ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, స్నాప్‌చాట్.. ఇలా సోషల్ మీడియాకు ఎన్నో రూపాలు. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను, ఎప్పుడో చిన్నప్పటి మిత్రులను మళ్లీ కలుపుతున్న వేదికలు. వీటితో ఎంత మేలు ఉందో జాగ్రత్తగా లేకపోతే అంత ప్రమాదమూ ఉంది. ముఖ్యంగా మీ అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేస్తే దాని నుంచి వేరెవరికైనా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపవచ్చు. లేకపోతే ఎవరి మీదైనా బ్యాడ్‌గా మెసేజ్‌లు పెట్టొచ్చు. ఈ విషయంలో మీతో క్లోజ్ గా ఉండేవారిని కూడా నమ్మలేని పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు. అందుకే మీ సోషల్ మీడియా అకౌంట్స్‌కు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవడం మంచిది. అప్పుడు మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తోపాటు అథెంటికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తేనే అకౌంట్ యాక్సెస్ అవుతుంది.
ఇన్స్టాగ్రామ్
ఫొటోషేరింగ్ ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌కు మంత్లీ 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. వీళ్లందరికీ టూ ఫాక్టర్ అథెంటికేషన్‌ను ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది.
* దీన్ని అనేబుల్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పేజీలోకి వెళ్లాలి .
* Settings ఐకాన్‌ను టాప్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే Two-Factor Authentication ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని టాప్ చేసి Require Security Codeను టర్న్ ఆన్ చేయాలి.
* ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌తో లింకయి ఉన్న ఫోన్ నెంబర్‌కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది.
* ఇప్పటి నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి లాగిన్ కావాలనుకున్న ప్రతిసారి మీ మొబైల్ నెంబర్‌కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే అకౌంట్ యాక్సెస్ అవుతుంది.
లింక్డిన్
ప్రొఫెషన్ బేస్డ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారం ఇది. 2012లో లింక్డిన్ఒకసారి సెక్యూరిటీ థ్రెట్‌ను ఫేస్ చేసింది. దాదాపు 65 లక్షల అకౌంట్స్ ఎఫెక్ట్ అయినట్లు అప్పట్లోనే లింక్డిన్ ప్రకటించింది. తర్వాత మరోసారి కోటి మందికి పైగా యూజర్లు దీని బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో లింక్డిన్ కూడా టూ ఫాక్టర్ అథెంటికేషన్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ఇది హైలీ రికమండెడ్ అని చెబుతోంది.
* అనేబుల్ చేసుకోవడానికి LinkedIn’s privacy settingsలోకి వెళ్లాలి.
* సెక్యూరిటీ ట్యాబ్‌లో స్క్రోల్ డౌన్ చేసి Change next to Two-step verification ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేయాలి.
* ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. దీన్ని అక్కడున్న బాక్స్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* మీ లింక్డిన్ అకౌంట్‌కు టూ ఫాక్టర్ అథెంటికేషన్ అనేబుల్ అయింది.
స్నాప్‌చాట్
స్నాప్‌చాట్‌లోనూ టూ ఫాక్టర్ అథెంటికేషన్ అందుబాటులో ఉంటుంది.
* మీ మొబైల్లో స్నాప్‌చాట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్కు కిందిభాగంలో ఉన్న ghost ఐకాన్‌ను టాప్ చేయాలి.
* settings ఐకాన్‌ను టాప్ చేసి స్క్రోల్ డౌన్ చేసి Login Verification ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
* verify via Text లేదా Authentication appను సెలెక్ట్ చేసుకోవాలి.
*( verify via Text ను సెలెక్ట్ చేసుకుంటే సెక్యూరిటీ కోడ్ మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. అదే Authentication app ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ అథెంటికేటర్ లాంటి యాప్‌ను ఉపయోగించి కోడ్‌ను జనరేట్ చేసుకోవాలి.
* ఈ కోడ్‌ను ఎంటర్ చేస్తే మీ స్నాప్‌చాట్ అకౌంట్‌కు టూ ఫాక్టర్ అథెంటికేషన్ అనేబుల్ అయినట్లే.