ఆఫీస్  సూట్‌ను ఇప్ప‌డు ఆండ్రాయిడ్‌, ఐవోఎస్  ఫ్లాట్‌ఫామ్‌ల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్‌.  అయితే వీటిని మ‌నీ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఆరునెల‌ల‌పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ను ఫ్రీగా పొందేందుకు మార్గ‌ముంది. అదేంటో ఈ ఆర్టిక‌ల్‌లో చ‌ద‌వండి.
యాప్‌లు వ‌చ్చేశాయి..
మీరు విండోస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌లు క‌నుక వాడుతుంటే మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌, ఎక్సెల్‌, పవ‌ర్ పాయింట్ ఫ్రీ వెర్ష‌న్ల‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్‌లో మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, ఎక్సెల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఐవోఎస్ డివైస్‌ల‌కు యాపిల్ ఐ స్టోర్ నుంచి, విండోస్ డివైస్‌ల‌కు విండోస్ స్టోర్ నుంచి ఈ యాప్స్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే ఈ ఫ్రీ యాప్స్‌లో ఫీచ‌ర్లు లిమిటెడ్‌గా ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్‌లోనూ వాడుకోవ‌చ్చు
దీనిలో మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేమిటంటే మైక్రోసాఫ్ట్ ఈ ఫ్రీ ఆఫీస్ సూట్‌ను 10 ఇంచెస్ కంటే త‌క్కువ స్క్రీన్ సైజ్ ఉన్న డివైస్‌ల‌కు కూడా కంపాటబిలిటీ ఉండేలా త‌యారుచేసింది. కాబ‌ట్టి వీటిని మీరు ఆండ్రాయిడ్‌, విండోస్ స్మార్ట్‌ఫోన్‌ల్లో, ఐఫోన్ల‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవ‌చ్చు. ఐపాడ్‌లో కూడా వాడొచ్చు.అయితే ఐపాడ్ ప్రో వీటిని స‌పోర్ట్ చేయ‌దు.
10.1ఇంచెస్ కంటే పెద్ద స్క్రీన్ల‌కూ..
మీరు వ‌ర్డ్‌, ఎక్సెల్‌, ప‌వ‌ర్‌పాయింట్ ఫ్రీ వెర్ష‌న్ల‌ను101.ఇంచెస్ కంటే పెద్ద సైజ్ స్క్రీన్ ఉన్న విండోస్ డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్‌లో కూడా . Office 365 స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుని దీన్ని ట్రై చేయొచ్చు. ఇది  ఒక నెల‌పాటు ఫ్రీగా ఎంఎస్ ఆఫీస్‌ను వాడుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తుంది.

జన రంజకమైన వార్తలు