ఫేస్బుక్లో ఉన్న ఉత్తమమైన ఫీచర్లలో మెసెంజర్ ఒకటి. ఫేస్బుక్లో అందరితో పాటు చాటింగ్ చేసే అవకాశం ఉన్నా... మెసెంజర్ ఉండడం వల్ల పర్సనల్ మనం మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీని వల్ల మనం అవతలి వారికి త్వరగా మన సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు మెసెంజర్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. దీనిలో మనం నిక్‌నేమ్స్ పెట్టుకోవచ్చు. ప్రత్యేకమైన ఎమోజీలను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కోసారి మనం ఒకరికి మెసేజ్‌లు పంపబోయి మరొకరికి పంపుతుంటాం. అందుకోసమే మనం మెసెంజర్లో పర్సనలైజ్ చేసుకోవాలి. మరి అదెలా చేసుకోవాలో తెలుసా?
ఎలా చేయాలంటే...
1.ఫేస్‌బుక్‌లోకి వెళ్లి మీరు ఏ చాట్‌ను పర్సనలైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు రైట్ టాప్‌లో ఒక గేర్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టాప్ చేయాలి.ఈ గేర్ ఐకాన్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఎడిట్ నిక్‌నేమ్స్, ఛేంజ్ కలర్ అని ఆప్షన్లను మీరు చూడొచ్చు.
2.ఎడిట్ నిక్‌నేమ్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ చాట్‌లో ఎవరి పేరుకైనా ఒక నిక్‌నేమ్ పెట్టాలి. ముందుగా ఎవరికి నిక్‌నేమ్ పెట్టాలనుకుంటున్నారో వారి పేరును సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత వారికో నిక్‌నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3.ఆ తర్వాత ఆప్షన్ దగ్గరకు వెళ్లి కలర్ ఛేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు కనబడే చాలా కలర్స్‌లో మంచిగా కనబడే కలర్నుఎంచుకోవాలి. అంతే చాట్ కలర్ మారిపోతుంది.
4.ఆ తర్వాత ఎమోజీ ఆప్షన్‌కు వెళ్లి క్లిక్ చేయాలి. సైడ్‌బార్‌లో మీకు ఎమోజీలు కనబడతాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకోవాలి. అంతే మీరు అనుకున్న ఆప్షన్లను ఉపయోగించున్నట్లే. మీరు కావాలంటే ఎప్పుడైనా నిక్‌నేమ్, కలర్, ఎమోజీలను మార్చుకోవచ్చు. ఇవేకాక మరిన్ని ఆప్షన్లు మెసెంజర్లో ఉన్నాయి. అంటే రకరకాల ఐకాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీ చాటింగ్‌ను బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే చాలు మీ చాట్ పర్సనలైజ్ అయిపోతుంది. రాంగ్ పర్సన్‌కు మీ మెసేజ్‌లు వెళ్లవు. ఎందుకంటే మీకు కావాల్సిన చాట్‌కు వేరే రంగు, ఎమోజీలు, నిక్‌నేమ్ ఉంటాయి కాబట్టి.