• తాజా వార్తలు
  •  

ఏ క్రోమ్ ఎక్స్‌ టెన్ష‌న్‌ నైనా ఫైర్ ఫాక్స్ లో ఇన్‌స్టాల్ చేయ‌డం ఎలా?

ఫైర్‌ఫాక్స్ అద్భుత‌మైన బ్రౌజ‌ర్‌. కానీ చాలామంది క్రోమ్‌ను వాడ‌టానికే ఇష్ట‌ప‌డ‌తారు. దీనిలో ఉన్న ఫ్లెక్లిబిలీటి, ఇంట‌ర్‌ఫేసే ఇందుకు కార‌ణం. అయితే ఇప్పుడు ఫైర్‌పాక్స్‌లో ఉంటూ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ల‌ను ఎలా వాడుకోవచ్చో తెలుసా? అంటే క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి ఫైర్‌ఫాక్స్ ఎక్స‌టెన్ష‌న్ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీనిలో ఓపెరా ఎక్స్‌టెన్ష‌న్ కూడా వ‌ర్క్ అవుతుంది. మ‌రి ఫైర్‌ఫాక్స్‌లో క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం..

క్రోమ్ స్టోర్ ఫాక్స్‌ఫీల్డ్ సెట‌ప్‌
ముందుగా క్రోమ్ స్టోర్ ఫాక్స్‌ఫీల్డ్ పేజీని ఓపెన్ చేయాలి..ఆ త‌ర్వాత యాడ్ టు ఫైర్ ఫాక్స్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.  క‌న్ఫ‌ర్మేష‌న్ డైలాగ్స్ ద్వారా ముందుకెళ్లాలి. అప్పుడు మీకో స్క్రీన్ క‌నిపిస్తుంది. ఈ స్క్రీన్ క‌నిపించిన త‌ర్వాత మీరు ఇన్‌స్టాలేష‌న్‌కు సిద్ధం అయిన‌ట్లు లెక్క‌. క్రోమ్ లేదా ఓపెరా ఎక్స్‌టెన్ష‌న్స్ ఇన్‌స్టాల్ చేసేముందు యాడ్ఆన్స్ మొజిల్లా.కామ్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ కావాలి. మీ ఫైర్‌ఫాక్స్ అకౌంట్ ద్వారా లాగిన్ కావాలి. ఒక‌వేళ లేక‌పోతే కొత్త‌దాన్ని క్రియేట్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ ప్ర‌క్రియ త‌ప్ప‌నిస‌రి.

క్రోమ్ యాడ్స్ ఆన్ ఇన్‌స్టాల్ 
క్రోమ్ స్టోర్ ఫాక్స్‌ఫీల్డ్ ఎక్స్‌టెన్ష‌న్ ఓపెన్ చేసిన త‌ర్వాత మీ ఫైర్‌ఫాక్స్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాలి. క్రోమ్ వెబ్ స్టోర్ దగ్గ‌ర‌కు వెళ్లి ఇన్‌స్టాలింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాలి. మిలినీల్స్ టు స్నేక్ పీపుల్ కోసం దీన్ని ఉప‌యోగించొచ్చు. ఆ త‌ర్వాత యాడ్ టు ఫైర్‌ఫాక్స్ బ‌ట‌న్ ప్రెస్ చేస్తే చాలు.  ఆ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయ‌గానే మీకు కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి. ఇన్‌స్టాల్ చేయాలా అనే ఆప్ష‌న్ కూడా వ‌స్తుంది. ఆ ప‌ర్మిష‌న్ మీరు ఇస్తే చాలు.  అంతే ఫైర్‌ఫాక్స్‌లో క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ఉప‌యోగించి వాడుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు