• తాజా వార్తలు

న‌చ్చిన పాట‌ను జియో కాల‌ర్‌ట్యూన్‌గా సెట్ చేసుకోవ‌డం ఎలా ?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

జియో సిమ్ వాడుతున్న‌వాళ్లంతా త‌మ ఫేవ‌రెట్ సాంగ్‌ను కాల‌ర్ ట్యూన్‌గా పెట్టుకోవ‌చ్చు. అది కూడా ఫ్రీగా.  మెసేజ్ ద్వారా, జియో మ్యూజిక్ యాప్ ద్వారా గానీ వేరేవాళ్ల కాల‌ర్ ట్యూన్‌ను * బ‌ట‌న్ నొక్కి గానీ కాల‌ర్ ట్యూన్ సెట్ చేసుకోవ‌చ్చు.  జియో కాల‌ర్ ట్యూన్‌ను ఫ్రీగా ఎలా సెట్ చేసుకోవాలో ఈ ఆర్టిక‌ల్‌లో చ‌దద‌వండి.
మెసేజ్ ద్వారా కాల‌ర్ ట్యూన్ సెట్ చేసుకోవ‌డం
1.మెసేజ్ యాప్‌లోకి వెళ్లి JT అని టైప్ చేసి 56789 నెంబ‌ర్‌కు మెసేజ్ చేయండి. 
2. ఇప్పుడు మీకు జియో కేర్ నుంచి రిప్లై వ‌స్తుంది. 
3. ఇప్పుడు మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి.  బాలీవుడ్ కేట‌గిరీ నుంచి సాంగ్ కావాలంటే 1 నెంబ‌ర్,  తెలుగు, త‌మిళ్‌, కన్న‌డ వంటి ప్రాంతీయ భాషల్లో సాంగ్ కావాలంటే 2, ఇంట‌ర్నేష‌నల్ కేటగిరీ నుంచి పాట కావాలంటే  3 టైప్ చేసి అదే మెసేజ్‌కు రిప్ల‌యి ఇవ్వాలి.
* మీకు ఫ‌లానా సాంగ్ కావాల‌ని ఓ ఐడియా ఉంటే ఆ పాట‌లోని తొలి మూడు ప‌దాల‌ను మెసేజ్ చేసి రిప్ల‌యి ఇవ్వాలి.
* మీకు ఫ‌లానా సినిమాలోని సాంగ్ కావాల‌ని ఓ ఐడియా ఉంటే ఆ MOVIE .టైప్ చేసి రిప్ల‌యి ఇవ్వాలి. ఉదాహ‌ర‌ణ‌కు బాహుబ‌లి పాటలు కావాలంటే Movie name అన్న ప్లేస్‌లో BAHUBALI అని టైప్ చేసి పంపాలి. అలాగే ఓ ఆల్బ‌మ్ కావాలంటే ALBUM , సింగ‌ర్ పాట కావాలంటే  SINGER 4. మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక ప‌ర్టిక్యుల‌ర్ ఆప్ష‌న్ నెంబ‌ర్‌తో జియో కేర్‌కు మెసేజ్ పంపాలి. ఇప్పుడు మీకు క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌స్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న‌సాంగ్‌ను కాల‌ర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవాలంటే  Y అని టైప్ చేసి 5676-70040 నెంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
5. ఇప్పుడు మీరు కోరుకున్న కాల‌ర్ ట్యూన్ యాక్టివేట్ అయిపోయింది.
జియో మ్యూజిక్ యాప్ ద్వారా  
మెసేజ్ స‌ర్వీస్ కంటే ఈజీగా జియో కాల‌ర్ ట్యూన్ యాక్టివేట్ చేసుకోవాలంటే జియో మ్యూజిక్ యాప్ బెస్ట్ ఆప్ష‌న్‌. 
1.మీ ఆండ్రాయిడ్ లేదా ఐ ఫోన్‌లో జియో మ్యూజిక్ (JioMusic)యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. జియో మ్యూజిక్ యాప్‌ను ఓపెన్‌చేసి సాంగ్ సెర్చ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి
3. సాంగ్ ప్లే స్క్రీన్ ఓపెన్ చేస్తే  Set as JioTune ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్నిక్లిక్‌చేస్తే ఆ సాంగ్ మీ జియో కాల‌ర్ ట్యూన్‌గా సెట్ అయిపోతుంది. 
ట్యూన్‌ను కాపీ చేసి కాల‌ర్ ట్యూన్‌గా సెట్ చేసుకోవ‌డం
ఇది ఇంకా ఈజీ మెథ‌డ్‌. ఎవ‌రిదైనా కాల‌ర్ ట్యూన్ మీకు న‌చ్చితే మొబైల్ కీ ప్యాడ్‌లోని * నొక్కాలి.  రిప్ల‌యి అడిగిన‌ప్పుడు Y నొక్కితే ఆ ట్యూన్ మీ జియో ఫోన్ కాల‌ర్ ట్యూన్‌గా సెట్ అవుతుంది.
ఇవి గుర్తు పెట్టుకోండి.
మీ కాల‌ర్ ట్యూన్‌ను ఎన్నిసార్ల‌యినా మార్చుకోవ‌చ్చు. కాల‌ర్ ట్యూన్ వ‌ద్ద‌నుకుంటే మీ జియో నెంబ‌ర్ నుంచి STOP అని టైప్ చేసి 56789 నెంబ‌ర్‌కు మెసేజ్ టైప్ చేస్తే కాల‌ర్ ట్యూన్ డీయాక్టివేట్ అవుతుంది.
 

జన రంజకమైన వార్తలు