• తాజా వార్తలు

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లో మీ ఆక్టివ్ స్టేట‌స్‌ను హైడ్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఫేస్‌బుక్ మెసెజంర్ చాలా మంది వాడుతుంటారు. మ‌నం ఆన్‌లైన్‌లోకి రాగానే మ‌నం యాక్టివ్‌గా ఉన్నట్లు ఒక సింబ‌ల్ అంద‌రికి క‌నిపిస్తుంటుంది.  అయితే కొంత‌మందికి ఇలా ఆన్‌లైన్‌లో ఉన్నా.. వేరే వాళ్ల‌కు తెలియ‌డం ఇష్టం ఉండ‌దు. మనం యాక్టివ్‌గా ఉన్న‌ట్లు క‌న‌బ‌డ‌గానే చాలామంది వెంట‌నే హాయ్ అని..హ‌లో అని మెసేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల‌కైతే ఇదో పెద్ద త‌ల‌నొప్పి. ఏ స‌మ‌యంలో ఆన్‌లైన్‌కి వ‌చ్చినా మెసేజ్‌ల ప‌రంప‌ర వ‌స్తూనే ఉంటుంది. మ‌రి మ‌నం ఆన్‌లైన్‌లో ఉన్నా.. ఎవ‌రికీ క‌నబ‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి?

మొబైల్‌లో అయితే ఇలా... 

చాలామంది మొబైల్‌లో ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను వాడుతుంటారు. కానీ త‌మ యాక్టివ్ స్టేట‌స్‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా చేయ‌డం ఎలాగో వారికి తెలియ‌దు. మీ మొబైల్‌లో మెసెంజ‌ర్ స్టేట‌స్ డిజేబుల్ చేయ‌డానికి ఒక ఆప్ష‌న్ ఉంది. ముందుగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెసెంజ‌ర్ యాప్‌ను క్లిక్ చేయాలి. దీనిలో పీపుల్ అనే ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.  దానిపై ఉన్నయాక్టివ్ ట్యాబ్ మీద టాప్ చేయాలి. అక్క‌డ క‌నిపించే మీ పేరు మీద క్లిక్ చేసి యాక్టివ్ స్టేట‌స్‌ను డిజేబుల్ చేయాలి.

మెసెంజ‌ర్‌.కామ్‌లో ఇలా.. 

మెసెంజ‌ర్‌.కామ్‌లో కూడా మ‌నం మ‌న స్టేట‌స్‌ను డిజేబుల్ చేసుకోవ‌చ్చు. దీని కోసం మెసెంజ‌ర్‌.కామ్‌ను క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత లెఫ్ట్   కార్న‌ర్ పైన ఉన్న చిన్న ఐకాన్‌ను క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత సెట్టింగ్స్‌లో యాక్టివ్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత స్లైడ్ బార్ మీద యాక్టివ్ స్టేట‌స్ అనే ఆప్ష‌న్‌ను ట‌ర్న్ ఆఫ్ చేయాలి. అంతే.. మీరు యాక్టివ్ స్టేట‌స్ డిజేబుల్ అవుతుంది.               

జన రంజకమైన వార్తలు