• తాజా వార్తలు
  •  

కాంటాక్ట్స్‌ను బ‌ల్క్‌గా షేర్ చేయ‌డం ఎలా? 

మ‌న ఫోన్ బుక్‌లో వంద‌ల కొద్దీ కాంటాక్ట్స్‌ ఉంటాయి.  ఇంట‌ర్నెట్ ప్రొవైడ‌ర్ నుంచి కేబుల్ స‌ర్వీస్ బాయ్ వ‌ర‌కు, గ్యాస్ ఏజెన్సీ నుంచి ఆఫీస్‌లో బాస్ ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్ వ‌ర‌కు  కాంటాక్ట్స్‌లో చోటిస్తాం.  ఒక‌ప్పుడు ఎవ‌రికైనా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వాలంటే మ‌నం ఫోన్‌లో చూసి చెబితే వాళ్ల ఫోన్‌లో సేవ్ చేసుకునేవారు. ఇప్పుడు ఈజీగా షేర్ చేసేస్తున్నాం. కానీ బ‌ల్క్‌గా ఎక్కువ కాంటాక్ట్స్ పంపాలంటే ఎలా?  దానికీ యాప్స్ ఉన్నాయి. చూద్దాం ప‌దండి. 
1. షేర్ కాంటాక్ట్స్‌(Share Contacts)
ప్లే స్టోర్‌లో ఫ్రీగా దొరికే యాప్ ఇది. ఈ ఆండ్రాయిడ్ యాప్‌తో మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని ఎన్ని కాంటాక్ట్స్‌నైనా ఎవ‌రికైనా ఈజీగా షేర్ చేయొచ్చు. ఎస్ఎంఎస్‌, ఈమెయిల్‌, వాట్సాప్ లాంటి ఎలాంటి వాటికైనా కాంటాక్ట్స్ షేర్ చేయొచ్చు. అంతేకాక కాంటాక్ట్స్‌లో ఎంత వ‌ర‌కూ ఇన్ఫ‌ర్మేష‌న్ సెండ్ చేయాలంటే అంత‌వ‌ర‌కే చేయొచ్చు. అంటే ఇప్పుడు మ‌న కాంటాక్ట్స్‌లిస్ట్‌లో కాంటాక్ట్ పేరు, నెంబ‌ర్‌తోపాటు మెయిల్ ఐడీ, ఫేస్‌బుక్ అకౌంట్ ఇవ‌న్నీ సింక‌వుతున్నాయి క‌దా. అవేమీ కాకుండా ఓన్లీపేరు, ఫోన్ నెంబ‌ర్ కావాలంటే అవే సెండ్ చేసే ఆప్ష‌న్ ఉంది. 
2. సెండ్ కాంటాక్ట్స్ (Send Contacts)
మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న నెంబ‌ర్లు కొన్ని సెన్సిటివ్ కావ‌చ్చు. మ‌రికొన్ని ప‌ర్స‌న‌ల్ కావ‌చ్చు. మీకు కావాల్సిన వ్య‌క్తికి వాటిని షేర్ చేసేట‌ప్పుడు పొర‌పాటున వేరేవాళ్ల‌కు వెళితే మిస్ యూజ‌య్యే ప్ర‌మాదం ఉంది. సెండ్ కాంటాక్ట్స్ యాప్ ద్వారా మీరు ఏ కాంటాక్ట్‌ను ఎవ‌రికి పంపుతున్నారో స్ప‌ష్టంగా చూసుకోవ‌చ్చు. ఇది కూడా షేర్ కాంటాక్ట్స్ మాదిరిగానే ప‌ని చేసే యాప్‌.  మీరు ఒక  నెంబ‌ర్‌ను సెలెక్ట్ చేసుకుని మిగిలిన కాంటాక్ట్స్ నెంబ‌ర్ల‌ను ఆ నెంబ‌ర్‌కు ఈజీగా  ఎస్ఎంఎస్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్స్‌లో సెండ్ చేయొచ్చు.  
3. కాంటాక్ట్ బాక్స్  (ContactBox)
ఎక్కువ కాంటాక్ట్స్ ఒకేసారి షేర్ చేసుకోవ‌డానికి ప‌నికొచ్చే మ‌రో ఆండ్రాయిడ్ యాప్ ఇది.  అయితే మీరు, మీరు కాంటాక్ట్స్ సెండ్ చేయాల‌నుకునే ప‌ర్స‌న్ ఇద్ద‌రూ ఈ కాంటాక్ట్ బాక్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది.  ఈ యాప్‌తో మీ కాంటాక్ట్స్‌ను డిఫ‌రెంట్ లిస్ట్‌లుగా డివైడ్ చేసుకోవ‌చ్చు. కాంటాక్ట్స్ ఇన్ఫో మొత్తాన్ని ఒకేచోట సింక్ చేసుకోవ‌చ్చు.  ఈయాప్ నుంచే మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని నెంబ‌ర్ల‌కు డైరెక్ట్‌గా కాల్‌, మెసేజ్‌, మెయిల్ కూడా చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు