• తాజా వార్తలు
  •  

రీసైకిల్‌ బిన్‌లో ఎంప్టీ చేసినాక కూడా ఫైల్స్‌ను తిరిగి రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా ?

రీసైకిల్‌బిన్‌... కంప్యూట‌ర్ తెలిసిన వాళ్ల‌కు ఇది దీని గురించి తెలియ‌న‌వాళ్లు ఉండ‌రు. ఎందుకంటే కంప్యూట‌ర్‌లో డ‌స్ట్‌బిన్ లాంటిది ఇది. మ‌న‌కు అవ‌స‌రం లేనివి, వృథాగా ప‌డి ఉన్న ఫైల్స్‌, ఫోల్డ‌ర్ల‌ను డిలీట్ చేసి రీసైకిల్‌బిన్‌కే త‌ర‌లిస్తాం. అయితే ఒక‌సారి డిలీట్ చేసిన ఫైల్స్ మ‌ళ్లీ కావాలంటే రీసైకిల్‌బిన్‌కు వెళ్లి రీస్టోర్ చేసుకుంటే అవి తిరిగి డెస్క్‌టాప్ మీద‌కు వ‌స్తాయి. అయితే రీసైకిల్‌బిన్‌లోనూ డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందాలంటే? అదెలా సాధ్యం అంటారా...దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

హార్డ్‌డిస్క్‌లో వెతికిప‌ట్టి...
కంప్యూట‌ర్‌లో మ‌నం ఏదైనా ఫైల్‌ను డిలీట్ చేస్తే ఆ ఫైల్స్ నేరుగా రీసైకిల్‌బిన్‌కు వెళ్లిపోతాయి. అయితే రీసైకిల్‌బిన్‌లో డిలీట్ చేసిన ఫైల్స్ మ‌రి ఎక్క‌డికి వెళ‌తాయి? అస‌లు ఆ ఫైల్స్ కంప్యూట‌ర్‌లో ఉంటాయా? ..పూర్తిగా మాయం అయిపోతాయా? ..ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. అయితే మ‌నం రీసైకిల్‌బిన్‌లోనూ డిలీట్ చేసిన ఫైల్స్ కంప్యూట‌ర్‌లోనే ఒక చోట నిక్షిప్త‌మై ఉంటాయ‌న్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. ఈ డిలీటెడ్ ఫైల్స్ హార్డ్‌డిస్క్‌లో దాగుంటాయి. అది కూడా చాలా కంప్రెస్డ్ ఫార్మాట్లో ఉంటాయి.  ఈ ఫైల్స్‌ను మ‌నం బ‌య‌ట‌కు చూడ‌లేం. ఈ ఫైల్స్‌ను వెతికి తీయ‌డానికి కొన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి. డిస్క్ డ్రిల్ అనే సాఫ్ట్‌వేర్‌ల సాయంతో డిలీటెడ్ ఫైల్స్ తిరిగి పొందొచ్చు. 

డిస్క్‌డ్రిల్‌తో ఎలా తీయాలంటే..
విండోస్‌లో డిలీట్ చేసిన ఫైల్స్‌ను రిక‌వ‌ర్ చేయ‌డానికి డిస్క్‌డ్రిల్ టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ముందుంగా మ‌నం హ్యాండి రిక‌వ‌ర్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయాలి. దీనిలో ఉండే ఫ్రీ వెర్ష‌న్ ద్వారా మ‌నం 500 ఎంబీ డేటా వ‌ర‌కు రిక‌వ‌ర్ చేయ‌డానికి ప‌నికొస్తుంది. ఇంకా ఎక్కువ డేటాను రివ‌క‌ర్ చేయాలంటే మీ ప్రొఫెష‌న‌ల్ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా డిక్‌డ్రిల్‌ను డౌన్‌లోడ్ చేసి పీసీలో ఇన్‌స్టాల్ చేయాలి.  ఆన్‌స్క్రీన్ నిబంధ‌న‌లు పాటిస్తూ కొన్ని క్లిక్స్ చేస్తే చాలు ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒక‌సారి ఇన్‌స్టాల్ అయిన త‌ర్వాత స్టార్ మెనూ దగ్గ‌రే మీకు ఒక ప్ర‌త్యేక‌మైన ఐకాన్ క‌నిపిస్తుంది. మీరు స్కాన్ చేయాల‌నుకుంటున్న డ్రైవ్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఇ-డ్రైవ్‌లో మీ ఫైల్స్ డిలీట్ అయితే ఇ డ్రైవ్ సెల‌క్ట్ చేసుకోవాలి. దీనిలో డీప్ స్కాన్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన ఫైల్ దొరికిన త‌ర్వాత రిక‌వ‌ర్ ఆప్షన్ కొడితే చాలు.

జన రంజకమైన వార్తలు