• తాజా వార్తలు

వాట్స‌ప్‌లో వేరే వాళ్ల‌ను ఉద్దేశించి కోట్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

వాట్స‌ప్ వాడ‌ని వాళ్లు అరుదు ఇప్పుడు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్‌..అందులో వాట్స‌ప్‌! ఇది చాలా కామ‌న్. అయితే అంద‌రూ వాట్స‌ప్ వాడుతున్నా అందులో ఉండే ఫీచ‌ర్ల‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునేవాళ్లు మాత్రం త‌క్కువే. ఆ ఫీచ‌ర్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌చ్చితంగా మ‌నం బెట‌ర్‌గా వాట్స‌ప్ నుంచి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. అందులో ముఖ్య‌మైంది కోట్ చేయ‌డం. అంటే ఇది గ్రూప్ చాటింగ్‌లో బాగా ఉప‌యోగ‌ప‌డుంది. మీ చాట్ విండోలో ర‌క‌ర‌కాల మెసేజ్‌లు ఉన్నాయి. కానీ ఎవ‌రో  ఒక‌రిని ఉద్దేశించి మీరు వ్యాఖ్య చేయాల‌నుకుంటే కోట్ అనే ఆప్ష‌న్ మీకు యూజ్ అవుతుంది. మ‌రి ఈ ఆప్ష‌న్‌ను వాడ‌డం ఎలాగో చూద్దాం...

ఐఫోన్‌లో అయితే ఇలా..
వాట్స‌ప్ చాటింగ్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్ ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. మ‌రి ఐఫోన్లో ఎలా వాడాలో చూద్దాం. ఐఫోన్లో  వాట్స‌ప్ చాటింగ్ విండోలో కుడి వైపుకు డ్రాగ్ చేయాలి. దీని వ‌ల్ల మీరు అనుకున్న మెసేజ్‌ల‌ను మీ కొత్త మెసేజ్‌తో అటాచ్ చేయ‌చ్చు. అలాగే ఈ మెసేజ్‌ల‌ను మామూలుగానే సెండ్  చేయాలి.  మ‌నం సెండ్ చేయాల్సిన మెసేజ్‌ను  ఒక‌సారి చెక్ చేసుకుని పంపాలి. ఎందుకంటే మ‌నం క‌రెక్ట్ ప‌ర్స‌న్‌కు ఆ మెసేజ్‌ను పంపుతున్నామా లేదా వేరే ఏదైనా మెసేజ్ మ‌న కొత్త మెసేజ్‌కు అటాచ్ అయిందా అనేది చూసుకోవాలి.

ఆండ్రాయిడ్ ఫోన్లో ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్స‌ప్ చాటింగ్‌లో మెసేజ్‌ల‌ను ట్యాగ్ చేసి మ‌నం అనుకున్న‌వాళ్ల‌కు పంపుకోవ‌చ్చు. అంటే మ‌నం గ్రూప్ చాటింగ్ చేస్తున్న స‌మ‌యంలోనో లేదా సింగిల్ చాటింగ్‌లోనూ మునుప‌టి మెసేజ్‌ల‌కు స‌మాధానం ఇవ్వాలంటే సింపుల్‌. ఆ మెసేజ్‌ల‌ను ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి.  అప్పుడు ఆ మెసేజ్ కిందే మీకు టైప్ చేసే అవ‌కాశం వ‌స్తుంది. మీరు అనుకున్న మెసేజ్‌ను టైప్ చేసి దాన్ని సెండ్ చేస్తే చాలు.  దీని వ‌ల్ల మ‌నం ఎవ‌రికి, ఏం మెసేజ్ చేసినా అవత‌లి వారికి కోట్ అవుతుంది.                                                                                                                                                                          

జన రంజకమైన వార్తలు