• తాజా వార్తలు
  •  

మీ ఫోన్‌లోనే సొంతంగా క్యూఆర్ కోడ్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌డం ఎలా?

ఇప్పుడు న‌డిచేది డిజిట‌ల్ యుగం. ఏం చేసినా అది ఎల‌క్ట్రానిక్స్‌నితోనే ముడిప‌డి ఉంటుంది.  చివ‌రికి మ‌నం షాపింగ్ చేసినా.. ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హించినా.. ట్రావెల్ చేసినా... ఇదైనా స‌రే అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది. మ‌నం షాపింగ్‌కు వెళితే జ‌స్ట్ ఒక క్యూఆర్ కోడ్ ద్వారా డ‌బ్బులు  చెల్లించే  అవ‌కాశం వ‌చ్చేసింది.  అంతేకాదు క్యూఆర్ కోడ్ ద్వారా మ‌నం డ‌బ్బులు కూడా రిసీస్ చేసుకోవ‌చ్చు. అయితే చాలామంది క్యూఆర్ కోడ్ అంటే తెలియ‌దు.  అదేదో మ‌నకు సంబంధించిన విష‌యం కాద‌నుకుంటారు.  పేటీఎం లాంటి యాప్‌లు ఇప్ప‌టికే  ఈ కోడ్‌ను బాగా పాపుల‌ర్  చేశాయి.  ఏం లేదండీ మ‌న‌కు సంబంధించిన డిటైల్స్‌ను స్కాన్ చేసి అందుకు త‌గ్గ‌ట్టుగా లావాదేవీలు నిర్వ‌హించ‌డమే క్యూఆర్ కోడ్ చేసే ప‌ని. ఈ మ‌రి ఈ టెక్నాల‌జీని మ‌న సొంత‌గా  మ‌న ఫోన్‌లో  జ‌న‌రేట్ చేసుకోవ‌డం ఎలా?


ఐఫోన్‌లో అయితే ఇలా..
క్యూఆర్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవ‌డానికి ఎన్నో యాప్‌లు,  సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ క్యూఆర్ రీడర్ అందులో ద బెస్ట్  అని చెప్పొచ్చు.  ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఐఫోన్‌లో దీన్ని ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఈ యాప్‌ను ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న‌యారోపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. ఆపై దిగువున ఉన్నక్యూఆర్ కోడ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత టాప్ లెఫ్ట్ కార్న‌ర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ప్రాసెస్‌ క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఏ టైప్ క్యూఆర్ కోడ్ కావాలో ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు వెబ్ పేజ్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ కావాలంటే వెబ్‌పేజ్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. మీకు కావాల్సిన అన్ని వివ‌రాలు ఇచ్చిన త‌ర్వాత చివ‌ర్లో క్రియేట్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే చాలు.  ఆ త‌ర్వాత క్యూఆర్ కోడ్‌ను ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్‌లో ఇలా..
మీకో ఆండ్రాయిడ్ డివైజ్ ఉంటే అందులో క్యూఆర్ కోడ్ ఎలా జ‌న‌రేట్ చేసుకోవాలో చూద్దాం. ప్లే స్టోర్‌కు వెళ్లి క్యూఆర్ కోడ్ జ‌న‌రేట‌ర్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ  యాప్‌ను ఓపెన్ చేసి టాప్‌లో ఉన్న టెక్ట్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఐఫోన్‌లో చూసిన‌ట్లుగా అన్ని ఆప్ష‌న్లు దీనికి ఉండవు. ఆ త‌ర్వాత ఈమెయిల్‌ను ఎంపిక  చేసుకోవాలి.  మీరు క్రియేట్ చేసే క్యూఆర్ కోడ్‌ను  బ‌ట్టి  ఈమెయిల్ అడ్రెస్‌ను టైప్ చేయాలి. ఆఖ‌ర్లో జ‌న‌రేట్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. అంతే... మీ క్యూఆర్ కోడ్ క్రియేట్ అయిపోతుంది. ఆ త‌ర్వాత క్యూఆర్ కోడ్ ఇమేజ్‌ను గ్యాల‌రీలో సేవ్ చేసుకోవాలి.  మీరు కావాల‌నుకుంటే ఆ క్యూఆర్ కోడ్‌ను ఎంత‌మందికైనా పంపించుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు