• తాజా వార్తలు
  •  

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో మీ లొకేష‌న్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పంప‌డం ఎలా?

ప్ర‌మాదాలు ఎప్పుడు ఎలా వ‌స్తాయో తెలియ‌దు. ఇలాంటప్పుడు వేగంగా స్పందించ‌క‌పోతే మ‌నం చాలా ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ చేతిలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌నం ఆచూకీని క‌నిపెట్ట‌డం.. లేదా మ‌న స్నేహితుల‌ను ట్రాక్ చేయ‌డం చాలా సుల‌భం అయిపోయింది. మీ కారు ఎక్క‌డో ఆగిపోయింది. మీకు ఇంట‌ర్నెట్ కూడా లేదు. ఈ స్థితిలో మీరున్న లొకేష‌న్‌ను మీ సన్నిహితుల‌కు పంప‌డం ఎలా?  జ‌స్ట్ ఎస్ఎంఎస్ ద్వారా గూగూల్ మ్యాప్స్ సాయంతో మ‌న లొకేష‌న్ పంపొచ్చు. దానికో ప్రాసెస్ ఉంది అదేంటో తెలుసుకుందాం...

గూగుల్ మెసేజస్‌ యాప్‌తో..
గూగుల్ మెసేజింగ్ యాప్ సాయంతో ఎస్ఎంఎస్‌, ఎంఎంఎస్ ద్వారా మ‌న లొకేష‌న్‌ను పంపించే అవ‌కాశం ఉంది.  అయితే ప్ర‌స్తుతం ఇది గూగుల్ నెక్స‌స్‌, పిక్స‌ల్ ఫోన్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఒక‌వేళ ఈ రెండు ఫోన్ల‌ను మీరు ఉప‌యోగించ‌క‌పోయినా వేరే ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ఆండ్రాయిడ్ మెసేజ‌స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  సింపుల్‌గా మీకు కావాల్సిన వారి నంబ‌ర్‌ను క్లిక్ చేసి మీరున్న లొకేష‌న్‌ను ట్యాగ్ చేయ‌చ్చు. దీంతో వారికి మీరు ఎక్క‌డ ఉన్నారో వెంట‌నే తెలిసిపోతుంది.  ఎస్ఎంఎస్ మాత్ర‌మే కాదు ఎంఎంఎస్ కూడా మ‌నం పంపుకోవ‌చ్చు.

మెసేజ్‌లు ఎలా పంపాలంటే..
మెసేజెస్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో ప్ల‌స్ బ‌ట‌న్‌ను క్లిక్ చేసి ముందుకెళ్లాలి. ప్ల‌స్ బ‌ట‌న్ క్లిక్ చేసిన త‌ర్వాత ఆ జాబితాలో చివ‌రి ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. తొలిసారి ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లైతే ప‌ర్మిష‌న్లు అడుతుంది. వాట‌న్నిటిని మీరు ఓకే చేయాలి.  అప్పుడు మీరు ఏ  లొకేష‌న్‌లో ఉన్నారో వెంట‌నే మీకు అప్‌డేట్ అయిపోతుంది. లొకేష‌న్ సెల‌క్ట్ చేసుకుని మెసేజ్ యాడ్ చేయాలి. స‌రైన లొకేష‌న్ చూపించ‌క‌పోతే ద‌గ్గ‌ర‌లో చూపిస్తున్న లొకేష‌న్ల‌ను ట్యాగ్ చేయ‌చ్చు. అక్క‌డ మీ మెసేజ్‌ను యాడ్ చేసి సెండ్ చేస్తే చాలు మీరు అనుకున్న‌వారికి ఆ మెసేజ్ మ్యాప్ రూపంలో వెళ్లిపోతుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు