• తాజా వార్తలు
  •  

సెర్చి బాక్సు వాడకుండా వెబ్ సైట్లో సెర్చి చేయడమెలా?


ఇంటర్నెట్ విస్తరించాక ప్రపంచంలోని ఏ సమాచారం కావాలన్నా దాదాపుగా దొరికేస్తుంది. ముఖ్యంగా గూగుల్ సెర్చి ఇంజిన్ గురించి తెలియంది ఎవరికి? మన మెదడుకు ఎక్సటర్నల్ మెమొరీయా అన్నంతగా గూగుల్ సెర్చింజన్ ను వాడుకుంటున్నాం. గూగుల్ స్థాయిలో కాకపోయినా యాహూ, బింగ్ వంటి ఎన్నో సెర్చింజన్లు వాడుకలో ఉన్నాయి.
అయితే... ఏదైనా వెబ్ సైట్లో మన సమాచారం కోసం చూస్తున్నప్పుడు ఒక్కోసారి వెంటనే దొరక్కపోవచ్చు. అంతేకాకుండా అందులో ఎన్నో కంపోనెంట్స్, సబ్ ఫీచర్స్ ఉంటే మనకు కావాల్సింది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టం. అందులోనూ సైట్ నేవిగేషన్ కరెక్టుగా లేకపోతే మరీ ఇబ్బంది. ఒక్కోసారి కావాల్సిన సమాచారం ఉన్న డాక్యుమెంట్లు కానీ, డాటా పార్టు కానీ కనిపించినా అందులోనూ మనకు కావాల్సింది దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఆ సైట్లో ఉండే సెర్చి ఆప్షన్ వాడుతుంటాం. కానీ, అది పనిచేయకపోవచ్చు, లేదంటే కొన్నికొన్ని సైట్లలో అసలు సెర్చి ఆప్షనే ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ‘‘కంట్రోల్ ఎఫ్’’ కొట్టి ఫైండ్ ఆప్షన్ వాడినా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డైరెక్టుగా ఏదైనా సెర్చింజన్లోనే మనకు కావాల్సిన సైట్లోని సమాచారాన్ని వెతికే ఛాన్సుంది. అదెలాగో చూడండి....
అదెలా...?
తొలుత గూగుల్ కానీ, ఇంకేదైనా సెర్చింజన్ కానీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ చేశాక మీరు ఏం వెతకాలనుకుంటున్నారో ఆ కీ వర్డ్స్ కొట్టాలి. దాంతో మీరు ఏ సైట్లో ఆ సమాచారం వెతుకుతున్నారో ఆ సైట్ అడ్రస్ కూడా కొట్టండి.
ఉదాహరణకు మీరు.. వాట్స్ యాప్ కు సంబంధించిన ఆర్టికల్స్ కోసం ‘‘కంప్యూటర్ విజ్ఞానం’’ వెబ్ సైట్లో వెతకాలనుకుంటే ‘‘వాట్స్ యాప్ site computervignanam.net’’ అని సెర్చింజన్లో టైప్ చేయాలి. ఏ సెర్చింజన్లోనైనా ఈ విధానం పనిచేస్తుంది. ఇక జనరల్ సెర్చి మాదిరిగానే ఆల్, ఇమేజెస్, న్యూస్ ఇలా సబ్ కేటగిరీల్లోనూ సెర్చి చేసుకుని కావాల్సింది చూసుకోవచ్చు.
చాలా సులభం
ఇలా వెతకడం చాలా సులభంగా ఉంటుంది. ఏం వెతకాలనుకుంటున్నామో ఆ విషయం, వెబ్ సైట్ పేరు కరెక్టుగా ఉంటే సెర్చి రిజల్ట్స్ కూడా కరెక్టుగా వస్తాయి. ఇంకేముంది ఇంటర్నెట్ వెతుకులాటలో ఈ టిప్ వాడి టైం సేవ్ చేసుకోండి.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు