• తాజా వార్తలు

జియో ఫోన్‌లో ఫేస్‌బుక్ ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

దేశంలో ఇప్ప‌టికీ 2జీ నెట్‌వ‌ర్క్‌తో ఫీచ‌ర్ ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్ల‌ను ఎట్రాక్ట్ చేసేందుకు రిల‌య‌న్స్ గ్రూప్‌..జియో ఫీచ‌ర్ ఫోన్‌ను లాస్ట్ ఇయ‌ర్ జులైలో ఇంట్ర‌డ్యూస్ చేసింది. దీపావ‌ళి నుంచి ఫోన్లు యూజ‌ర్ల‌కు అందాయి. 1500 రూపాయ‌ల‌తో ఈ ఫోన్ కొనుక్కుని నెల‌కు 153 రూపాయ‌ల రీఛార్జి చేయించుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్‌, కొంత డేటా కూడా వ‌స్తాయి. అయితే ఇందులో సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్స్ ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటివి అందుబాటులో లేక‌పోవ‌డంతో యూజర్లు అసంతృప్తికి లోన‌వుతున్నారు. దీంతో జియో త‌న జియో ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూడండి.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
* జియో ఫోన్ యూజ‌ర్లు త‌మ మొబైల్‌లో జియో స్టోర్‌లోకి వెళ్లి Social సెక్ష‌న్‌లోకి ఎంట‌రవ్వాలి
* అక్క‌డ ఫేస్‌బుక్ యాప్ క‌నిపిస్తుంది. దాన్నిక్లిక్ చేయ‌గానే ఇన్‌స్టాలేష‌న్ ఎలా చేయాలో ఆప్ష‌న్స్ చూపిస్తుంది.
* ఆ  సూచ‌న‌లు ఫాలో అవుతూ  యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన‌ట్లు  మీకు నోటిఫికేష‌న్ వ‌స్తుంది. 
ఫేస్‌బుక్ లైట్ యాప్ మాదిరిగానే..
జియో ఫోన్‌లో వ‌చ్చిన ఫేస్‌బుక్ యాప్‌.. ఫేస్‌బుక్ లైట్ యాప్ మాదిరిగానే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల‌తో పోల్చితే దీనిలో చిన్న డిస్‌ప్లే ఉండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్లుగానే ఇంట‌ర్‌ఫేస్‌ను ఆప్టిమైజ్‌చేశారు.న్యూస్ ఫీడ్, సెట్టింగ్స్ మార్చుకోవ‌డం వంటివి చేయ‌డానికి యాప్‌లో ఓ క‌ర్స‌ర్ ఉంది. వీడియో ప్లేబ్యాక్‌, పుష్ నోటిఫికేష‌న్స్‌, ఫేస్బుక్ ఫీడ్‌లో వ‌చ్చిన పోస్ట్‌ల నుంచి ఎక్స్‌ట‌ర్న‌ల్ లింక్స్‌ను ఓపెన్ చేయ‌డం వంటి అన్ని ఫీచ‌ర్లు కూడా దీనిలో ఉన్నాయి. కొత్త యూజ‌ర్ల‌తోపాటు ఇప్ప‌టికే  జియో ఫోన్ వాడుతున్న‌వారు కూడా ఈ ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని జియో నిన్న ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో వాట్సాప్ కూడా  ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.
 

జన రంజకమైన వార్తలు