• తాజా వార్తలు

ఐఫోన్లో ఇన్‌కమింగ్‌,  ఔట్ గోయింగ్ ఫోన్ కాల్స్ రికార్డు చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఐఫోన్‌... అత్యంత సెక్యూరిటీ ఉండే ఫోన్ అనే పేరుంది. దీనిలో ఉండే ఐఓఎస్ ఏ యాప్‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌దు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే దీన్ని వాడ‌డం కూడా చాలా క‌ష్టమే. అయితే సెక్యూరిటీ కోరుకునే వారికి ఇది బాగానే ఉంటుంది కానీ.. ఒక్కోసారి మ‌న‌కు అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో ఈ సెక్యూరిటీయే ప్ర‌తిబంధ‌కంగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాల‌ను ఉప‌యోగించి ఐఫోన్లో కూడా ఇన్‌కమింగ్‌, ఔట్ గోయింగ్ కాల్స్‌ను రికార్డు చేయ‌చ్చు. అదెలాగంటే...

మొద‌టి ప‌ద్ద‌తి
గూగుల్ వాయిస్ యాప్ సాధార‌ణంగా దీన్ని మీరు మీ స్నేహితుల‌కు, బంధువుల‌తో క‌మ్యునికేష‌న్ కోసం వాడ‌తారు. ముఖ్యంగా అమెరికా, కెన‌డా లాంటి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ల‌తో త‌క్కువ ఖ‌ర్చులో మాట్లాడ‌టానికి ఈ యాప్ బాగాఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్పుడు ఇదే యాప్‌ ద్వారా ఐఫోన్లో ఇన్‌క‌మింగ్‌, ఔట్ గోయింగ్ కాల్స్‌రికార్డు చేసే అవ‌కాశం ఉంది. 

1. మొద‌ట ప్లే స్టోర్‌ గూగుల్  వాయిస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

2. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి యాప్‌ను ఓపెన్ చేయాలి. 

3. గూగుల్ అకౌంట్ ద్వారా ఈ యాప్‌లో సైన్ ఇన్ కావాలి. మీ దేశానికి త‌గ్గ‌ట్టుగా ఉండే ఫోన్ నంబ‌ర్‌తో కూడా మీరు సైన్ అప్ కావొచ్చు.

4. దీనిలో ఉన్న మెనూను ఓపెన్ చేసి ఎడ‌మ‌వైపు ఉన్న త్రి డాట్స్‌ను క్లిక్ చేయాలి. అందులో కాల్ రికార్డింగ్ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి. 

5. ఆ త‌ర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కాల్స్ ఆప్ష‌న్ ట్యాప్ చేయాలి. మీకో ఇన్‌క‌మింగ్ కాల్ ఆప్ష‌న్ వ‌స్తుంది దాన్ని ట్యాప్ చేయాలి. అంతే.. మీ ప‌ని పూర్త‌యిన‌ట్లే.. ఐఫోన్లోనూ మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవ‌చ్చు.

రెండో ప‌ద్ధ‌తి..

1. టెపియా కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

2. దాన్ని మీద ట్యాప చేసి రికార్డు బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి

3. ఈ యాప్ ఆటోమెటిక్‌గా మీ రికార్డింగ్ లైన్‌ను డ‌య‌ల్ చేస్తుంది. ఆన్స‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడండి

4. ఆ త‌ర్వాత యాడ్ కాల్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.  మీ ఫోన్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. 

5.అటు వైపు ఫోన్ ఎత్త‌గానే రెండు కాల్స్‌ను క‌లిపేయ‌చ్చు.

జన రంజకమైన వార్తలు