• తాజా వార్తలు
  •  

డైరెక్ట్ గా మీ ఆధార్ నంబ‌ర్ కి డ‌బ్బులు పంప‌డం ఎలా?

డిజిట‌ల్ యుగంలో అంతా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా భార‌త్‌లో డీమానిటైజేష‌న్ త‌ర్వాత ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. పేటీఎం లాంటి యాప్‌ల వాడ‌కం బాగా ఎక్కువైంది. ఇటీవ‌ల వ‌చ్చిన గూగుల్ తేజ్ మ‌రో అడుగు ముందుకేసి స్క్రాచ్ కార్డుల ద్వారా వినియోగ‌దారుల్లోకి చొచ్చుకెళ్లిపోయింది. అన్ని ట్రాన్సాక్ష‌న్లు యూపీఐ ద్వారానే జ‌రుగుతున్నాయి. ఎన్‌పీసీఐ ప్ర‌వేశ‌పెట్టిన భీమ్ యాప్ కూడా దూసుకుపోతోంది.  మ‌రి భీమ్ యాప్‌తో ఆధార్ నంబ‌ర్ల‌కు డ‌బ్బులు ఎలా పంపించుకోవాలో చూద్దామా!

ఎన్‌పీసీఐ ద్వారా..
నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ భీమ్ యాప్‌ను రూపొందించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌ను ఉప‌యోగించుకుని డ‌బ్బులు పంప‌డం, డ‌బ్బ‌లు రిసీవ్ చేసుకోవ‌డం చేయ‌డ‌మే ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌.  ప్ర‌స్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్‌లో మాత్రమే లభ్యం అవుతోంది. ఇటీవ‌లే ఇది ఒక కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది అదే  ఆధార్ పేమెంట్స్‌.  అంటే మ‌నం ఎవ‌రికైనా డ‌బ్బులు పంపాలంటే అవ‌త‌లి వాళ్ల ఆధార్ నంబ‌ర్ ఉంటే స‌రిపోతుంది. అంత‌క‌న్నా ముందు ఆ నంబ‌ర్ బ్యాంకు అకౌంట్‌కు అనుసంధానం అయిందో లేదో చూసుకోవాలి. వ‌ర్చువ‌ల్ పేమెంట్ అడ్రెస్ లేక‌పోయినా ఇది  ప‌ని చేస్తుంది.  ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేమంటే మ‌నం డ‌బ్బులు పంపాల‌నుకున్న వాళ్ల‌కు ఆధార్ కార్డు ఉండాలి. అంతేకాదు అది బ్యాంకు అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి.

ఎలా పంపాలంటే..
మీ ఫోన్‌లో భీమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత సెండ్ మ‌నీ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

కుడి చేతి వైపు టాప్ కార్న‌ర్‌లో ఉన్న‌మూడు డాట్స్‌ను క్లిక్ చేయాలి.  ఆ త‌ర్వాత ఆధార్ పే మీద క్లిక్ చేయాలి

ఆపై మీరు ఎవ‌రికైతే మ‌నీ పంపాల‌నుకుంటున్నారో వారి ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్  చేయాలి.

ఆ త‌ర్వాత వెరిఫై ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి. ఇది  బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ నంబ‌ర్ లింక్ అయిందో లేదో వెరిఫై చేస్తుంది. మీ డ‌బ్బులు పంపే ఆధార్ నంబ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తుంది. డ‌బుల్ చెక్ చేసుకోవాలి

ఎంత డ‌బ్బులు పంపాలో ఆ మ‌నీ ఎంట‌ర్ చేయాలి

చివ‌ర్లో పే.. అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే చాలు మీ ట్రాన్సాక్ష‌న్ పూర్త‌యిన‌ట్లే.

జన రంజకమైన వార్తలు